Naga Panchami: సుబ్బు మాటలతో పంచమికి దగ్గరైన మోక్ష.. యువరాజు ఏం చేయబోతున్నాడు?

Naga Panchami November 13th Episode: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ అత్యధిక టీఆర్పీతో దూసుకెళ్తోంది. అద్భుతమైన ట్విస్టులతో అందరినీ అలరిస్తోంది. ముఖ్యంగా ప్రతి ఎపిసోడ్ లోనూ సాగదీత లేకుండా ఓవైపు నాగదేవత, మరోవైపు కరాళీ, మరోవైపు సుబ్బు, ఇంకోవైపు పంచమిలను చూపిస్తూ.. అదరగొడుతున్నారు. అయితే తాజా ఎపిసోడ్ లో పంచమి తన భర్తను ఎలా కాపాడుకోవాలో తెలియక కన్నీరు పెడుతోంది. ఈక్రమంలోనే దేవుడిని ప్రార్థిస్తుంది. ఎదురుగా ధ్యానం చేసుకుంటూ సుబ్బు కనిపించగా.. వెంటనే సుబ్బు వద్దకు వెళ్తుంది. కానీ ధ్యానంలో ఉన్న సుబ్బును చూసి డిస్ట్రబ్ చేయడం ఇష్టం లేక వెనక్కి వచ్చేస్తుంది.

కానీ అది గమనించిన సుబ్బు.. పంచమిని పిలుస్తాడు. ఏదో చెప్పాలని వచ్చి చెప్పకుండానే వెళ్లిపోతున్నావేంటి అనగా.. పంచమి ఆగుతుంది. నేను ఏదో చెప్పాలనుకున్నట్లు సుబ్బుకు ఎలా తెలిసిందని మనసులో అనుకుంటూనే నీతో మాట్లాడాలని చెబుతుంది. అందుకు సుబ్బు.. చెప్పు పంచమి అనగా అసలు విషయం చెబుతుంది. గతంలో నేను నీకు ఓ కథ చెప్పాను గుర్తు ఉందా అని అడగ్గా.. ఓ ఉంది అని సుబ్బు అంటాడు. అది నా కథే అని నేను పాము రూపంలో ఉన్న మనిషిని అని చెబుతుంది. నాగ పంచమిని అని వివరిస్తుంది. అయితే తాను తన భర్తను కాపాడుకోవాలని ఎలాగో తెలియట్లేదని అంటుంది. అందుకు సుబ్బు పంచమికి ఓ ఉపాయం తట్టేలా చేస్తాడు.

Subbu Reassures Moksha on November 13th Episode Number 199 in Naga Panchami Telugu Serial

నువ్వు కేవలం పంచమివి కాదు నాగ పంచమివి.. నువ్వు రెండు రకాలుగా ఆలోచించాలని అంటాడు. నీవు పాముగా ఆలోచిస్తే నీ భర్తను కాపాడుకునే ఉపాయం తడుతుందని అంటాడు. అలా చెప్పగానే పంచమికి చాలా ధైర్యం వస్తుంది. నేను కాకపోయిన వేరే నాగులు అయినా సరే మోక్ష బాబును చంపేస్తాయని.. ఇది నాగదేవత ఆజ్ఞ అని అంటుంది. ఏదైనా సాధ్యమే పంచమి, ఇందుకు నీ జన్మే ఓ ఉదాహరణ అంటూ పంచమికి భరోసా ఇస్తాడు. పంచమి కూడా చాలా ధైర్యంగా వెళ్తుంది.

మరోవైపు మోక్ష కూడా భార్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేయాలో తోచక తెగ టెన్షన్ పడుతూ కనిపిస్తాడు. ఈక్రమంలోనే సుబ్బు వచ్చి తన చేతులతో పాము రూపంలో నీడను సృష్టించగా మోక్ష చాలా భయపడతాడు. ఇందుకు సుబ్బు విపరీతంగా నవ్వి ఎందుకు అంతలా భయపడుతున్నావు మోక్ష అని అంటాడు. నాగు పాములు అంటే కోపమే తప్ప భయం లేదని చెప్పగా..ఎందుకు కోపం అని సుబ్బు అడుగుతాడు. దానికి మోక్ష.. పాములు నిర్దాక్షిణ్యంగా కాటు వేసి చంపేస్తాయి, చిన్నా పెద్దా అని కూడా చూడవంటూ చెప్పుకొస్తాడు. మనుషులు కంటే పాములే మేలు అని వాటిని చంపితే తప్ప అవి పగబట్టవని సుబ్బు అనగా.. మీరు కొట్టడం వల్ల దెబ్బలు తిన్న పాము శాపమే ఇదంటూ పంచమి చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి.

ఇక ఆ తర్వాత తాను ఓ జీవిని హింసిస్తుంటే తన తల్లి చెంపపై మరకలు పడ్డాయని.. ఎందుకని తల్లిని అడిగితే అన్ని జీవుల్లో నేనుంటాను నువ్వు వేటిని హింసించినా నన్ను హింసించినట్లే అని తన తల్లి చెప్పినట్లు సుబ్బు వివరిస్తాడు. అలాగే తాను ఎప్పుడూ భయపడుతుంటే తండ్రి వదిలిపెట్టి పొమ్మన్నాడని.. అలా కోపంతో గుట్టకు వెళ్లానని వివరించాడు. అంతేకాకుండా తాను భయపడే వాటితో తండ్రి స్నేహం చేయమని చెప్పారని.. అలా చేస్తేనే భయం పోతుందని తెలుసుకున్నట్లు వివరించాడు. ఇందుకు మోక్ష నవ్వి సుబ్రహ్మణ్య స్వామి కథలన్నీ నాకు చెబుతున్నావా.. నీవే దేవుడిని అంటావేమో అంటూ నవ్వుతాడు.

Subbu Reassures Moksha on November 13th Episode Number 199 in Naga Panchami Telugu Serial

నిజంగా దేవుడే వచ్చినా నీవు గుర్తించలేవు అంటూ సుబ్బు అనగా... సరేలే అంటూ నవ్వుతాడు. కానీ సుబ్బు మాటలు మోక్షపై బాగానే పని చేశాయి. పంచమిపై కోపం పోయింది. ఈక్రమంలోనే ఆమె గదిలో పడుకొని ఉండగా ఆమె వద్దకు వెళ్లి కౌగిలించుకుంటాడు. బతికున్నంత కాలం నువ్వు నాతోనే ఉండాలని కోరుతాడు. అందుకు పంచమి కూడా సరే అంటుంది. ఇక ఆ తర్వాత యువరాజు ఫణీంద్ర భూలోకానికి వచ్చి పంచమిని కలుస్తాడు. వచ్చే పౌర్ణమికి మిమ్మల్ని నేను నాగ లోకానికి తీసుకెళ్తానని.... అక్కడే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని అంటాడు. అంతోలనే మోక్ష అక్కడకు రాగా.. ఫణీంద్ర దాక్కుంటాడు. పంచమి మోక్ష ఎత్తుకొని ముద్దు పెట్టుకోవడం చూసిన యువరాజు కోపంగా వారి దగ్గరకు వస్తాడు. ఇదంతా రేపటి ఎపిసోడ్ లో మనం చూడవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X