బిగ్ బాస్4: ఎంటర్టైన్మెంట్ కంటే ఎక్కువగా వాటిపైనే దృష్టి పెడుతున్నారు.. అందుకే అంత ఆదాయం!

బిగ్ బాస్ సీజన్ 4 కరోనా వైరస్ ఎక్కువవుతున్న సమయంలో ఎంతో డేరింగ్ గా మొదలైంది. హోస్ట్ గా నాగార్జున స్టార్ట్ చేసిన విధానం మిగతా భాషల వారిని కూడా ఆశ్చర్యపరిచింది. పక్కా ప్లాన్ తో సిద్ధమై షోను బాగానే ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు. తెలుగులో స్టార్ట్ చేసిన తరువాతనే మిగతా భాషల్లో కూడా ధైర్యంగా మొదలు పెట్టారు. అసలు మ్యాటర్ లోకి వస్తే షోకి ఈ మధ్య మళ్ళీ రేటింగ్ బాగా తగ్గినట్లు అనిపిస్తోంది.

Recommended Video

Bigg Boss Telugu 4: Bigg Boss show was once again criticised for its elimination process

గతంలో హోటల్ టాస్క్ తప్పితే ఇంతవరకు షోకి హైప్ తెచ్చే సీన్ కనిపించలేదు. ప్రస్తుతం బాగానే కష్టపడుతున్నారు గాని సరైన ఎంటర్టైన్మెంట్ రావడం లేదని తెలుస్తోంది. షోలో ఎంటర్టైన్మెంట్ ఉన్నా లేకున్నా కూడా నాలుగవ సీజన్ లో బ్రాండ్ ప్రమోషన్స్ కి మాత్రం కొదవ లేదు. చిన్న బ్రాండ్ పెద్ద బ్రాండ్ అని తేడా లేకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉన్న ప్రతి బ్రాండ్ ని బాగానే హైలెట్ చేస్తున్నారు. షోలో తినే తిండికి సంబంధించిన వాటిని కూడా ప్రమోషన్స్ కి వాడేస్తున్నారు.

Star maa superb planning on bigg boss 4 brand promotions

ఒక కూల్ డ్రింక్ కంపెనీని షో మొత్తంలో గట్టిగా ప్రమోట్ చేస్తున్న స్టార్ మా రీసెంట్ గా ఫోన్లను అలాగే ఇన్ ఫ్రా కన్ స్ట్రక్షన్ కి సంబంధించిన కంపెనీల బ్రాండ్ ని కూడా ప్రమోట్ చేయడానికి డీల్ సెట్ చేసుకుందట. రేటింగ్ ద్వారా లాభం లేకపోయినా కూడా స్టార్ మాకు ప్రయివేట్ ప్రమోషన్స్ ఆదాయంలో మాత్రం పెద్దగా ఎఫెక్ట్ పడలేదట. ఇంకా పెరుగుతూనే ఉన్నాయని టాక్ వస్తోంది. ఇక బిగ్ బాస్ హౌజ్ లో వాటిని ఒక యాడ్ లా కాకుండా టాస్క్ లో భాగంగా కూడా ప్రమోట్ చేయడం విశేషం. ఇక మొత్తంగా ఈ కరోనా కష్టకాలంలో స్టార్ మా ఏ స్థాయిలో ఆదాయాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X