twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ మా పవర్ఫుల్ లైనప్.. RRR, పుష్ప సినిమాలతో పాటు మారో ఆరు సినిమాలు సొంతం..

    |

    ఈ రోజుల్లో సినిమాలు కేవలం థియేట్రికల్ గానే కాకుండా వివిధ రకాలుగా బిజినెస్ చేస్తూ నాన్ థియేట్రికల్ గా కూడా మంచి లాభాలను అందిస్తున్నాయి. ఇక ఓటీటీ హక్కుల్లో ఎంత పోటీ ఉందొ శాటిలైట్ హక్కుల్లో కూడా అంతే పోటీ నెలకొంది. ఇక అందులో స్టార్ మా ఛానెల్ శాటిలైట్ హక్కులను అందుకోవడంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో రాబోయే ఇంట్రెస్టింగ్ సినిమాల హక్కులన్ని 'స్టార్ మా'నే సొంతం చేసుకుంది. మొత్తం 8 సినిమాలు. వాటిపై ఒక లుక్కేస్తే..

    స్టార్ మా భారీ పెట్టుబడులు

    స్టార్ మా భారీ పెట్టుబడులు

    ఒక సినిమా సెట్స్ పైకి వచ్చింది అంటే గతంలో టెలివిజన్ ఛానెల్స్ లలోకి వచ్చేసరికి చాలా సమయం పట్టేది. కానీ ఈ రోజుల్లో మాత్రం రెండు మూడు వారాల అనంతరం ముందుగా ఓటీటీలోకి వచ్చి ఆ తరువాత టీవీలలో టెలిక్యాస్ట్ అవుతున్నాయి. ఇక స్టార్ మా భవిష్యత్తు సినిమాలపై పెట్టుబడులు గట్టిగానే పెట్టింది.

    రెండు పాన్ ఇండియా సినిమాలు

    రెండు పాన్ ఇండియా సినిమాలు

    స్టార్ మా ముందుగా రెండు పాన్ ఇండియా సినిమాలను దక్కించుకోవడం విశేషం. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న RRR శాటిలైట్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేశారు. ఇక అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో వస్తున్న మరో పాన్ ఇండియా మూవీ పుష్ప హక్కులను కూడా సొంతం చేసుకున్నారు.

    మహేష్, బాలయ్య సినిమాలు కూడా

    మహేష్, బాలయ్య సినిమాలు కూడా

    బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా అఖండపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమా శాటిలైట్ హక్కులను కూడా ఎప్పుడో దక్కించుకున్న స్టార్ మా మహేష్ బాబు సర్కారు వారి పాట ను కూడా దక్కించుకుంది. ఈ రెండు సినిమాల ప్రీమియర్స్ కు రేటింగ్స్ హై రేంజ్ లో రావడం కాయం.

    మీడియం బడ్జెట్ సినిమాలు కూడా

    మీడియం బడ్జెట్ సినిమాలు కూడా

    ఇక మీడియం బడ్జెట్ సినిమాలను కూడా స్టార్ మా ఏ మాత్రం వదల్లేదు. రవితేజ ఖిలాడి సినిమాతో పాటు శేఖర్ కమ్ముల లవ్ స్టొరీ హక్కులను కూడా దక్కించుకుంది. ఇక పోటీ ఎంత ఉన్నా కూడా టక్ జగదీష్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. నాని ప్లాప్ సినిమాలకు కూడా ప్రతిసారి మంచి రేటింగ్స్ వస్తున్నాయి. అందుకే సాలీడ్ రేటుకు టక్ జగదీష్ హక్కులను సొంతం చేసుకుంది. ఇక అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శాటిలైట్ హక్కులను కూడా స్టార్ మా మొదట్లోనే సొంతం చేసుకుంది.

    English summary
    The star maa fortunate to have won our first two Pan India films. Rajamouli, NTR, Ram Charan movie the RRR satellite rights to be unveiled in the combination at a hefty price. also bagged the rights for another Pan India movie pushpa,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X