Naga Panchami: ఇంటి నుంచి వెళ్లిపోయిన సుబ్బు.. దుఃఖంలో పంచమి, ఏం జరగబోతుంది?
Naga Panchami November 5th Episode: నాగ పంచమి సీరియల్ గత కొంత కాలంగా అద్భుతంగా సాగుతుంది. ముఖ్యంగా పంచమి జన్మ రహస్యం తెలుసుకున్న మోక్ష.. తర్వాత ఏం చేయబోతాడా అనేది మరింత ఆసక్తిగా మారింది. ముఖ్యంగా ఇన్నాళ్లు పంచమితో పాటే ఉండే ఆ సమస్యలు తీర్చిన (సుబ్బు) సుబ్రహ్మణ్య స్వామిపైనే ఈరోజుటి ఎపిసోడ్ లో నిందలు పడ్డాయి. శిశిర బంగ్లాపైకి ఎక్కి చెట్టుపై ఉన్న కాగితపు విమానాన్ని తీసుకుంటుంది. సుబ్బు, చిత్ర ఎంత వద్దని చెప్పినా వినకుండా అందుకునే ప్రయత్నం చేసి కింద పడుతుంది. తీవ్ర గాయాల పాలవుతుంది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా... సుబ్బుయే నెమలి ఈకతో కాళ్లపై రాస్తాడు. ఇలా ఆమెను కాపాడతాడు.
కానీ చిత్ర మాత్రం సుబ్బు చెప్పడం వల్లే తన కూతురు ఆ కాగితపు విమానం తీసుకు రావాలని భావించినట్లు చెబుతుంది. తనపై, తన కూతురుపై ఇంట్లో వాళ్లకి ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే వారిని ఇంటి నుంచి పంచించి వేయాలని అంటుంది. శిశిర పైనుంచి కింద పడే సరికి మోక్ష కూడా ఫుల్ సీరియస్ అవుతాడు. ఈక్రమంలోనే పంచమిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఇదేం ధర్మసత్రం కాదు.. ఎవరంటే వారు వచ్చి ఉండడానికి అంటూ గట్టిగా అరుస్తాడు. అతడిని ఇక్కడి నుంచి పంచించి వేయు.. ఇది నా ఆర్డర్ అని పంచమితో అంటాడు. ఇక ఆ తర్వాత కుటుంబ సభ్యులు అంతా ఇంట్లోకి వెళ్లిపోగా... పంచమి నీ నిర్ణయం చెప్పు అంటూ సుబ్బు అడుగుతాడు. పంచమి ఏమీ మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్లిపోతుంది. ఇలా సుబ్బు అపనిందల పాలై ఇంటి నుంచి వెళ్లిపోతాడు. ఇదంతా ఈరోజుటి ఎపిసోడ్ లో జరుగుతుంది.

ఇక నిన్నటి ఎపిసోడ్ లో పంచమి నాగ దేవతతో మాట్లాడుతూ కనిపిస్తుంది. ఇక నీకు ఈ జన్మలో నాగ లోక ప్రవేశం లేదని వివరిస్తుంది. కావాలనే నీ భర్తను కాపాడుకునేందుకు పౌర్ణమి రోజు మోక్షను కాటు వేయలేదని అంటుంది. ఇక నీ అవసరం లేదని, వచ్చే పౌర్ణమికి నీ కళ్ల ముందే నాగ కన్యలు వచ్చి మోక్షను క్రూరంగా కాటేసి చంపుతారని వివరిస్తుంది. అలాగే ఎవరి కోసం బతకాలో కూడా తెలియక, నీవు ఏడుస్తుంటే... పాముగా మారిని నీ అనుకున్న నీ వాళ్లే కొట్టి చంపుతారని.. ఇదే జరగబోతుందని అంటుంది. కానీ నీ మొర విన్నాను కాబట్టి.. నీకే మోక్షను చంపే అవకాశం ఇస్తున్నానని, వచ్చే పౌర్ణమి రోజు అతడిని చంపి కనీసం నీ తల్లి చివరి కోరిక తీర్చు అని చెప్పి మాయమైపోతుంది.

ఈక్రమంలోనే పంచమి ఏడుస్తూ ఓ చోట ఉండగా... సుబ్బ వస్తాడు. ఎందుకు ఏడ్వడం.. సమస్యలను కావాలనే నీవు పెద్దగా చేసి చూస్తున్నావని అంటాడు. అందుకే నీకు ఇంత దుఃఖం వస్తుందని వివరిస్తాడు. నీవు మనిషివి, ఏదో ఒక కార్యం చేసేందుకే పుట్టావు, అది ఎందుకో తెలుసుకో అని అంటాడు. ఇలా బాధ పడుతూ కూర్చుంటే ఏ కష్టాలు కూడా మాయమైపోవని అంటాడు. సుబ్బు మాటలకు ధైర్యం తెచ్చుకున్న పంచమి.. నీవు ఎవరు, నాకు నువ్వే సుబ్రహ్మణ్య స్వామివి అని అనిపిస్తుందని చెబుతుంది. నీ కష్టాల గురించి మర్చిపోమ్మంటే.. నా గురించి తెలుసుకోవడం మొదలెట్టావా అని సుబ్బు అనగా.. చిన్న పిల్లాడివి కాబట్టే నీకు నమస్కరించలేకపోతున్నాను... లేదంటే దండం పెట్టేదాన్నే అని అంటుంది. ఇంట్లో ఉండాలా వెల్లిపోవాలా అని అడగ్గా... నీ ఇష్టం సుబ్బు, నాకోసం నిన్ను ఇక్కడే ఉండమనడం స్వార్థమే అవుతుందని అంటుంది.

ఆ తర్వాత మోక్ష నాగులవరంకు వెళ్లి పంచమి తల్లిని కలుస్తాడు. ఆమె పుట్టు పూర్వత్తరాల గురించి చెప్పమని అడుగుతాడు. ఆమె మాత్రం వాటి గురించి తనకు ఏమీ తెలియదని.. అలాంటివే తెలుసుకోవాలనుకుంటే పంచమిని నా వద్దకు పంపించేయండి, నేను చూసుకుంటానని అంటుంది. ఇక అక్కడి నుంచి మోక్ష స్వామిజీ వద్దకు వెళ్తాడు. అక్కడే పంచమి జన్మ రహస్యం, ఆమె పాము అని.. నిన్ను చంపితేనే ఆమె నాగ లోక ప్రవేశం ఉంటుందని మొత్తం చెబుతాడు. ఇలా పంచమి గురించి తెలుసుకున్న మోక్ష ఏం చేయబోతున్నాడో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











