Television Rankings రికార్డు సృష్టించిన స్టార్ మా.. దేశంలోనే బ్రహ్మముడి, నాగపంచమి టాప్!
తెలుగు వినోద పరిశ్రమలో కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న స్టార్ మా ఛానెల్ రికార్డు క్రియేట్ చేసింది. దేశంలోనే అత్యంత రేటింగ్ సాధించిన ఛానెల్‌గా రికార్డు నెలకొల్పింది. 2023 సంవత్సరంలో 13వ వారానికి బార్క్ రిలీజ్ చేసిన రేటింగ్స్‌లో అత్యధిక రేటింగ్‌ను సాధించింది. ప్రైమ్ టైమ్‌లోను, నాన్ ప్రైమ్ టైమ్‌లోను ఇతర జీఏసీ ఛానెల్స్‌ను వెనక్కి తోసి టాప్ రేటింగ్‌ను సాధించింది. దేశంలోనే నెంబర్ వన్ ఛానెల్‌గా రికార్డు క్రియేట్ చేసింది. ఈ రేటింగ్ వివరాల్లోకి వెళితే..
స్టార్ మా అత్యుత్తమ రికార్డుతో: దేశంలోని అగ్ర స్థానంలో ఉన్న పోటీ ఛానెల్స్‌పై స్టార్ మా అధిపత్యాన్ని కొనసాగించింది. దేశంలో ఇతర ఛానెల్‌కు 772 జీఆర్పీ నమోదు కాగా, స్టార్ మా అత్యధికంగా 882 జీఆర్పీ పాయింట్లు సాధించింది. అలాగే ప్రైమ్ టైమ్ కేటగిరిలో 342 జీఆర్పీ పాయింట్లను, నాన్ ప్రైమ్ టైమ్‌లో 510 జీఆర్పీ పాయింట్స్ సాధించడం విశేషంగా మారింది. ఇటీవల కాలంలో స్టార్ మాకు ఇదే అత్యుత్తమ ట్రాక్ కావడంతో స్టార్ మా నిర్వాహకులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో టాప్: స్టార్ మా ఆదివారాల్లో కూడా ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌కు అందనంత దూరంలో నిలిచింది. పోటీ ఛానెల్‌కు కేవలం 81 జీఆర్పీ పాయింట్లు నమోదు కాగా, స్టార్ మా ఏకంగా 132 జీఆర్పీ రేటింగ్‌ను సాధించడం రికార్డుగా చెప్పుకోవచ్చు. పలు కేటగిరిలో స్టార్ మా ఛానెల్ అధిపత్యాన్ని కొనసాగిస్తూనే దూసుకెళ్లడం గమనార్హం.
బ్రహ్మముడి, నాగపంచమి సీరియల్స్: స్టార్ మా ఇటీవల సాధించిన కొత్త సీరియల్స్‌లో కూడా మంచి రేటింగ్ సాధించింది. దేశంలోనే ఏ ఇతర ఛానెల్స్ సాధించలేని విధంగా అరుదైన రికార్డును నమోదు చేసింది. ఇటీవల ప్రారంభమైన నాగపంచమి, బ్రహ్మముడి సీరియల్స్ గత సీరియల్స్ నమోదు చేసిన రికార్డులను తిరగరాశాయి. గత మూడేళ్లుగా నమోదైన రేటింగ్‌ను తలదన్నేలా నాగపంచమి సీరియల్ 11556 పాయింట్లు, బ్రహ్మముడి సీరియల్ 10372 పాయింట్లు సాధించాయి.

సన్ టెలివిజన్‌కు అందనంత దూరంలో: సన్ టెలివిజన్‌లో ప్రారంభమైన వనథై పోలా 9661 పాయింట్లు, స్టార్ ప్లస్‌లో స్టార్ట్ అయిన ఇమ్లీ 8814 పాయింట్లు, నాగిన్ సీజన్ 8700 పాయింట్లు సాధించడం గమనార్హం. తెలుగు సీరియల్స్ సాధించిన పాయింట్లతో చూస్తే.. తెలుగు సీరియల్స్ అందనంత దూరంలో నిలిచాయి అని స్టార్ మా విడుదల చేసిన ప్రకటనల్లో వెల్లడించింది.

సినిమాల రేటింగ్‌లో కూడా టాప్ రేటింగ్: టెలివిజన్‌పై సినిమాల రేటింగ్ విషయానికి వస్తే.. స్టార్ మా టాప్ లేపింది. జెమినీ టీవిని కూడా వెనక్కి నెట్టి 228 జీఆర్సీని సాధించింది. ఇండియాలో నెంబర్ వన్ మ్యూజిక్ ఛానెల్‌గా స్టార్ మా మ్యూజిక్ రికార్డు క్రియేట్ చేసింది. స్టార్ మా మ్యూజిక్ 75900, ఎంటీవీ బీట్స్ కేవలం 65,213 మాత్రమే సాధించింది. సినిమా, సంగీతం, సీరియల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో నంబర్ వన్‌గా స్టార్ మా కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.


Click it and Unblock the Notifications











