Bigg Boss Telugu 7:అమర్దీప్ జర్నీ వీడియోను తొలగించిన స్టార్ మా..కుట్ర అంటూ ఫ్యాన్స్ ఫైర్...అసలు సంగతి ఇదా?
బిగ్ బాస్ తెలుగు 7 మరో 6రోజుల్లో ముగియనుంది. ఇక వచ్చే ఆదివారం విజేత ఎవరు అనేది క్లారిటీ రానుంది. 14 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. చివరి 15 వారంలో ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఈషోను చూస్తున్నారు. అయితే తాజాగా 15వ వారంలో బిగ్ బాస్.. కంటెస్టెంట్స్ జర్నీ వీడియోను రిలీజ్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా అమర్ దీప్ జర్నీ వీడియోను రిలీజ్ చేయగా.. ఆ వీడియోను తొలగించాల్సి వచ్చిందట. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 7 మరింత ఆసక్తిగా సాగుతోంది. చివరి వారం కావడంతో.. అందరి కన్ను దీనిపైనే ఉన్నాయి. ఇక ప్రస్తుతం హౌస్ లో 6మంది ఫైనల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్, ప్రియాంక జైన్, యావర్, అర్జున్ అంబటి ఉన్నారు. మరి వీరిలో ఎవరు విజేత కానున్నారు అనేది ఆసక్తిగా మారింది. వచ్చే ఆదివారం సాయంత్ర 7 గంటలకు గ్రాండ్ ఫినాలే జరపనున్నారు మేకర్స్. ఇక ఇప్పటికే గ్రాండ్ ఫినాలేకి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి శోభాశెట్టి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం హౌస్ లో 6మంది ఉండగా.. బిగ్ బాస్ ఈ చివరి వారం అంత హౌస్ లోని కంటెస్టెంట్స్ జర్నీ వీడియోలను రిలీజ్ చేయనున్నాడు. అందులో భాగంగానే ఈరోజు అర్జున్ అంబటి బిగ్ బాస్ తెలుగు 7 జర్నీ వీడియోతో పాటు.. అమర్ దీప్ బిగ్ బాస్ తెలుగు 7 జర్నీ వీడియోను ప్రోమో రూపంలో నెట్టింట వదిలాడు. ఆ వీడియోలు చూసిన ప్రేక్షకులు ఫుల్ ఫిదా అయిపోయారు.
అర్జున్ వీడియో చూస్తే.. ఆయనకు ఇచ్చిన ఎలివేషన్స్.. వైల్డ్ కార్డు ఎంట్రీ అయినప్పటికీ.. అందుకు తగ్గట్లు ఆయన పెట్టిన ఎఫెక్ట్స్.. అన్నీ ఆ వీడియోలో అందంగా చూపించారు. ఇక తన భార్య సురేఖాతో కలిసి దిగిన ఫోటోలు.. వాటితో పాటు లవ్లీ మ్యూజిక్ వేసి.. మమరిచిపోయేలా చేశాడు బిగ్ బాస్. ఇక ఈ వీడియోకు మంచి ఆదరణ దక్కింది. సోషల్ మీడియాలో అర్జున్ ఎలివేషన్.. బిగ్ బాస్ వాయిస్ ఓవర్ సూపర్ అంటూ కామెంట్స్ పెట్టారు.
అలాగే అమర్ దీప్ వీడియో కూడా చాలా అందంగా రూపొందించారు. ఆ వీడియోలో అమర్ దీప్ పేరుకు అర్థం చెప్పి మొదలు పెట్టిన బిగ్ బాస్... ఎలాగైనా ప్రతీ ఆటలో గెలిచి చివరి వరకూ చేరాలని మీ తపన మీ ప్రయాణాన్ని అద్భుతంగా మలిచిందంటూ చెప్పుకువచ్చాడు. ఇక లవ్లీ మ్యూజిక్ యాడ్ చేసి... అద్భుతంగా రూపొందించాడు. అయితే ఈ వీడియోను స్టార్ మా తమ సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించందని తెలుస్తోంది.
అమర్ దీప్ వీడియోను తొలగించి.. మళ్లీ అప్లోడ్ చేస్తుంది స్టార్ మా. తన ట్విట్టర్ వేదికగా పలు మార్లు డిలీట్ చేసి.. పోస్ట్ చేయడంపై అమర్ దీప్ కు సపోర్ట్ రావడం వల్లే ఇలా చేస్తున్నారని అమర్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అమర్ దీప్ గెలవకుండా కుట్ర జరుగుతుందని అంటున్నారు. మరోవైపు అమర్ యాంటి ఫ్యాన్స్ మాత్రం... బిగ్ బాస్ నీకు ఎంత ఇష్టం అయితే.. అమర్ వీడియోనే మళ్లీ పోస్ట్ చేస్తావ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
అయితే అమర్ దీప్ జర్నీ వీడియోను స్టార్ మా తొలగించడానికి అసలు కారణం.. ఆ వీడియోలో కొన్ని సాంగ్స్ వాడటం వల్ల కాపీ రైట్ రావడమే అని తెలుస్తోంది. అందువల్లే మళ్లీ ఎడిట్ చేసి.. కాపి రైట్ రాకుండా చూసుకుని పోస్ట్ చేశారట. ఈ విషయం తెలియక చాలా మంది టెన్షన్ పడ్డారు. అంతే కాదు.. అమర్ పై కుట్ర జరుగుతుందని ఆరోపించారు.


Click it and Unblock the Notifications











