twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అభిజిత్‌ను టార్గెట్ చేస్తావా? అప్పుడు నోరు లేవలేదేం.. ట్రోల్స్‌తో నాగ్‌ను చీల్చిచెండాడిన నెటిజన్స్

    |

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 12వ వారం ఎపిసోడ్‌లో హైడ్రామా నడిచింది. వేదిక మీదకు వచ్చిన హోస్ట్ నాగార్జున మాటల బెత్తం పట్టుకొని ఇంటి సభ్యులకు క్లాస్ పీకాడు. హరిక, అభిజిత్‌ను టార్గెట్ చేసుకొని వారిని మాటలతో బెదిరించాడు. ఓ దశలో మెయిన్ గేట్ తీసి అభిజిత్‌ను హెచ్చరించాడు. ఈ పరిణామాలపై నాగ్‌ను నెటిజన్లు, అభిజిత్ అభిమానులు విపరీతంగా ట్రోల్స్ చేశారు. నాగ్‌పై చేసిన ట్రోల్స్ ఎలా ఉన్నాయంటే..

    పక్షపాతం చూపిస్తున్నారంటూ

    పక్షపాతం చూపిస్తున్నారంటూ

    అభిజిత్‌ను నాగార్జున టార్గెట్ చేశారంటూ నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. #StopTargetingAbijeet #WeAdmireAbijeet అంటూ హ్యాష్ ట్యాగ్‌లను ట్రెండ్ చేశారు. వేరే ఇంటి సభ్యులను పక్షపాతం చూపించవద్దనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి, నెటిజన్ల నుంచి వ్యక్తమైంది.

    అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటూ

    అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటూ

    అభిజిత్‌ను నాగార్జున ఏకపక్షంగా టార్గెట్ చేయడంపై నెటిజన్లు స్పందిస్తూ.. మెహబూబ్‌ను సోహెల్ సేవ్ చేసినప్పుడు హోస్ట్ నాగార్జున గానీ, బిగ్‌బాస్ గానీ మాట్లాడలేదు. అప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తున్నది అంటూ సింహా చిత్రంలోని బాలకృష్ణ డైలాగ్‌ను మీమ్‌గా మలిచారు.

    మోనాల్‌లేని బాధ మీకెందుకు

    మోనాల్‌లేని బాధ మీకెందుకు

    అభిజిత్‌ను బిగ్‌బాస్ టీమ్ టార్గెట్ చేస్తున్నది. మోనాల్‌ను ఏడిపించావంటూ అభిజిత్‌కు నాగ్ చూపించిన వీడియోలో మోనాల్ నవ్వుతూ కనిపించింది. ఏదో సరదాగా చేసిన కామెంట్లను చూపి అభిజిత్‌ను బాధితుడిని చేశారు. ఆమెకు ఎలాంటి సమస్య లేని సమయంలో బిగ్‌బాస్‌కు ప్రాబ్లెం ఎందుకు? మోనాల్‌ పట్ల సానుభూతి, ఫేవరిటిజం చూపించడమే అంటూ నెటిజన్లు కామెంట్ చేశారు.

    నాగ్, స్టార్ మా పెద్ద తప్పిదం

    నాగ్, స్టార్ మా పెద్ద తప్పిదం

    12వ వారాంతం షోలో అభిజిత్‌తో హోస్ట్ నాగార్జున వ్యవహరించిన తీరు సమంజసం కాదు. అభిజిత్‌కు జరిగిన విషయం మాకు చాలా బాధ కలిగించింది. ఆయనను ఈ లెవెల్‌లో టార్గెట్ చేస్తారని అనుకోలేదు. నాగార్జున, స్టార్ మా ఈ విషయంలో పెద్ద తప్పిదం చేసింది. అభిజిత్‌కు సపోర్ట్ చేస్తున్నాం. ఒక మనిషిని ఇలా టార్గెట్ చేశారంటే.. ఆ మనిషి కరెక్ట్ అయి ఉంటారనే మా అభిప్రాయం అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

    మీ చెత్త స్క్రిప్టులతో టార్గెట్ చేయవద్దు

    మీ చెత్త స్క్రిప్టులతో టార్గెట్ చేయవద్దు

    అభిజిత్‌ను టార్గెట్ చేయడం సరికాదు. మీరెన్ని చేసినా మేము అతడితోనే ఉంటాం. మీ చెత్త స్క్రిప్టులతో ముందుకు వెళ్లండి స్టార్ మా అంటూ మరో నెటిజన్ ఘాటుగా స్పందించారు.

