మొబైల్‌లో హీరోయిన్ వీడియో: క్లాస్‌ రూంలో అడ్డంగా బుక్కైన స్టూడెంట్.. వంటలక్క షాకింగ్ రియాక్షన్

మిగిలిన భాషల పరిస్థితి ఏమో కానీ.. తెలుగులో మాత్రం డైలీ సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వస్తుంటుంది. అందుకే మన ధారావాహికలు వేలకు వేల ఎపిసోడ్స్‌తో సాగుతుంటాయి. ఇప్పటికే ఈ తరహాలో ఎన్నో సీరియళ్లు బుల్లితెరపై సందడి చేశాయి. ఇప్పుడు జనాలు ఎక్కువగా ఆదరించిన వాటి జాబితాలో 'కార్తీక దీపం' కూడా వచ్చి చేరింది. దాదాపు మూడేళ్లుగా ఈ సీరియల్ విజయవంతంగా ప్రసారం అవుతోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసి షాకిచ్చింది. ఆ వివరాలు మీకోసం!

ఆ సీరియల్‌కు రీమేక్‌గా వచ్చిందే ఇది

ఆ సీరియల్‌కు రీమేక్‌గా వచ్చిందే ఇది

దాదాపు మూడేళ్లకు పైగానే 'కార్తీక దీపం' తెలుగులో నెంబర్ వన్ సీరియల్‌గా వెలుగొందుతోంది. మలయాళ సూపర్ హిట్‌ సీరియల్ 'కరుతముత్తు'కు ఇది రీమేక్‌‌గా వచ్చిన విషయం చాలా మందికి తెలియదు. ఇక, ఇందులో హీరో డాక్టర్ బాబు.. దీపను పెళ్లి చేసుకుని అనుమానంతో వదిలేస్తాడు. ఆ తర్వాత ఆమెకు పుట్టిన కవలలు తల్లిదండ్రులను ఎలా కలిపారనేదే ఈ సీరియల్ నేపథ్యం.

తెలుగింటి ఆడపడుచుగా మారిన దీప

తెలుగింటి ఆడపడుచుగా మారిన దీప

తెలుగులో ఎన్నో సీరియళ్లు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ మధ్య కాలంలోనైతే ప్రేక్షకులను అలరించింది మాత్ర 'కార్తీక దీపం' అని చెప్పొచ్చు. ఇక, ఇందులో హీరోయిన్‌గా చేస్తున్న ప్రేమీ విశ్వనాథ్‌కు కూడా అదే స్థాయిలో పాపులారిటీ వచ్చింది. ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతేకాదు, ప్రతి ఒక్కరూ ఆమెను తెలుగింటి ఆడపడుచుగా చేసేసుకున్నారు.

దేశంలోనే మొదటిది... అప్పటి నుంచే

దేశంలోనే మొదటిది... అప్పటి నుంచే


'కార్తీక దీపం' సీరియల్‌కు మొదటి నుంచీ విశేషమైన స్పందన వస్తోంది. ఫలితంగా దీనికి భారీ స్థాయిలో రేటింగ్ లభిస్తోంది. అంతేకాదు, ఎన్నో చానెళ్లలో వస్తున్న షోలు సైతం దీని ముందు దిగదుడుపే అవుతున్నాయి. అంతలా రేటింగ్ సాధిస్తోందీ వంటలక్క సీరియల్. ఆరంభం నుంచీ ఇదే రేంజ్‌లో రేటింగ్ రాబడుతూ దేశంలోనే ఈ ఘనత సాధించిన మొదటి సీరియల్‌గా నిలుస్తోంది.

ఆ మైలురాయిని దాటేసిన కార్తీక దీపం

ఆ మైలురాయిని దాటేసిన కార్తీక దీపం

'కార్తీక దీపం' సీరియల్ రోజు రోజుకూ కొత్త మలుపు తిరుగుతూ సాగిపోతోంది. దీంతో ప్రేక్షకులకు మరింత మజాను పంచుతోంది. ఈ మధ్యనే ఇది 1000 ఎపిసోడ్స్‌ను కూడా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే, ప్రతి రోజూ ఏదో ఒక ఆసక్తికరమైన అంశాన్ని జోడించి ఈ సీరియల్‌ను విజయవంతంగా ప్రసారం చేస్తున్నారు. దీంతో దీనికి ఫ్యాన్స్ మరింతగా పెరిగిపోతున్నారు.

వంటలక్క డాక్టర్ బాబు ముద్దు.. వైరల్

వంటలక్క డాక్టర్ బాబు ముద్దు.. వైరల్

గత వారం 'కార్తీక దీపం' సీరియల్‌లో ఓ భారీ ట్వీస్ట్ కనిపించింది. అదే.. దీపకు క్యాన్సర్ ఉందన్న న్యూస్. దీనికి ఆమె చికిత్స చేసుకోడానికి నిరాకరించడం.. వెంటనే భర్త డాక్టర్ బాబు ఎంట్రీ ఇచ్చి ఆమెను మందలించడం జరిగింది. అదే సమయంలో వీళ్లిద్దరి మధ్య ముద్దు సీన్ కూడా పెట్టారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఎవరి ఫోన్ స్టేటస్‌లో చూసినా అదే కనిపించింది.

క్లాస్‌ రూంలో అడ్డంగా బుక్కైన స్టూడెంట్

క్లాస్‌ రూంలో అడ్డంగా బుక్కైన స్టూడెంట్


కార్తీక దీపం హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలుసు. అంతలా ఆమె నిరంతరం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఓ స్టూడెంట్‌ క్లాస్ రూమ్‌లోనే కార్తీక దీపం సీరియల్ చూస్తున్నాడు. దీన్ని ఎవరో వీడియో తీసి అతడిని అడ్డంగా బుక్ చేశారు.

Recommended Video

Ormax 2020 : Premi Viswanath Bags A New Award For Karthika Deepam | Filmibeat Telugu
వీడియోతో వంటలక్క షాకింగ్ రియాక్షన్

వీడియోతో వంటలక్క షాకింగ్ రియాక్షన్

క్లాస్ రూమ్‌లో కూడా తన వీడియోలు చూస్తున్న విషయం ప్రేమీ విశ్వనాథ్ వరకూ వచ్చింది. దీంతో దీన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఆమె.. 'అరే ఏంటి ఇది.. ఈ కార్తీక దీపం ఫ్యాన్స్ ఇలా ఉన్నారు' అంటూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రేమీ విశ్వనాథ్ అలియాస్ దీప కూడా ట్రెండ్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X