Dhee: బుల్లితెరపైకి హన్సిక .. ఢీ షో కు జడ్జిగా దేశముదురు భామ!
బాలనటిగా కెరీర్ ప్రారంభించి కేవలం 15 ఏళ్లకే హీరోయిన్ గా మారిన బ్యూటీ హన్సిక మోత్వానీ. దేశముదురు సినిమాతో తెలుగుతెరకు పరిచమైన బబ్లీ బ్యూటీ హన్సిక.. మొదటి సినిమాతోనే హిట్ కొట్టి ఇండస్ట్రీని ఊపేసింది. నా కళ్ళతో చూడు మావా అని బన్నీ చెప్పిన డైలాగ్ తోనే హన్సికను కుర్రకారు అందరూ ఓ దేవతలా చూడడం మొదలుపెట్టారు. ఈ సినిమా చేసినప్పుడు ఆమె 10 వ తరగతి చదువుతుంది. దేశముదురు సెట్స్ లోనే ఆమె చదువుకుందని కూడా చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు.
ఇక ఈ సినిమా తరువాత హన్సిక కుర్ర హీరోల సరసన నటించి మెప్పించింది. నితీన్, రామ్, గోపీచంద్, విశాల్, విజయ్, ఇలా అందరితో నటించి మెప్పించిన ఈ భామ అవకాశాలను అందుకుంది కానీ, ఆశించిన విజయాలను అందుకోలేకపోయింది. దీంతో హన్సిక తెలుగుకు దూరమయ్యింది. కోలీవుడ్ లో ఈ భామ తన సత్తా చాటింది.

ఇక బొద్దుగా ఉన్న హన్సిక బక్కచిక్కి .. అందాల ఆరబోత చేయడం ప్రారంభించింది. చక్కన్నమ్మా చిక్కినా అందమే అన్నట్లు.. హన్సిక బొద్దుగా ఉన్నా టెడ్డీబేర్ లా బావుండేది.. సన్నగా మరి సన్నజాజి పువ్వులా ఉన్నా సెక్సీగా ఉంది. ఇక హన్సిక కెరీర్ మొత్తం వివాదాలే.. ప్రేమాయణాలే. ఒకటి కాదురెండు కాదు.. చెప్పుకుంటూ పోతే అమ్మడు చాలా ప్రేమాయణాలే నడిపింది. అందులో అందరికి తెల్సింది.. కోలీవుడ్ హీరో శింబుతో హన్సిక ప్రేమ. వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. ఇక ఆ సమయంలోనే వీరి మధ్య పరిచయం ప్రేమగా మారింది.
ఇక ఈ ప్రేమ పెళ్లి వరకు వెళ్తుంది అనుకొనేలోపు హన్సిక.. శింబుకు బ్రేకప్ చెప్పింది. ఆ తరువాత మరో స్టార్ హీరోతో హన్సిక ప్రేమలో పడిందని వార్తలు వచ్చాయి. ఇలా రూమర్స్ వస్తున్న నేపథ్యంలోనే అమ్మడు ఎట్టకేలకు పెళ్లి న్యూస్ చెప్పింది. అది కూడా పెద్ద కాంట్రవర్సీనే. హన్సిక.. తన బెస్ట్ ఫ్రెండ్ భర్తను వివాహమాడింది. రెండేళ్ల క్రితం సోహెల్ కతూరియాతో ఆమె వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. వీరి ప్రేమ వివాహం.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వెబ్ సిరీస్ లా స్ట్రీమింగ్ కూడా అయ్యింది.

ఇక పెళ్లి తరువాత కూడా ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత తగ్గించింది లేదు.. సినిమాల్లో కనిపించకుండా కూడా లేదు. అయితే ఇకముందు సినిమాలను ఆచితూచి ఎంచుకోవాలని మాత్రం హన్సిక ఫిక్స్అయ్యినట్లు తెలుస్తోంది. అయితే ఈ మధ్యనే హన్సిక.. తన సోషల్ మీడియా గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలిపింది. దీంతో అందరూ ఆమె తల్లికాబోతుందేమో అనుకున్నారు. కానీ, ఆ గుడ్ న్యూస్ ఏంటంటే.. బబ్లీ బ్యూటీ జడ్జిగా కొత్త అవతారం ఎత్తింది. ఈ మధ్యనే ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ సెలబ్రిటీ డ్యాన్స్ షో ఫైనల్స్ జరిగిన విషయం తెల్సిందే.
ఇక దానికి కంటిన్యూగా ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 మొదలయ్యింది. ఇక ఈ షోకు హన్సిక జడ్జిగా రాబోతుంది. ఇప్పటివరకు ప్రియమణి, సదా, పూర్ణ, శ్రీదేవి లాంటి హీరోయిన్లు ఈ షోకు జడ్జిలుగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు ఆ లిస్ట్ లో హన్సిక కూడా జాయిన్ అయ్యింది. అందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. వచ్చిరాని తెలుగులో హన్సిక ఎంతో ముద్దుగా మాట్లాడుతూ ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. మరి ఈ భామ జడ్జిగా అలరిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