    అది ఫేవరిటజం కాదా?

    అది ఫేవరిటజం కాదా?

    నాగార్జున గారు.. మోనాల్‌ను అభిజిత్‌తో స్వాప్ చేసినప్పుడు హారికను ఫేవరిటజం అన్నారు. మరి మోనాల్‌కు ఇష్టమున్న అఖిల్‌తో స్వాప్ చేస్తే అది ఫేవరిటిజం కాదా అంటూ మరో నెటిజన్ సీరియస్ అయ్యారు. స్టాప్ టార్గెటింగ్ అభిజిత్ అంటూ నాగ్‌ను ట్రోల్ చేశారు.

    కాయిన్స్ టాస్క్ సందర్భంగా

    కాయిన్స్ టాస్క్ సందర్భంగా

    కాయిన్ టాస్క్ సందర్భంగా మెహబూబ్‌కు సోహెల్, అఖిల్ కాయిన్స్ ఇచ్చారు. అప్పుడు వారాంతంలో ఎలాంటి క్లాస్ లేదు. క్యాప్ పవర్‌తో మెహబూబ్‌ను సోహెల్ సేవ్ చేశాడు. అప్పుడూ క్లాస్ లేదు. ఇలాంటివి చాలు.. స్టార్‌మా అభిజిత్‌, హారికను టార్గెట్ చేసిందని చెప్పడానికి. ఇలాంటి ఉదాహరణలను ఇంకా చాలా చెప్పడానికి ఉన్నాయి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

    ఫుల్ ఎపిసోడ్ చూసి మాట్లాడాలి

    ఫుల్ ఎపిసోడ్ చూసి మాట్లాడాలి

    ఎలాంటి కారణం లేకుండా ఓ వ్యక్తిని నిందిస్తే.. మీ పవర్‌ను మార్చుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం కలుగుతున్నది. అభిజిత్‌ను టార్గెట్ చేయడానికి ముందు ఫుల్ ఎపిసోడ్స్ చూసి మాట్లాడండి. అందుకే అభిజిత్ అంటే అందరికీ చాలా ఇష్టం అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

    Recommended Video

    Varsha Bollamma, Anand Devarakonda Interview Part 3 | Middle Class Melodies
    గేట్లు తీశారుగా.. దమ్ముంటే బయటకు పంపించండి

    గేట్లు తీశారుగా.. దమ్ముంటే బయటకు పంపించండి

    స్టార్ మా, నాగార్జునకు ఓపెన్ ఛాలెంజ్. గేట్లు తీశారుగా.. గేట్ దగ్గర స్టాప్ అనకుండా.. దమ్ముంటే మీరు అభిజిత్‌ను బయటకు పంపించండి. మీ ఆ గట్స్ ఉంటే అభిజిత్‌ను ఎలిమినేట్ చేయండి. మా తడాఖా ఏమిటో చూపిస్తాం. బిగ్‌బాస్ తెలుగు 4ను ఎలా అసహ్యించుకొంటామనే విషయాన్ని తుఫాన్‌లా చూపిస్తాం అంటూ నెటిజన్ స్పందించాడు.

    English summary
    Bigg Boss Telugu 4 12th Weekend update: Monal Gajjar Saved from 12 week elimination. Nagarjuna Akkineni warns Abijeet Duddala. Apart from this, Monal Gajjar, Avinash, Ariana Glory, Akhil in the list for Elimination process. Ariana Glory request to Sohel to swap the nominations. Harika saved Abijeet with super power from Bigg Boss.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X