»   » కన్నుకొడుతూ చిలిపిగా ఎన్టీఆర్...... ‘బిగ్ బాస్’ ఫస్ట్‌లుక్ అదుర్స్!

కన్నుకొడుతూ చిలిపిగా ఎన్టీఆర్...... ‘బిగ్ బాస్’ ఫస్ట్‌లుక్ అదుర్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ త్వరలో బుల్లితెర ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ మాటీవీ వారు ప్రారంభించబోతున్న 'బిగ్ బాస్' రియాల్టీ షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు.

ఈ విషయాన్ని స్టార్ మా టీవీ వారు అఫీషియల్ గా ఖరారు చేస్తూ.... ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కన్ను కొడుతూ చిలిపి లుక్‌లో దర్శనమిచ్చిన ఎన్టీఆర్..... 'బిగ్ బాస్' షో ఎంత చిలిపిగా సాగుతుందో చెప్పకనే చెప్పాడు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ...

ఎన్టీఆర్ మాట్లాడుతూ...

టెలివిజన్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మీడియమ్ ఫర్ ఎంటర్టెన్మెంట్. స్టార్ మా టీవీ వారు బిగ్ బాస్ లాంటి పెద్ద టీవీ షోను హోస్ట్ చేయాలని నన్ను సంప్రదించినపుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. దీన్నొక ఛాలెంజ్ గా చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ షో తెలుగు టెలివిజన్ రంగంలో గేమ్ చేంజర్ అవుతుందని నమ్ముతున్నాను అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.

బిగ్ బాస్

బిగ్ బాస్

బిగ్ బాస్ అనేది ఇంటర్నేషనల్ షో బిగ్ బ్రదర్ ఫార్మాట్లో సాగే ఓ రియాల్టీ షో. ప్రపంచ టెలివిజన్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ షోగా పేరు తెచ్చుకుంది. హాలీవుడ్లో, బాలీవుడ్లో ఈ రియాలిటీ షోలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్లోనూ దీన్ని ప్రారంభించాలని నిర్వహకులు భావించారు. జూ ఎన్టీఆర్ ను హోస్ట్ గా ఎంచుకున్నారు.

అక్కడ సూపర్ సక్సెస్

అక్కడ సూపర్ సక్సెస్

బాలీవుడ్లో బిగ్ బాస్ షోను సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్నారు. అక్కడ ఈ రియాలిటీ షో 9 సీజన్లు సూపర్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని ప్రస్తుతం 10వ సీజన్ రన్ అవుతోంది.

ఎన్టీఆర్

ఎన్టీఆర్

'బిగ్ బాస్' తెలుగు వెర్షన్ రియాల్టీ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్న జూ ఎన్టీఆర్..... ఇప్పటి వరకు తెలుగు బుల్లితెర రంగంలో ఎవరూ తీసుకోనంత రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు టాక్.

అందరికీ కొట్టేశాడు

అందరికీ కొట్టేశాడు

రెమ్యూనరేషన్ విషయంలో జూ ఎన్టీఆర్ అందరినీ కొట్టేసారని ప్రచారం జరుగుతోంది. నాగార్జున, చిరంజీవిలు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' ద్వారా రూ. 4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని, అయితే జూ ఎన్టీఆర్ ‘బిగ్ బాస్' తెలుగు రియాల్టీ షోకు రూ. 7 కోట్ల తీసుకుంటున్నట్లు టాక్.

భారీ మొత్తం ఇదే తొలిసారి

భారీ మొత్తం ఇదే తొలిసారి

తెలుగు బెల్లితెర రంగంలో ఒక హోస్ట్ కు రూ. 7 కోట్ల భారీ మొత్తం చెల్లించడం ఇదే తొలిసారి అని అంటున్నారు. జూ ఎన్టీఆర్ కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్, స్టార్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఇంత పెద్ద మొత్తం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

ఎన్నో వివాదాలు

ఎన్నో వివాదాలు

హిందీలో ప్రసారం అవుతున్న ‘బిగ్ బాస్' షోపై ఎన్నో వివాదాలున్నాయి. బిగ్ బాస్ షోలో పాల్గొనే సెలబ్రెటీల ప్రవర్తన చాలా వివాదస్పదంగా ఉండటమే అందుకు కారణం. మరి తెలుగులోనూ అదే తరహాలో వివాదాస్పదంగా ఈ షోను సాగిస్తారా? అనేది సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

టీఆర్పీ రేటింగ్సే లక్ష్యంగా...

టీఆర్పీ రేటింగ్సే లక్ష్యంగా...

హిందీలో బిగ్ బాస్ షోకు మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తుండటంతో తెలుగులో కూడా ఈ షోకు మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు.

English summary
In line with its commitment of “Sarikotha Uttejam”, STAR Maa is all set to bring to its viewers an unprecedented and explosive viewing experience with one of the biggest reality shows, Bigg Boss. And hosting this show will be none other than the sensational and talented Junior NTR.
Please Wait while comments are loading...