‘నా కళ్ల ముందే కొట్లాట.. అన్ని టీవీ షోల్లో జరిగేదంతా ఇదే’
తెలుగు ప్రేక్షకులను తన డ్యాన్స్ తో వావ్ అనిపించారు స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. ఆయన డ్యాన్స్ కు ఫిదా అవ్వనివారంటూ ఉండరు. ఢీషోలో డ్యాన్సర్ గా మొదలైన ఆయన కెరీర్ ప్రస్తుతం భారీ చిత్రాలకు పనిచేసే స్థాయికి చేరుకుంది. ఇక టెలివిజన్ రంగంలోనూ డ్యాన్స్ షోలు, రియాలిటీ షోలకు తనకు జడ్జీగానూ వ్యవహరిస్తూ అలరిస్తున్నారు. అయితే ఆయన జడ్జీగా వ్యవహరించి షోల్లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు, కొట్లాటలు, మాటల యుద్ధం, పలు విమర్శలపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
శేఖర్ మాస్టర్ అటు స్టార్ హీరోల చిత్రాలకు కొరియోగ్రఫీ అందిస్తూనే మరోవైపు టీవీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తూ వస్తున్నారు. తనదైన శైలిలో రియాలిటీ షోల్లో తీర్పులు ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక బుల్లితెర ఆడియెన్స్ కు కూడా వినోదాన్ని పంచుతున్నారు. ఇదిలా ఉంటే.. ఢీ షో, కిర్రార్ బాయ్స్ ఖిలాడీ లేడీస్ వంటి షోల్లో జడ్జీగా వ్యవహిరించే సమయంలో కొంత ఘర్షణలు జరిగాయి. అయితే కంటెస్టెంట్స్ మధ్య జరిగిన మాటల యుద్ధాలు, గొడవలు అంతా స్క్రిప్టెడ్ అంటూ పలువురు అభిప్రాయపడ్డారు. కానీ దీనిపై తాజాగా శేఖర్ మాస్టర్ యాంకర్ నిఖిల్ ఇంటర్వ్యూలో స్పందించారు.

ఇక శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. 'టీవీ షోల్లో జరిగేవన్నీ నిజాలే. రియాలిటీ షోల్లో జరిగేవన్నీ వాస్తవాలే. జనాలకు తెలియక ఏదేదో అనుకుంటారు. అన్నీ అబద్ధాలు అనుకుంటారు. ఇక నేను సినిమా షూటింగ్ ల్లో ఉంటే మాత్రం చాలా టెన్షన్ గా ఉంటాను. సాంగ్ బాగా రావాలి. హీరో హీరోయిన్ తో బాగా చేయించాలనే ఒత్తిడి బాగా ఉంటుంది. దాంతో చాలా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కానీ టీవీ షోలకు వస్తే మాత్రం రిలాక్స్ గా ఉంటాను. టీవీ షోలో ఎలాంటి టెన్షన్ ఉండదు. వాళ్లు చేసే పెర్ఫామెన్స్ చూసి ఎంజాయ్ చేస్తూ, సరైన జడ్జిమెంట్ ఇస్తే సరిపోతుంది. స్ట్రెస్ మొత్తం పోతుంది.
కానీ టీవీ షోల్లో పనిచేయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అయితే కొంత మంది అనుకుంటారు. వీళ్లు ఏదో క్రియేట్ చేసి ఉంటారని అంటుంటారు. కానీ రియాలిటీ ష్లో జరిగే గొడవలన్నీ నిజమే. బాయ్స్ టీమ్, లేడీస్ టీమ్ ల మధ్య జరిగే కొట్లాటలు కూడా నిజంగానే ఉంటాయి. అంతేకానీ మనం నువ్వు ఇలా తిట్టు, ఇలా మాట్లాడు అని అనరు. కొన్ని సందర్భాల్లో నేను కూడా అరిచేశాను. మన టీమ్ గెలవాలనే క్రమంలో మాటలు యుద్దాలు జరుగుతూనే ఉంటాయి. ఎలాంటి స్క్రిప్ట్ ఉండదు. అవన్నీ వాస్తవాలే.' అని చెప్పుకొచ్చారు.
2007 నుంచి శేఖర్ మాస్టర్ తెలుగు చిత్రాలకు బ్యాక్ టు బ్యాక్ కొరియోగ్రఫీ అందిస్తూ వస్తున్నారు. అంతకు ముందే 1997 నుంచి డ్యాన్సర్ గా టీవీ షోల్లో సందడి చేస్తూ వచ్చారు. 10 ఏళ్ల కష్ట తర్వాత సినిమా ఆఫర్లను అందుకున్నారు. ఛార్మీ కౌర్ మంత్ర చిత్రానికి తొలుత కొరియోగ్రఫీ అందించారు. సుధీర్ బాబు SMS చిత్రంతో తన కెరీర్ టర్న్ తిరిగింది. జూలాయి, బాద్షా, గుండెజారి గల్లంతైయిందే మొదలు 100 చిత్రాలకు పైగా కొరియోగ్రఫీ అందించారు. చివరిగా పుష్ప, దేవర, డాకూ మహారాజ్, తండేల్ వంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు. నెక్ట్స్ జన నాయగన్ అనే విజయ్ దళపతి చిత్రానికి పని చేస్తున్నారు. ఇక డ్యాన్స్ ఐకాన్ రియాలిటీ షోకు జడ్జీగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











