Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
టెలివిజన్ షోలో మితిమీరిన రొమాన్స్.. బాలయ్య స్టైల్ లో అవినాష్, అరియానా రచ్చ.. అక్కడ చేయి వేస్తూ..
మరికొంత కాలం తర్వాత టెలివిజన్ షోలకు కూడా సెన్సార్ చేయలేమో.. అనే విధంగా ఇప్పుడు రియాలిటీ షోలు ప్రసారం అవుతున్నాయి. డాన్స్ షోలు అంటూ స్టేజిపై మితిమీరిన రొమాన్స్ తో కొంతమంది సెలబ్రెటీలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. రీసెంట్ గా బిగ్ బాస్ జోడి అరియానా అవినాష్ ఇద్దరు కూడా డాన్స్ చేసిన విధానం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ ఇద్దరు బీబీ జోడీలో పాట్నర్స్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే అందులో వారు చేసిన డ్యాన్స్ ఊహించిన విధంగా షాక్ ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియోలను కూడా అరియానా షేర్ చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అవినాష్, అరియానా జోడి
బిగ్ బాస్ తెలుగు సీజన్స్ ద్వారా మంచి గుర్తింపు అందుకున్న కొంతమంది సెలబ్రిటీలు ఇప్పుడు వివిధ రకాల టెలివిజన్ షోలలో బిజీ అవుతున్నారు. ఇక ఐదవ సీజన్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్నటువంటి కంటెస్టెంట్స్ అరియానా అవినాష్ ఇద్దరు కూడా ఇప్పుడు బిబి జోడీలో హీటెక్కించే పెర్ఫార్మన్స్ తో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు.

బయటకు వచ్చాక కూడా..
అసలైతే వీరి జంటకు బిగ్ బాస్ షో లోనే భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. మొదట్లోనే హౌస్ లో నుంచి వెళ్ళిపోతుంది అనుకున్న అరియానా చివరి వరకు నిలిచింది. ఒక విధంగా అవినాష్ తో కూడా ఆమె కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది. షో ముగిసిన తర్వాత బయట ప్రపంచంలో కూడా వీరు అదే తరహాలో కనిపించడంతో వీరిపై అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి.

బాలకృష్ణను ఇమిటేట్ చేస్తూ
వీరి మధ్యలో ప్రేమ కొనసాగుతోంది అని ఎన్ని వార్తలు వచ్చినా కూడా అవన్నీ అబద్ధము అని ఆ తర్వాత అవినాష్ అయితే పూర్తిగా క్లారిటీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు బీబీ జోడీలో ఇద్దరు కూడా వారి డాన్స్ పెర్ఫార్మన్స్ తో ఆశ్చర్యాన్ని కలిగిచ్చేలా టాలెంట్ చూపిస్తున్నారు. ఇటీవల ఎపిసోడ్లో నందమూరి బాలకృష్ణను ఇమిటేట్ చేస్తూ ఆయన పాటలను డాన్స్ చేశారు. అందులో ఊహించని రొమాన్స్ తో కూడా ఈ జంట ఆశ్చర్యాన్ని కలిగించింది..

రొమాంటిక్ స్టెప్పులు
మొదట బాలకృష్ణ లక్స్ పాప పాటకు ఇద్దరు డాన్స్ చేశారు. డాన్స్ మూమెంట్స్ తో అయితే ఇద్దరు కొన్ని మూమెంట్స్ తో అదరగొట్టేశారు. ఇక అంతేకాకుండా అరియానా అయితే తన నడుము అందాలతో ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఆకట్టుకుంది. ఇక తర్వాత రావయ్య ముద్దుల మామ అనే పాటలో కూడా రొమాంటిక్ స్టెప్పులతో ఇద్దరు కూడా షాక్ ఇచ్చారు.
నడుముపై చేయి వేస్తూ..
అవినాష్ గతంలో ఎప్పుడూ లేనివిధంగా రొమాంటిక్ టచింగ్ తో ఆశ్చర్యాన్ని కలిగించాడు. అరియానా నడుముపై కూడా చేయి వేశాడు. ఇక అసలు ఇది టెలివిజన్ షో నా అనే విధంగా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అయితే మరి కొందరు మాత్రం వీరి డాన్స్ పెర్ఫార్మెన్స్ మాత్రం బాగుందని పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక చిలకపచ్చ కోక అనే పాట కూడా డాన్స్ చేశారు. ఇక లేటెస్ట్ గా వచ్చిన సుగుణసుందరి పాటకు కూడా స్టెప్పులు వేసి జడ్జిలను ఆకట్టుకున్నారు. అవినాష్ లో ఈ టాలెంట్ కూడా ఉందా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.