ఎన్టీఆర్...ఎంటర్నైన్మెంట్ ఛానెల్ టెస్ట్ సిగ్నల్స్
హైదరాబాద్ :జూ.ఎన్టీఆర్ ఛానెల్ అంటే ఆయన మామగారు నార్నె శ్రీనివాసరావు నార్నె నెట్ వర్క్ తరుపున స్టూడియో ఎన్ పేరుతో ఓ న్యూస్ ఛానెల్ ఇన్నాళ్లూ నడుపుతున్నారు. ఇప్పుడు ఆ న్యూస్ ఛానెల్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ఛానెల్ కూడా ప్రారంభిస్తున్నారు. నాన్ న్యూస్ ఛానెల్ విభాగంలో గతంలోనే లైసెన్స్ తీసుకున్న స్టూడియో వన్ ఛానెల్ ను జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ గా తీసుకువస్తూ టెస్ట్ సిగ్నల్ ప్రారంబించారు. త్వరలోనే ఈ రెండో ఛానెల్ కార్య క్రమాలు వేగం పుంజుకుంటాయంటున్నారు.
వాస్తవానికి 2008 లోనే రెండు ఛానెల్స్ కు లైసెన్స్ తెచ్చుకున్నారు. అయితే ఎన్నికలు రావటంతో అప్పుడు కేవలం న్యూస్ ఛానెల్ హడావిడిగా తీసుకు వచ్చారు. తర్వాత ఇంగ్లీష్ ఛానెల్ గా పెడదామనుకున్నావద్దనుకుని వదిలేసారు. కొంతకాలం నారా లోకేష్ నిర్వహణ భాధ్యతలు చూసిన ఈ ఛానెల్...తర్వాత పెద్దగా తమ పార్టీకి ఉపయోగపడటంలేదని వదిలేసారు. దాంతో మళ్లీ నార్నే శ్రీనివాసరావే సమర్ధవంతంగా నడుపుకువస్తున్నారు.
ఇప్పటికే దాదాపు రెండువందలకు పైగా సినిమాల శాటిలైట్ రైట్స్ తీసుకున్నవారు ఈ రంగంలో రాణిద్దామనే ఉత్సాహంలో ఉన్నారు. ప్రస్తుతం న్యూస్ ఛానెల్ లో వచ్చిన కొన్ని పోగ్రామ్ లను ఈ కొత్త ఛానెల్ లో ప్రసారం చేస్తున్నారు. ఇక ఈ ఛానెల్ ని ఇంతకుముందు జూ.ఎన్టీఆర్ స్నేహితుడు రాజీవ్ కనకాల చూస్తాడన్న ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఎవరు దీని పూర్తి భాధ్యతలు వహించబోతున్నారనేది తెలియటం లేదు. ఈ ఛానెల్...డిల్లీ శివార్లలోని నోయిడా లోని ఓ టెలిపోర్ట్ నుంచి ప్రసారాలు సాగిస్తోంది.


Click it and Unblock the Notifications












