పంచమిపై సుబ్బు మాయ.. ఫణీంద్ర మోసం గ్రహించిన పంచమి.. ఏం చేయబోతుంది?

నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ మహా అద్భుతంగా సాగుతోంది. ముక్కోటి ఏకాదశి రోజు భర్తను కాటేసి నాగలోకం వెళ్లిపోయి నాగమణి తీసుకు వచ్చి భర్తను కాపాడుకోవాలని పంచమి భావిస్తోంది. ఆ ప్లాన్ ను అమలు చేయాలని కూడా చూస్తోంది. కానీ భర్తను కాటేసే ధైర్యం లేక ఊరుకుంది. కానీ ఆ విషయం గుర్తించిన మోక్ష కాటేయు పంచమి అంటూ అడుగుతాడు. ఇంతోలనే ఫణీంద్ర ఇలా కాదు వేరే ఎక్కడికైనా వెళ్లి మనం ఈ కార్యం చేద్దా అనగానే అంతా ఓకే అంటారు. మరి ఎక్కడ అనగా.. నాగులవరం వెళ్లి అక్కడే ఉన్న నాగ సాధువుల వద్ద ఈ పథకాన్ని అమలు చేద్దామని అనుకుంటారు. అలా ఇంట్లోంచి వెళ్లిపోతారు. అయితే మేఘన మాత్రం తాను రానని చెబుతుంది.

ఇంట్లో వాళ్లకు అనుమానం రాకుండా నేనిక్కడే ఉంటానని.. మీరు వెళ్లాకా అంటే రేపు నేను అక్కడకు వచ్చేస్తానని చెబుతుంది. అలా వాళ్ల వెళ్లిపోగానే మేఘన.. మోక్ష తల్లిదండ్రులు వద్దకు వెళ్తుంది. తాను గుడికి వెళ్లాలనుకుంటున్నట్లు చెబుతుంది. ఈక్రమంలోనే పంచమి, మోక్షలు ఎక్కడికెళ్లారు అనగా.. ఎవరైనా తెలిసన వాళ్ల వద్దకు వెళ్లి ఉండవచ్చని వివరిస్తుంది. వైదేహి చాలా కోప్పడతూ కనీస పద్ధతి, బాధ్యత లేదు.. ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లిపోతుంది పంచమి అని కోప్పడుతుంది. నీలాగా మా కోడలుకు పద్ధతులు తెలియవంటూ ఫైర్ అవుతుంది. ఇలా కాగానే మేఘన బయటకు వస్తుంది.

Subbu Special Game With Panchami on Naga Panchami January 9th Episode

మరోవైపు చిత్ర, జ్వాలలు అది గుర్తించి మేఘన గదిలో ఏమైనా ఉన్నాయేమో అని చూసేందుకు వెళ్తారు. అక్కడే ఓ మూట కనిపించగా విప్పి చూసేందుకు ప్రయత్నిస్తారు. దాన్ని ముట్టుకోగానే మేఘనకు ఆ విషయం తెలుస్తోంది. తన మంత్ర శక్తిలో వాళ్లు ఆ మూట తెరిచేలోపే దుష్టశక్తిని పంపిస్తుంది. ముందుగా జ్వాలలోకి వెళ్లిన ఆ దుష్టశక్తి చిత్రపై దాడి చేస్తుంది. ఆ తర్వాత చిత్రలోకి వెళ్లగా జ్వాలపై దాడి చేస్తుంది. ఆ తర్వాత ఆ శక్తిని మాయం చేసి మేఘన అక్కడ నుంచి వెళ్లిపోతుంది. చిత్ర, జ్వాలలు కూడా ఆ గదిలోంచి వెళ్లిపోతారు. ఇక పంచమి, మోక్ష, ఫణీంద్రలు నేరుగా గుడికి వెళ్తారు.

అక్కడకు వెళ్లగానే గుడిచుట్టూ ప్రదక్షిణలు చేసి.. పంచమి స్వామిని దర్శించుకోవడానికి వస్తుంది. మోక్ష, ఫణీంద్రలు మాత్రం ఒక్కచోట ఉంటారు. ఆ తర్వాత దేవుడిని మొక్కుకోగానే సుబ్బు కనిపిస్తాడు. దగ్గరకు వెళ్లి మాట్లాడేలోపే మాయం అవుతాడు. ఇలా పదే పదే కనిపిస్తూ పంచమి దగ్గరకు వెళ్లగానే మాయం అవుతుంటాడు. అసలు సుబ్బు ఇలా చేస్తూ.. పంచమికి ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. ఇక ఆ తర్వాత సుబ్బు కోసం పంచమి ఏడుస్తుంది. ఇలా ఈరోజుటి ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Subbu Special Game With Panchami on Naga Panchami January 9th Episode

అయితే రేపటి ఎపిసోడ్ లో మేక్ష, పంచమిలు కలిసి నాగులవరం వెళ్లి నాగ సాధువును కలుస్తారు. ఈక్రమంలోనే నాగ సాధువు నాగమణిని భూలోకానికి తీసుకు రావడం అసంభవం అని.. నాగలోకానికే శక్తులు ప్రసాదించే నాగ మణిని అస్సలే తీసుకురాలేనని అంటాడు. అలాగే చంద్రకాంత మొక్క వల్లే మోక్షను కాపాడవచ్చని వివరిస్తాడు. కానీ ఫణీంద్ర నాగమణిని తీసుకు రావచ్చని చెప్పాడని పంచమి అనగా.. నిజంగానే అతడు మీకు సాయం చేయాలనుకుంటే చంద్రకాంత మొక్కను తీసుకు వచ్చి ఇవ్వమని అడగమంటూ నాగ సాధువు వివరిస్తాడు. చూడాలి మరి ఏం జరనగుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X