బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపిక వెనుక ఇంత కథ ఉందా.. లీకైన స్టార్ మా మాస్టర్ ప్లాన్!

By Manoj

బిగ్ బాస్... బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పరిచయమై.. భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందిన వాటిలో ఒకటి. ఇప్పటి వరకు ప్రసారం అయిన అన్ని షోలు ఒక లెక్క.. ఇది ఒక లెక్క అన్నట్లుగా ప్రభావం చూపిస్తోంది. దేశంలోని దాదాపు అన్ని భాషల్లో వస్తోన్న ఈ షో... మూడేళ్ల క్రితం తెలుగులోకీ ఎంటరయింది. వచ్చి రావడంతోనే రికార్డులపై దండయాత్ర చేసి చరిత్ర సృష్టించింది. అలా అలా ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుని... నాలుగో దానితో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్ల ఎంపికలో బిగ్ బాస్ వేసిన ఓ మాస్టర్ ప్లాన్ లీకైంది. ఆ వివరాలు మీకోసం.!

క్రేజీగా మొదలైంది.. రికార్డులు కొట్టేసింది

క్రేజీగా మొదలైంది.. రికార్డులు కొట్టేసింది

బిగ్ బాస్ సీజన్ 4 సెప్టెంబర్ ఆరున అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. కరోనా ప్రభావంతో కాస్త ఆలస్యంగా మొదలైనప్పటికీ... ఈ షోకు మంచే జరిగింది. అక్కినేని నాగార్జున సారథ్యంలో ప్రసారమైన ప్రీమియర్ ఎపిసోడ్‌కు మంచి స్పందన వచ్చింది. అంతేకాదు, ఇది రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సాధించింది. ఫలితంగా దేశంలోనే టాప్ ప్లేస్‌ను సంపాదించుకుంది.

 షో మాత్రం చప్పగా.. బాస్ సరికొత్త ప్లాన్స్

షో మాత్రం చప్పగా.. బాస్ సరికొత్త ప్లాన్స్

ప్రారంభ రోజే బిగ్ బాస్ హౌస్‌లోకి పదహారు మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. వీళ్లలో ఇద్దరిని సీక్రెట్ రూమ్‌కు పంపి ప్రయోగం చేశారు. దీనితో పాటు కట్టప్ప అనే సరికొత్త ప్లాన్ వేశారు. ఇవన్నీ వికటించడంతో మొదటి వారం అంతా షో చప్పగానే సాగింది. వీటికితోడు హౌస్‌లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్లలో చాలా మంది ఫేమ్ లేని వాళ్లు కావడం కూడా దీనికి కారణమే.

 ఇద్దరు వెళ్లారు.. మరో ఇద్దరు వచ్చారు

ఇద్దరు వెళ్లారు.. మరో ఇద్దరు వచ్చారు


బిగ్ బాస్ షో ప్రారంభమై రెండు వారాలు ముగిశాయి. ఇప్పటి వరకు షో నుంచి ఇద్దరు కంటెస్టెంట్లు సూర్య కిరణ్, కరాటే కల్యాణీ ఎలిమినేట్ అయిపోయారు. అదే సమయంలో ప్రముఖ కమెడియన్ కుమార్ సాయి, జబర్ధస్త్ ఫేం ముక్కు అవినాష్ వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరితో పాటు ఓ హీరోయిన్ కూడా త్వరలోనే రాబోతుందని ప్రచారం జరుగుతోంది.

విమర్శల వేళ లీకైన మా మాస్టర్ ప్లాన్

విమర్శల వేళ లీకైన మా మాస్టర్ ప్లాన్

గత సీజన్లతో పోలిస్తే ఈ సారి బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్లలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారందరూ పెద్దగా పరిచయం లేనివారే. దీంతో షో నిర్వహకులపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీనిని గ్రహించిన తర్వాతనే వైల్డ్ కార్డ్ ఎంట్రీని అమలు చేశారు. ఇక, తాజాగా కంటెస్టెంట్ల ఎంపిక వెనుక మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది.

కంటెస్టెంట్ల వెనుక ఇంత కథ ఉందా.?

కంటెస్టెంట్ల వెనుక ఇంత కథ ఉందా.?

తాజా సమాచారం ప్రకారం... గత సీజన్లతో పోలిస్తే ఈ సారి బిగ్ బాస్ హౌస్‌లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. దాన్ని మార్చడానికి చాలా ఖర్చు చేశారట నిర్వహకులు. దీనికైన ఖర్చును కంటెస్టెంట్ల ఎంపిక ద్వారా కవర్ చేసుకున్నారట. అంటే సెకెండ్ గ్రేడ్ సెలెబ్రిటీలను ఎంచుకుని, వాళ్లకు తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారట. అందుకే ఎక్కువ మంది అలాంటి వారే ఉన్నారని టాక్.

Recommended Video

Bigg Boss Telugu 4 : Episode 16 Highlights,అరియానా Vs సోహైల్..కత్తులు దూసుకొన్న సెలబ్రిటీలు!
అందుకోసం మరో స్పెషల్ ప్లాన్ రెడీ.!

అందుకోసం మరో స్పెషల్ ప్లాన్ రెడీ.!

రోజులు గడుస్తున్న కొద్దీ షోపై ఆసక్తిని పెంపొందించేందుకు బిగ్ బాస్ సరికొత్త టాస్క్‌లు పెట్టబోతున్నాడట. అంతేకాదు, షోకు రేటింగ్ తగ్గిపోయే ప్రమాదం వచ్చినప్పుడు ఎక్కువ డబ్బులు వెచ్చించి మరీ పేరున్న కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ద్వారా పంపాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా కంటెస్టెంట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుని బడ్జెట్‌ను సర్దుకుంటుందట బిగ్ బాస్ యూనిట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X