twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్సువల్ వేధింపులు: టార్గెట్ చేయొద్దు... అంటూ యాంకర్ రష్మి ట్వీట్!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Rashmi Gautam Says : Stop Targeting The Film Industry

    గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో సెక్సువల్ వేధింపులు, కాస్టింగ్ కౌచ్ అంశం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితి మరింత హీటెక్కింది. ఇండస్ట్రీలో మహిళల పట్ల నీచంగా, దారుణంగా వ్యవహరిస్తున్న పలువురు టాప్ డైరెక్టర్లు, టాప్ యాక్టర్ల పేర్లు ఆమె బయట పెట్టడం సంచలనం అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రతి యాక్టర్‌కు కాస్టింగ్ కౌచ్ ఇష్యూ గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా అభిమానులతో ట్విట్టర్ చాట్ చేసిన యాంకర్ రష్మికి కూడా కాస్టింగ్ కౌచ్ అంశంలో ఓ అభిమాని అడిగిన దానికి సమాధానం చెప్పాల్సి వచ్చింది.

    ఇండస్ట్రీని టార్గెట్ చేయవద్దు

    మహిళలపై సెక్సువల్ హెరాస్మెంట్, లైంగిక దోపిడీ అనేది అన్ని చోట్లా ఉంది. ఇదొక పెద్ద సమస్య. కేవలం సినిమా ఇండస్ట్రీలోనే ఇది జరుగుతుంది అనే విధంగా మాట్లాడొద్దు. ‘కాస్టింగ్ కౌచ్' పేరుతో ఇండస్ట్రీని టార్గెట్ చేయవద్దు... అని రష్మి ట్వీట్ చేశారు.

    తనపై పంచ్‌లు వేస్తుండటంపై రష్మి రియాక్షన్

    జబర్దస్త్, ఇతర టీవీ కార్యక్రమాల్లో యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్, ఇతరులు రష్మిపై పంచ్ లు వేస్తున్న సంగతి తెలిసిందే. నీపై అలా పంచ్ లు వేస్తుంటే కోపం రావడం లేదా? అనే ఓ అభిమాని ప్రశ్నకు రష్మి రియాక్ట్ అవుతూ.... ‘కోపం ఎందుకు? మేమంతా కలిసి పని చేస్తున్నా, ఒక ఫ్యామిలీలా ఉంటాం. ఇదంతా తమ జాబ్‌లో భాగమే' అని తెలిపారు.

    వేశ్య పాత్రలు చేస్తే గౌరవం పోతుందా?

    వేశ్య పాత్రలు చేయడం వల్ల నటీమణుల గౌరవం పోతుందని భావించడం లేదు, వేదంలో అనుష్క చేసి పాత్రకు ఎంతో పేరొచ్చింది. ఆ రోల్స్ చేయడం అంటే అంత సులభం కాదు, ఎంతో చాలెంజ్‌తో చేస్తే తప్ప ఇలాంటి పాత్రలు పండవు అని రష్మి తెలిపారు

    నాకు అలాంటి అవకాశం రాలేదు

    తన కెరీర్లో ఇప్పటి వరకు వేశ్య పాత్రలు చేసే అవకాశం రాలేదని, అలాంటి పాత్రలు రావాలన్నా, చేయాలన్న నటన పరంగా ఎంతో ఎస్టాబ్లిష్ అయుండాలి అని రష్మి తెలిపారు.

    సెక్సీ పాత్ర కాబట్టే అందరికీ గుర్తుంది

    గుంటూరు టాకీస్ మూవీలో నేను 15 నిమిషాల కంటే ఎక్కువగా కనిపించను. ఆ పాత్రలో సెక్సీనెస్ ఉందే తప్ప వల్గారిటీ లేదు, అందుకే సినిమా విడుదలై చాలా కాలం అయినా ఇప్పటికీ అందరికీ గుర్తుండి పోయింది. ఆ పాత్రలో ఓ మ్యాజిక్ ఉంది అని రష్మి తెలిపారు.

    వీకెండ్ ఎంజాయ్మెంటులో రష్మి

    ఈ వీకెండ్ రష్మి ఎక్కడికో వెకేషన్ వెళ్లారు. చూస్తుంటే గోవా సముద్రతీరంలా కనిపిస్తోంది.

    English summary
    "Sexual exploitation of women happens every where address the bigger issue and stop targeting the film industry in the name of #castingcouch let’s do our bit to put an end to this rather than making it a topic for cheap thrills." Rashmi said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X