Trolls on Bigg Boss Host Nagarjuna . సైబర్ పోలీసులకు ఫిర్యాదు.. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4లో భాగంగా శనివారం రిలీజ్ చేసిన ప్రోమో, ప్రసారమైన ఎపిసోడ్ సోషల్ మీడియాలో రచ్చ చేసింది. అభిజిత్‌ను టార్గెట్‌గా చేసుకోవడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. స్టార్ మా, నాగార్జున, బిగ్‌బాస్ షోను టార్గెట్‌గా చేసుకొని ట్రోల్స్ వర్షం కురిపించారు. అయితే శనివారం కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకొన్నాయి. అవేమిటంటే..

గేట్లు ఓపెన్ చేసి వార్నింగ్‌తో
శనివారం సాయంత్రం విడుదల చేసిన ప్రోమోలో.. గేట్లు ఓపెన్ చేసి.. అభిజిత్‌ను ఇంటి నుంచి పంపిస్తున్నట్టు ఓ సన్నివేశాన్ని ప్రసారం చేశారు. అయితే ఆ పరిణామంతో హర్ట్ అయిన అభి ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన బిగ్‌బాస్ సెట్ వద్దకు భారీగా చేరుకొని హంగామా చేశారనే విషయం బయటకు వచ్చింది.

బిగ్‌బాస్‌కు వ్యతిరేకంగా ట్రోల్స్
ప్రోమో విడుదల తర్వాత నాగ్‌ను, బిగ్‌బాస్ షోను టార్గెట్‌గా చేసుకొని దారుణంగా ట్రోల్ చేశారు. తమ వాదనలతో హరిక, అభిజిత్‌తో హోస్ట్ నాగ్ వ్యవహరించిన తీరు సమంజసంగా లేదని కామెంట్ల వర్షం కురిపించారు. #StopTargetingAbijeet #WeAdmireAbijeet లాంటి హ్యాష్ ట్యాగ్స్‌ను ట్రెండ్ చేశారు.

నాగ్ ఫ్యాన్స్ అభ్యంతరం
అయితే నాగ్‌ను ఉద్దేశించి కొందరు నెటిజన్లు అసభ్యకరంగా పోస్టులు చేసినట్టు వెలుగులోకి వచ్చింది. అలాంటి పోస్టులపై నాగ్ ఫ్యాన్స్ అభ్యంతరం తెలిపారు. గేమ్‌ను గేమ్‌గానే చూడాలి. వ్యక్తిగత దూషణలకు వెళ్లవద్దు అంటూ కామెంట్స్ చేశారు.

సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాం
అభిజిత్, హారికకు హోస్ట్ నాగ్ క్లాస్ పీకడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందించి వ్యక్తిగతంగా ట్రోలింగ్ చేశారు. అయితే అలాంటి అసభ్యకరమైన ట్రోల్స్‌ను సేకరించాం. వాటిని సైబర్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చి ఫిర్యాదు చేస్తాం అంటూ కొందరు నాగార్జున అభిమానులు ట్వీట్లు చేశారు.
Recommended Video

బిగ్‌బాస్ తెలుగు 2లో నానిని కూడా
ఇదిలా ఉండగా, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం అయ్యాయి. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2లో కూడా కౌశల్ ఆర్మీ సభ్యులు హోస్ట్ నానిని విపరీతంగా ట్రోల్ చేశారు. అప్పట్లో నానిని ట్రోల్ చేయడం కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. తాజాగా ఆ బారిన నాగ్ పడటం మరింత చర్చనీయాంశమవుతున్నది.


Click it and Unblock the Notifications











