twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బుల్లితెరపై కోట్లు సంపాదిస్తున్న స్టార్లు....రోజుకు కోట్లలో!

    By Bojja Kumar
    |

    ముంబై : పేరుకు బుల్లితెరే గానీ...బుల్లితెర పై ప్రసారం అయ్యే రియాల్టీషోల ద్వార వచ్చే ఆధాయం మాత్రం బుల్లిగా ఉండటం లేదు. ఈ మధ్య నేషనల్ టీవీ ఛానల్స్‌లో వచ్చే కార్యక్రమాల ఆదాయం వందల కోట్లలో ఉంటోందటంటే అతిశయోక్తి కాదేమో. దేశవ్యాప్తంగా ప్రసారం అయ్యే ఈ షోలకు టెర్రిఫిక్ రెస్పాన్స్ తెప్పించేందుకు సెల్రబిటీలను ఆ షోలలో భాగస్వామ్యం చేస్తున్నారు నిర్వాహకులు. ఇందుకోసం వాళ్లకి కళ్లు పైర్లు కమ్మే రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నారు. అది కూడా రోజుల లెక్కతో..

    అందుకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే మనకు దిమ్మ దిరగడం ఖాయం. తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం ప్రస్తుతం బుల్లి తెరపై అమీర్ ఖాన్ షో 'సత్యమేవ జయతే', అమితాబ్ బచ్చన్ షో 'కౌన్ బనేగా కరోడ్ పతి', సల్మాన్ ఖాన్ షో 'బిగ్ బాస్', షారుఖ్ ఖాన్ షో 'టోటల్ వైప్ ఔట్ : జోర్ కా జట్కా', హృతిక్ రోషన్ 'జస్ట్ డాన్స్', అక్షయ్ కుమార్ 'కత్రోంకి కిలాడి', మాధురి దీక్షిత్ 'జలక్ ధిఖ్లా జా' లాంటి షోలు బాగా పాపులర్ అయ్యాయి. అత్యధికంగా టీఆర్‌పి పొందుతున్న కార్యక్రమాలు ఇవి.

    ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు గాను ఒక్కొక్కరు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. 'సత్యమేవ జయతే' కార్యక్రమానికి నిర్వాహకులు అమీర్ ఖాన్‌కు ఒక్కో ఎపిసోడ్‌కి రూ. 3 కోట్లు ఆఫర్ చేస్తున్నారట. అమితాబ్ బచ్చన్‌తో కౌన్ బనేగా కరడ్ పతి కార్యక్రమం రూపొందించిన నిర్మాతలు....5, 6, 7 సీజన్లకి కలిపి టోటల్ 100 కోట్ల డీల్ మాట్లాడుకున్నారని టాక్.

    అదే విధంగా బిగ్ బాస్ 6లో పాల్గొన్న సల్మాన్ ఖాన్‌కి రోజుకు రూ. 3.25 కోట్లు, షారుఖ్ ఖాన్ 'టోటల్ వైప్ ఔట్ : జోర్ కా జట్కా కార్యక్రమానికి రోజుకు 2 కోట్లు వసూలు చేసాడని టాక్. ఇక అక్షయ్ కుమార్ అక్షయ్ కుమార్ 'కత్రోంకి కిలాడి ' సీజన్ 4లో పాల్గొని రోజుకు రూ. 1.5 కోట్లు వెనకేసుకున్నాడట. ఇక బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న సంజయ్ దత్, మాధురి దీక్షిత్ 'జలక్ ధిఖ్లా జా' కార్యక్రమం కోసం రోజుకు కోటి చొప్పున చార్జ్ చేసారని సమాచారం అందుతోంది.

    English summary
    "Star bucks on TV...Aamir Khan: Satyamev Jayate- Rs. 3 crore a day, Amitabh Bachchan: Bulk deal for KBC 5, 6, 7- Rs. 100 crore, Salman Khan: Bigg Boss season 6- Rs. 3.25 crore a day, Shah Rukh Khan: Total Wipeout: Zor Ka Jhatka- Rs. 2 crore a day, Hrithik Roshan: Just Dance- Rs. 2 crore a day, Akshay Kumar: Khatron Ke Khiladi season 4- Rs. 1.5 crore a day, Sanjay Dutt: Bigg Boss season 5- Rs1 crore a day" hindustantimes published.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X