Naga Panchami:యాగం చేసేందుకు వచ్చిన సప్తర్షులు..సుబ్బును వెళ్లగొట్టి ఆత్మాహుతికి సిద్ధమైన పంచమి..ఏం జరగనుంది?

Naga Panchami December 8th Episode: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతుంది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి దగ్గర పడడం.. పంచమి పాముగా మారబోయే గడియలు సమీపిస్తున్నా కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. పాముగా మారి మోక్షను చంపేస్తుందా.. ఏం జరగబోతుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు మోక్ష మాత్రం పంచమిని గర్భవతిని చేసి లోకాన్ని వీడిపోవాలని చూస్తుండగా.. పంచమియే ప్రాణాలు తీసుకొని మోక్షను కాపాడుకోవాలనుకుంటుంది. మరోవైపు కరాళీ మోక్ష బ్రహ్మచర్యం పోగొట్టి నాగమణిని సంపాధించుకోవాలనుకుంటుండగా... నాగ దేవత, నాగులు పంచమిని నాగ లోకానికి తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఇన్ని సమస్యల మధ్యు.. సుబ్బు.. మోక్ష, పంచమిలకు సాయంగా ఉంటూ వస్తున్నాడు.

అయితే ఈరోజుటి ఎపిసోడ్ లో.. ఎలాగూ చనిపోవాలని నిర్ణయించుకున్న పంచమి ఇంతకాలం నుంచి తనకు సాయంగా ఉన్న సుబ్బును వెళ్లిపోవాలని చెబుతుంది. అతను ఒప్పుకోకపోవడంతో తనపై ఒట్టు వేసుకొని మరీ వెళ్లగొడుతుంది. ఇప్పుడు వెళ్లిపోమంటున్నావు కాబట్టి వెళ్లిపోతున్నాను.. కానీ మళ్లీ నువ్వే వచ్చి పిలిచినా రానంటూ చెప్పి సుబ్బు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పంచమి అటువైపు తిరగగానే.. వెళ్లిపోతూ కనిపించి మాయమైపోతాడు. ఆ తర్వాత ఆయన గుహకు వెళ్లి ఉండిపోతాడు. ఈక్రమంలోనే పంచమి ఎన్ని జన్మలు ఎత్తినా... నీ రుణం తీర్చుకోలేను సుబ్బు అంటూ నమస్కరిస్తుంది.

Subbu Clever Plan to Complete Maha Mrityunjaya Yagam on December 8th Episode Number 221 in Naga Panchami Telugu Serial

ఇక ఆ తర్వాత పంచమి తన ఆత్మాహుతి కోసం ఏర్పాట్లు చేసకుంటూ కనిపిస్తుంది. కర్రలన్నీ ఓ చేట వేసి దానికి ప్రదక్షిణలు చేస్తుంది. మంటలు కూడా పెడుతుంది. ఆపై దేవుడిని వేడుకుంటూ చనిపోవాలనుకుంటుంది. అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా ఆమె ఆత్మాహుతి అయ్యేందుకు మంటల్లోకి వెళ్తూ కనిపిస్తుంది. అయితే ఏమైందో తెలియాలంటే మాత్రం రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ముందు చిత్ర, జ్వాలలు తమ మొగుళ్లను ఆటాడిస్తూ కనిపిస్తారు. పొరపాటును బయటకు వెళ్లి ఎంజాయ్ చేస్తామనడంతో కుటుంబ సభ్యుల ముందు పరువు తీస్తామంటూ రచ్చ చేస్తారు.

మీ శీలాన్ని ప్రూవ్ చేసుకోవడానికి మంటల్లో దూకాలి, సలసలా కాగే నూనెలో చేతులు పెట్టాలంటూ మాట్లాడతారు. ఇంట్లో వాళ్లకు అది తెలియకుండా ఉండాలంటే మేము చెప్పినట్లు వినాలని ఇద్దరూ భర్తల చేత కాఫీలు పెట్టించుకుంటారు. ఇక ఆ తర్వాత పంచమి తన ఊరులో తిరుగుతూ కనిపిస్తుంది. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ హాయిగా నవ్వుకుంటుది. స్నేహితులను కూడా కలిసి మాట్లాడుతుంది. గతంలో ఊరే వదిలి వెళ్లనని చెప్పిన నువ్వు అందరి కంటే ముందు పెళ్లి చేసుకొని వెళ్లిపోయావు కదా అంటూ స్నేహితులు అడిగారు. అందుకు ఫీలైన పంచమి ఇక్కడే ప్రాణాలు విడుస్తానని అంటుంది.

ఇక ఆ తర్వాత కరాళీ.. మోక్ష వద్ద కూర్చొని మాట్లాడుతూ కనిపిస్తుంది. పంచమి, ఊరు అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావు.. ఆమె పాము కావడం, నీ ప్రాణాలు తీయడం బాధగా అనిపిస్తుందా అంటూ మాట్లాడుతుంది. లేదని.. తన భార్య ప్రతీ క్షణం తన బాగు కోసం మాత్రమే చూస్తుందని అంటాడు. తాను చనిపోయిన పంచమి సుఖంగా ఉండాలనుకుంటున్నట్లు వివరిస్తాడు. పంచమిపై మోక్షకు ప్రేమ ఎక్కువగానే ఉందని.. అతడిని మంత్ర శక్తితో మాత్రమే వశం చేసుకోగలను అంటూ కరాళీ మనసులో అనుకుంటుంది.

ఇక ఆ తర్వాత సుబ్బు ధ్యానం చేసుకుంటూ కనిపిస్తాడు. మహా మృత్యుంజయ యాగాన్ని జరిపించేందుకు సప్త రుషులను పిలుస్తాడు. సప్త రుషులు ప్రత్యక్షం అవగానే.. పంచమి గురించి ఆమె సమస్యల గురించి వివరిస్తాడు. భర్తను కాపాడుకోవడానికి ఆమ చేస్తున్న యాగాన్ని ఆపాలని నాగ దేవత ప్రయత్నిస్తుందని.. అది విజయవంతం కావాలంటే మీరు మాత్రమే యాగాన్ని చేయాలని అంటాడు. అందుకు వాళ్లు కూడా ఒప్పుకోవడంతో సుబ్బు హ్యాపీగా ఫీలవుతాడు. ఇక ఇంతటితో ఈరోజుటి ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X