భార్యను, లవర్‌ను ఇద్దర్ని మెయింటెన్ చేస్తున్నాడు... డాక్టర్ బాబు నిరుపమ్‌పై ఈటీవీ ప్రభాకర్ పంచ్

తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ రేటింగ్ ఉన్న స్టార్ మా టెలివిజన్‌ వినూత్న చాటడంలోను, విభిన్నమైన కంటెంట్ అందించడంలోను ఎప్పుడూ ముందుంటుంది. అందుకే తెలుగులో టాప్ 10 సీరియల్స్‌ ఆ టెలివిజన్ ఛానెల్ నుంచే రావడం విశేషం. అంతేకాకుండా వినోదంతో కూడిన షోలను కూడా స్టార్ మా అందించడం గమనార్హం. అలాంటి టాప్ ఛానెల్ సీరియల్స్, షోలోని నటీనటులు, యాంకర్లతో స్టార్ మా పరివార్ చాంఫియన్ షిప్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ షో గురించి వివరాల్లోకి వెళితే..

కార్తీకదీపం, గృహలక్ష్మీ టీమ్స్

కార్తీకదీపం, గృహలక్ష్మీ టీమ్స్

స్టార్ మా పరివార్ ఛాంపియన్ షోలో కార్తీకదీపం, వదినమ్మ, ఇంటింటి గృహలక్ష్మి, జానకి కలగనలేదు, గుప్పెడంత మనసు, కామెడీ స్టార్స్ తదితర కార్యక్రమాల్లోని నటీనటులు పాల్గొన్నారు. యాంకర్ సుమ, కమెడియన్ ముక్కు అవినాష్ హోస్టింగ్‌తో కేకపెట్టించారు. యువ గాయనీ, గాయకులు తమ పాటలతో హోరెత్తించారు. స్టార్ పరివార్ షో మొత్తం జోష్‌తో సాగింది.

బుల్లితెర నటీనటుల మధ్య

బుల్లితెర నటీనటుల మధ్య

స్టార్ పరివార్ ఛాంపియన్ షిప్‌లో భాగంగా ప్రతీ సీరియల్, షోకు సంబంధించిన నటీనటుల మధ్య పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో అన్ని సీరియల్స్‌ నుంచి ముగ్గురు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్తీకదీపం సీరియల్ హీరో కార్తీక్, మోనిత, భాగ్యం జోష్‌లో కనిపించారు. ఈ సందర్బంగా ఈటీవీ ప్రభాకర్, నిరుపమ్ పరిటాలకు మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది.

డాక్టర్ బాబుపై శ్రీముఖి కామెంట్

డాక్టర్ బాబుపై శ్రీముఖి కామెంట్

స్టార్ పరివార్ చాంఫియన్‌షిప్‌లో నిరుపమ్ అలియాస్ కార్తీక్ బాబు అలియాస్ డాక్టర్ బాబుకు ఓ బాల్, స్టాండ్ ఇచ్చి దానిని పడకుండా టేబుల్‌పై పెట్టారు. ఈ టాస్క్‌లో డాక్టర్ బాబు రెండు బాల్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ టేబుల్ ఉంచారు. దాంతో డాక్టర్ బాబును చూసి ఏంటి మీ చేతిలో మ్యాజిక్ అంటూ శ్రీముఖి అంటే.. వంటలక్క అంటూ పక్కనే భాగ్యం కౌంటర్ ఇచ్చింది.

నిరుపమ్‌పై ఈటీవీ ప్రభాకర్‌పై పంచ్

నిరుపమ్‌పై ఈటీవీ ప్రభాకర్‌పై పంచ్

దాంతో పక్కనే ఉన్న ఈటీవీ ప్రభాకర్ స్పందిస్తూ.. ఇద్దరిద్దరిని మెయింటెన్ చేసే డాక్టర్ బాబుకు రెండు బాల్స్‌ను హ్యాండిల్ చేయడం అంత కష్టమైన పని కాదు అంటే.. ఆ పక్కనే ఉన్న వదినమ్మ హీరోయిన్.. ఇప్పుడు కూడా రెండేసి బ్యాలెన్స్ చేశారు అనగానే.. నిరుపమ్ ఆ ఇద్దరికి కాళ్లు మొక్కుతూ కనిపించాడు. అలా వారి మధ్య ఫన్ క్రియేట్ అయింది.

దీపక్క రియాక్షన్ ఎలా అంటే..

దీపక్క రియాక్షన్ ఎలా అంటే..

డాక్టర్ బాబు చేసిన ఫీట్‌ గురించి శ్రీముఖి మాట్లాడుతూ.. దీపక్క చూస్తే ఏమనేది అంటే.. ప్రేమ పొంగి పొర్లిపోయేది అని నిరుపమ్ సమాధానం ఇచ్చారు. ప్రేమ పొంగిపొర్లితే ఏమనేది అంటూ శ్రీముఖి అడిగితే.. పక్కనే ఉన్న భాగ్యం నిరుపమ్ చెంపలు పట్టుకొని నిమిరబోయింది. బ్యాక్ గ్రౌండ్‌లో రాయిని ఆడది చేసిన రాముడివా అనే పాట రావడంతో డాక్టర్ బాబు, భాగ్యం, శ్రీముఖి అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

ఉప్పెన పడవ సీన్ రీ క్రియేషన్

ఇక స్టార్ పరివార్ చాంఫియన్‌షిప్‌లో శ్రీముఖి, జబర్దస్త్ అవినాష్ మధ్య బహ్మండమైన పంచులతో కామెడీ పేలింది. ఉప్పెన‌ మూవీలో సముద్రంలో పడవ సీన్‌ను క్రియేట్ చేశారు. పక్కనే ఉన్న జానకి కలగనలేదు టీమ్‌ను శ్రీముఖి లడ్డు ఇస్తారా అని అడిగితే పక్కనే ఉన్న అవినాష్.. ఓ లడ్డు.. ఇంకో లడ్డును అడుగుతున్నది అంటూ తనదైన శైలిలో పంచ్ ఇచ్చాడు. ఇలా ఈ కార్యక్రమం వినోదంతో సాగినట్టు ప్రోమోలు స్పష్టం చేశాయి. ఆదివారం ప్రసారం కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X