Bigg Boss Telugu 7 Voting: పదే పదే కాల్స్ చెయొద్దు... ఓటింగ్‌పై స్టార్ మా క్లారిటీ

బిగ్ బాస్ తెలుగు 7 మరో ఆరు రోజుల్లో ముగియనుంది. ఇక ఈ క్రమంలో ఫైనల్ విన్నర్ ఓటింగ్ కూడా గతవారమే మొదలు అయింది. ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో 6 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరంతా టాప్ 6 ఫైనాలిస్టుగా ఎంపిక అయ్యారు. అయితే వీరిలో విన్నర్ అయ్యేందుకు ఓటింగ్ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ నిర్వహకులు.. బిగ్ బాస్ ఫ్యాన్స్ కోసం ఓ స్పెషల్ నోట్ రిలీజ్ చేశారు. అందులో ఏముంది.. ఎందుకు నోట్ రిలీజ్ చేయాల్సి వచ్చింది అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

హాలీవుడ్ నుంచి ఇండియాకి వచ్చి.. సక్సెస్ అయిన షోల్లో బిగ్ బాస్ ఒకటి. ఇక మెల్లిగా రిలీజినల్ లాంగ్వెజస్ లోకి చేరిన ఈ రియాలిటీ షో... ఇక్కడ కూడా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఇక ప్రస్తుతం ఏడో సీజన్ నడుస్తుండగా.. ఈ సీజన్ కూడా మరో ఆరు రోజుల్లో ముగియనుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3న ప్రారంభం కాగా... ఇది డిసెంబర్ 17న గ్రాండ్ ఫినాలే జరుపుకోనుంది. ఈ నేపథ్యంలోనే ఈ సీజన్‌లో ఫినాలే ఓటింగ్ మొదలు పెట్టారు.

Star Maa Clarity on Bigg Boss Telugu 7 Voting and Missed Calls Full Details Here

ఉల్టా పుల్టాగా సాగుతోన్న బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ప్రతి వారం ఏదో ఒక ఊహించని పరిణామం జరుగుతూ ప్రేక్షకులను థ్రిల్ ను కలిగిస్తుంది. ఏ సీజన్‌లోనూ చూపించని ఎన్నో అంశాలను ఇందులో ప్రసారం చేస్తూ.. బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా 14వ వారంలోనే విన్నర్‌ను డిసైడ్ చేసే ఓటింగ్‌ను గత వారమే మొదలు పెట్టారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ కూడా పూర్తి అయింది. శోభా శెట్టి ఎలిమినేట్ కాగా ప్రస్తుతం హౌస్ లో 6 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.

అయితే టాప్ 6 కంటెస్టెంట్స్ ఫైనాలిస్టుగా ప్రకటించారు బిగ్ బాస్. ప్రస్తుతం హౌస్ లో అమర్ దీప్, శివాజీ, ప్రశాంత్, ప్రియాంక జైన్, యావర్, అర్జున్ అంబటి ఉన్నారు. వీరంతా ఫైనల్స్ కు వెళ్లనున్నారు. అయితే వీరిలో ఎవరు విజేత అనేది ఆరోజు తెలియనుంది. దాని కోసం బిగ్ బాస్ నిర్వహకులు ఓటింగ్ ప్రక్రియను పెట్టారు. అయితే చాలా మంది డిస్ని ప్లస్ హాట్ స్టార్ యాప్ లో ఓటింగ్ వేస్తుంటారు. అందులో ఒకే ఓటు ఉంటుంది. మరోవైపు మిస్డ్ కాల్ ఇచ్చి ఓట్ చేస్తుంటారు.

Star Maa Clarity on Bigg Boss Telugu 7 Voting and Missed Calls Full Details Here

అయితే మిస్డ్ కాల్ ఒకేసారి రింగ్ అయి కట్ అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో చాలా మంది ఫ్రాడ్ జరుగుతుందని భావించారు. ఎన్ని సార్లు కాల్ చేసిన కలవకపోవడం.. ఇదంతా బిగ్ బాస్ ఆడుతున్న డ్రామా అంటూ కామెంట్స్ పెట్టారు. కావాలనే తమ ఫేవరేట్ కంటెస్టెంట్ ను గెలిపించకుండా కాల్స్ ఆపేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ గా చేశారు. ఈ క్రమంలోనే స్టార్ మా ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చింది.

స్టార్ మా తన సోషల్ మీడియా ఖాతా వేదికగా... ప్రియమైన బిగ్ బాస్ అభిమానులారా, ఒక్క మిస్డ్ కాల్ మాత్రమే ఓటుగా పరిగణించబడుతుందని గుర్తు చేస్తున్నాం... ఎక్కువ మిస్డ్ కాల్‌లు లెక్కించబడవు... అంటూ ఓ నోట్ షేర్ చేసింది. నిష్పక్షపాతంగా ఆడుదాం - ఒక వ్యక్తికి ఒక్క ఓటు చాలు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ లెక్కన ఎలాంటి మోసం లేకుండా ఈ సారి ఓటింగ్ జరుగుతుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X