అందుకే తాగుడు మొదలుపెట్టా.. రోజు తాగుతున్నా.. అలవాట్లపై శుభలేఖ సుధాకర్
టాలీవుడ్ సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ ఎన్నో చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'శుభలేఖ' చిత్రంతో ఆయన కెరీర్ ప్రారంభం అయ్యింది. ఆ చిత్రం 1982లో విడుదలైంది. ఆసినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాంతో సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకొన్నారు. అందుకే ఆయన్ని శుభలేఖ సుధాకర్ అంటూ పిలుస్తూ ఉంటారు. ఇక ఇప్పటి వరకు శుభలేఖ సుధాకర్ 200కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. ఇప్పటికీ ఆయా చిత్రాల్లో మెరుస్తూనే వస్తున్నారు.
అయితే, శుభలేఖ సుధాకర్ వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా కూడా సెన్సేషన్ క్రియేట్ చేశారు. టెలివిజన్ డైలీ సీరియల్స్ తో సంచలనంగా మారారు. ఆయన నటించిన పాత్రలు స్మాల్ స్క్రీన్ పై సెన్సేషన్ గా మారాయి. 'పెళ్లి పందిరి', ఇది కథ కాదు, గాయత్రి, రాజు గారి కూతుర్లు, అమ్మాయి కాపురం, మమతల కోవెల, మనసు మమత, అను బంధాలు, చిట్టి తల్లి.. వంటి పాపులర్ సీరియల్స్ లో నటించారు. ఇక తెలుగులోనే కాకుండా తమిళ సీరియల్స్ లోనూ నటించి మెప్పించారు. మరోవైపు తమిళ చిత్రాల్లోనూ నటించి అలరించారు.

కోటేశ్వర్ రావు సినిమాలు, సీరియల్స్ తోనే కాకుండా తన అభిమానులను పలకరించేందుకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంటారన్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఆల్కహాల్ అడిక్షన్ ఉందనే వార్తలపై రీసెంట్ ఇంటర్య్వూలో స్పందించారు. ఆయన మద్యానికి బానిసయ్యారనే వార్తలు తప్పని చెప్పుకొచ్చారు. అసలు తనకే తాగే అలవాటే లేదని, దానివల్ల కానీ కెరియర్ ప్రారంభంలో అందరూ తనను దూరం పెట్టే వారని చెప్పారు. దాంతో ఆయనకు గిల్ట్ ఫీలింగ్ వచ్చేసి తన స్నేహితుడు ఒకరిని తనను వారితో ఎందుకు కలుపుకోవడం లేదని అడిగారంట.
నువ్వు ఎలాగే తాగేవాడివి కాదు కదా.. అని పక్కన పెట్టేసినట్టు బదులిచ్చాడంట అతను. దీంతో అప్పటి నుంచి సంఘంలో ఉండాలి కాబట్టి ఒక్క గ్లాస్ బీరు తాగడం అలవాటు చేసుకున్నానని చెప్పారు. కానీ క్రమేణ అది లిమిట్ లేకుండా ఓదశలో హాఫ్, ఫుల్ వరకు వెళ్లిందని చెప్పారు. ఇక ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి రోజుకు రెండు పెగ్ లు రెబ్ లేబుల్ మాత్రం తాగుతున్నట్టు చెప్పుకొచ్చారు. తనను ఎవ్వరూ ఏమనుకున్న ఆ నైట్ తాగే మందు మాత్రం తన అన్నీ రకాల బంధువై నిలుస్తుందని ఓపెన్ గా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే.. శుభలేఖ సుధాకర్ సినిమాలు, సీరియల్స్ లో నటించమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ దుమ్ములేపాడు. తన బేస్ వాయిస్ ను 'కేజీఎఫ్' చిత్రంలో నటించి సీనియర్ నటుడు అనంత్ నాగ్ కు అందించారు. 'సింహం గర్జన కంటే..' అంటూ చెప్పిన మాటలు ఆయనవే. అలాగే ఎన్నో తమిళ చిత్రాలకు తెలుగు డబ్బింగ్ చెప్పారు. తన వాయిస్ తో ఆయా పాత్రలకు ప్రాణం పోశారు. ఇక శుభలేఖ సుధాకర్ స్వయాన లెజెండరీ సింగర్, దివంగత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు బావ అనే విషయం తెలిసిందే. ఎస్పీ శైలజాను శుభలేఖ సుధాకర్ పెళ్లి చేసుకున్నారు. రీసెంట్ గా శుభలేఖ సుధాకర్ 'గేమ్ ఛేంజర్', 'కోర్టు', 'రాబిన్ హుడ్', 'మ్యాడ్ స్క్వేర్' వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











