బిగ్ బాస్ 4 వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. సిద్ధంగా ఉన్న టాలీవుడ్ టాలెంటెడ్ కమెడియన్స్?
ఇండియన్ బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ హడావుడి మొదలైంది. కరోనా కష్ట కాలంలో ముందుగా తెలుగులో కింగ్ నాగార్జున గ్రాండ్ గా నాలుగవ సీజన్ ని స్టార్ట్ చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా షో చాలా కలర్ఫుల్ గా కనిపించింది. చూస్తుంటే ఈ సారి బిగ్ బాస్ షో ఊహించని రేటింగ్ అందుకొనున్నట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే షోలోకి వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎవరికి వారు ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న వారే.
Recommended Video

వైల్డ్ కార్డ్ ఎంట్రీ..
ఆదివారం 16మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన విధానం కూడా చాలా కొత్తగా అనిపించింది. ఇక 105రోజుల పాటు కొనసాగనున్న ఈ షోలో ఇప్పుడున్న 16మంది మాత్రమే కాకుండా మరికొందరు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్ లోకి రాబోతున్నారు. ఇక ప్రస్తుతం ఇద్దరు కమెడియన్స్ హౌజ్ లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ముక్కు అవినాష్ రెడీ..
ముక్కు అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అసలైతే మెయిన్ లిస్ట్ లోనే అవినాష్ ఉండాల్సింది అనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. కానీ ఎందుకో అతను కనిపించలేదు. దాదాపు ఫిక్స్ అనుకున్న సమయంలో అతను ఎంట్రీ ఇవ్వకపోవడంతో ఓ వర్గం ఆడియెన్స్ నిరాశకు గురయ్యారు.

ఈ రోజుల్లో ఫేమ్ సాయి కుమార్
ఇక మరో కమెడియన్ ఈ రోజుల్లో ఫేమ్ సాయి కుమార్ కూడా బిగ్ బాస్ హౌజ్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వస్తోంది. సాయి కుమార్ ఈ రోజుల్లో , బాస్ స్టాప్ వంటి సినిమాలతో మంచి క్రేజ్ అందుకుంమ విషయం తెలిసిందే. ఇక చాలా కాలంగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ కమెడియన్ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ఫస్ట్ ఎలిమినెట్ అయ్యేది ఎవరో..
ఇక ఆదివారం మొదలైన బిగ్ బాస్ హౌజ్ లో ప్రతి ఒక్కరు తమ మాటలతో ఎంతగానో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా టీవీ9 దేవి నాగవల్లి, లాస్య, మాట్లాడిన విధానం షోకి మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక మై విలేజ్ షో గంగవ్వ కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇక మొదటి వారం ఎవరు ఎలిమినెట్ అవుతారో తెలియాలి అంటే ఈ రోజు నుంచి మొదలయ్యే టాస్క్ లు ఎలా ఉంటాయో చూడాలి.


Click it and Unblock the Notifications











