Super Singers Junior Grand Finale: స్పెషల్ గెస్ట్ గా స్టార్ హీరో.. బ్రహ్మీ ఎంట్రీతో అదిరిపోయెలా ప్లాన్
ఇటీవల కాలంలో సింగింగ్ షో లకు ఏ స్థాయిలో గుర్తింపు లభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ మధ్యకాలంలో వచ్చిన ఇండియన్ ఐడల్ సూపర్ సింగర్ షోకు కూడా మంచి క్రేజ్ దక్కింది. ఈసారి స్టార్ మా లో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ షోకు కూడా మంచి క్రేజ్ అయితే దక్కుతోంది. ఇక ఈ షో కు సంబంధించిన ఫైనల్ ఎపిసోడ్ మొదలు కాబోతోంది. అందుకు సంబంధించిన ప్రోమోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి...
సూపర్ సింగర్ షో మొదటి సీజన్ నుంచి మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక ఈసారి జూనియర్స్ కూడా ఆదరగొట్టేశారు. ఫైనల్ ఎపిసోడ్ వరకు వచ్చిన చిన్నారులు ఊహించని టాలెంట్ తో ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇక ఫైనల్ ఎపిసోడ్ లో ఎవరు గెలుస్తారు అనే విషయం కన్నా కూడా అందులో అందరూ విన్నర్స్ అనే మాదిరిగా సింగింగ్ తో ఆకట్టుకుంటున్నారు. ఇక ఆదివారం రోజు ప్రసరమైన ఫైనల్ ఎపిసోడ్ కూడా గ్రాండ్ గా జరిగింది.

ఈ ఫైనల్ ఎపిసోడ్ కు స్టార్ హీరో నాగార్జున స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ఇక పిల్లల టాలెంట్ చూసి ఆయన కూడా ఆశ్చర్యపోయారు. అలాగే మరో ప్రత్యేక అతిథిగా వచ్చిన బ్రహ్మానందం కూడా కామెడీతో ఆకట్టుకున్నారు. ఇక సుడిగాలి సుధీర్ - అనసూయ ఎంట్రీ కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా బ్రహ్మానందం - అనసూయ కామెడీ యాంగిల్ హైలెట్ అయినట్లు అనిపోస్తోంది. అంతే కాకుండా బ్రహ్మానందం అనసూయతో కూడా స్టెప్పులు వేశారు. ఇక విజిల్ వేస్తూ కృతి శెట్టి హైలెట్ గా నిలిచింది. ఇక ఫైనల్ ఎపిసోడ్ కు చిత్ర, మనో హేమచంద్ర జడ్జీలు గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరి ఈ ఫైనల్ ఎపిసోడ్ వరకు వచ్చిన చిన్నారులతో ఎవరు సూపర్ సింగర్ జూనియర్ టైటిల్ ను అందుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











