Naga Panchami Jan 3rd: మళ్లీ వచ్చేసిన సుబ్బు.. ఫణీంద్ర పామని తెలుసుకున్న జ్వాల.. ఏం జరగబోతుంది?
నాగ పంచమి సీరియల్ రసవత్తరంగా సాగుతోంది. మొన్నటి నుంచి పంచమిని నాగ లోకం తీసుకెళ్లేందుకు నాగలోకపు యువరాజు ఫణీంద్ర, మేఘన రూపంలో ఉన్న కరాళీలు విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారి మనసుల్లో ఏముందో తెలియక పంచమి.. భర్తను కాపాడుకోవడానికి వారు చెప్పినట్లుగా చేయాలని యోచిస్తోంది. ఈక్రమంలోనే సీరియల్ నిర్వాహకులు అద్భుతమైన ట్విస్ట్ ఇచ్చారు. కార్తీక పౌర్ణమి అప్పుడు వెళ్లిపోయిన సుబ్బును మరోసారి సీరియల్ లోకి తీసుకు వచ్చారు. ముఖ్యంగా ఇంట్లోంచి వెళ్లిపోయిన పంచమి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్లడం అక్కడే సుబ్బు ప్రత్యక్షం అయి మళ్లీ పంచమి మనసు మార్చడం జరుగుతుంది.
ఈక్రమంలోనే మరోసారి నా వెంట వస్తావా అని పంచమి అడగ్గా.. వస్తానని సుబ్బు అంటాడు. ఇలా సుబ్బు మరోసారి పంచమితో మోక్ష ఇంటికి వచ్చేందుకు పయనం అవుతారు. మరోవైపు నాగలోకపు యువరాజు ఫణీంద్ర మనిషి రూపంలో ఉండగా.. జ్వాల కంట పడతాడు. ఏయ్ నువ్వు ఎవరని అడగ్గానే... అతడు పాము రూపంలోకి మారిపోతాడు. తన కళ్ల ముందే మారిపోవడంతో ఆమె షాక్ అవుతుంది. వెంటనే ఇంట్లోకి వెళ్లి ఆ విషయాన్ని వారికి వివరిస్తుంది. కానీ ఆమె చెప్పింది ఎవరూ నమ్మరు. ఈక్రమంలోనే చిత్ర కూడా మన ఇంట్లో ఉన్న పంచమి కూడా అలాంటి పామే అని చెబుతుంది. మేఘన మాత్రం మనషులు పాములుగా మారే అవకాశమే లేదని వివరిస్తుంది.

మరోవైపు పంచమి అడవుల్లోంచి ఇంటికి తిరిగి వస్తుండగా.. మోక్ష వస్తాడు. పంచమి కోసం సుబ్రహ్మణ్య స్వామి గుడికి రాబోయిన అతడికి మధ్యలోనే పంచమి కనిపిస్తుంది. దీంతో పంచమి ఆగు అని పిలిచి పరిగెట్టుకుంటూ వస్తాడు. రాగానే భార్యను గట్టిగా హత్తుకుని ఏడ్చేస్తాడు. ఇదంతా ఈరోజుటి ఎపిసోడ్ లో జరుగుతుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే... మోక్ష ఇంట్లో బట్టలు మార్చుకుంటూ ఉంటాడు. ఈక్రమంలోనే అతడిపై బొద్దింక పడడం అదే సమయంలో మేఘన రావడంతో ఏదో ఉంది తీయమని అంటాడు. ఇలా పొరపాటున ఆమెపై పడగా.. మోక్ష తల్లిదండ్రులు చూస్తారు.
కావాలనే పడ్డారని మేఘన అనగా.. అదేం లేదని మోక్ష చెప్పేలోపే జోక్ చేశాను లెండి కావాలని పడితే నన్ను వదిలేవారు కాదు కదా అంటూ అంటాడు. ఆ తర్వాత మోక్ష తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్లిపోవడం, మేఘన వెళ్లిపోవడం చూపిస్తారు. ఇక ఫణీంద్ర నాగదేవతను ప్రసన్నం చేసుకోవడం.. పనులు ఎక్కడి వరకు వచ్చాయని అడగడం చూపిస్తారు. అన్నీ సాగుతున్నాయి తీసుకు వస్తానని చెప్పిన నాగ దేవతను పంపించేస్తాడు ఫణీంద్ర. ఆ తర్వాత పంచమి కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి మాయతో ఆమెకు తగిలిన గాయాలన్నీ మాయం అవుతాయి. షాక్ లో ఉన్న పంచమి వద్దకు సుబ్బ వస్తాడు.
సుబ్బును చూసి మరింత ఎగ్జైట్ అవుతుంది పంచమి. నువ్వు ఇక్కడేంటి సుబ్బు అంటూ అనగా.. నేనిక్కడే ఉంటాను.. నువ్వే నా వద్దకు వచ్చావని అంటాడు. ఏంటో చెప్పమని అనగా ఇంట్లోని విషయాలు చెబుతుంది. ముఖ్యంగా మోక్షను గుర్తు చేయగానే ఆమె పరుగున వచ్చే ప్రయత్నం చేస్తుంది. సుబ్బు వెంటనే నన్నొదిలేసి వెళ్తున్నావా మోక్ష పేరు చెప్పగానే అంటాడు. ప్రాయశ్చితం చేసుకోవాలి సుబ్బు అంటుంది. ఈక్రమంలోనే సుబ్బు నువ్వు కూడా నా వెంట వస్తే బాగుంటుంది వస్తావా అని అడుగుతుంది. అందుకు సుబ్బు ఓకే చెప్పగా వీరిద్దరూ కలిసి ఇంటికి బయలు దేరుతారు.

ఇక ఆ తర్వాత పంచమిని వెతుక్కుంటూ మోక్ష నాగుల వరం వెళ్తాడు. ముఖ్యంగా నాగ సాధువు వద్దకు వెళ్లి.. క్షమించరాని తప్పు చేశానని.. భార్యపై చేయి చేసుకున్నానని వివరిస్తాడు. పంచమి వంటి సున్నిత మనస్కులు శరీరానికి అయిన గాయాలను పెద్దగా పట్టించుకోదని.. కానీ మనసుకు ఏమైనా అయితే మాత్రం అస్సలే తట్టుకోలేదని వివరించాడు. నువ్వు బాధ, కోపంలో ఉండడంతో ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియదని.. కానీ నువ్వు కరెక్టుగా ఆలోచిస్తే ఆమె ఎక్కడికి వెళ్లిందో నీకే తెలుస్తుందని అన్నాడు. దీంతో మోక్ష వెంటనే పంచమి ఉన్న చోటుకు వెళ్తాడు.


Click it and Unblock the Notifications











