Bigg Boss 7 Telugu: బెడ్‌రూంలో శుభశ్రీ ఊహించని పని.. అతడికి బిగ్ బాస్ హెల్ప్.. చివరికి షాకింగ్‌గా!
తెలుగు బుల్లితెరపై ఊహకే అందని విధంగా ప్రేక్షకాదరణను అందుకుని సూపర్ డూపర్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని కంటెంట్‌తో నడిచేదే అయినా.. మన ప్రేక్షకులకు ఇది చాలా త్వరగానే చేరువైంది. అందుకే విజయవంతంగా ఆరు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఏడోది కూడా ప్రారంభం అవగా.. దీనికి కూడా మంచి స్పందనే దక్కుతోంది. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఓ ఊహించని సంఘటన జరిగింది. దీంతో బిగ్ బాస్ హెల్ప్ చేశాడు. ఇంతకీ ఏమైందో మీరే చూసేయండి!
చెప్పినట్లే ఆసక్తికరంగా సీజన్:గత సీజన్ల కంటే ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామని చెప్పినట్లుగానే.. బిగ్ బాస్ నిర్వహకులు ఏడో దానిని ఎంతో ఆసక్తికరంగా నడిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆరంభంలోనే అదిరిపోయే టాస్కులతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత వినూత్నమైన ప్రయోగాలు చేస్తూ సత్తా చాటుతున్నారు. దీంతో ఈ సీజన్‌కు ఆరంభం నుంచే అందరిపోయే రెస్పాన్స్ కూడా లభిస్తోంది.

తాళం కోసం ప్రయత్నాలతో:ఈ వారం జరిగిన 'మాయ అస్త్ర' టాస్క్‌లో మహాబలి టీమ్ సభ్యుడు గౌతమ్ రణధీర టీమ్ దగ్గర ఉన్న కీని కొట్టేద్దాం అని తన జట్టు సభ్యులకు చెప్పాడు. దీంతో వాళ్లంతా దాన్ని ఎక్కడ దాస్తున్నారో కనిపెట్టి దాన్ని దొంగిలించడానికి వాళ్లు నిద్ర పోకుండా కనిపించారు. కానీ, రణధీర సభ్యులు వీళ్ల ప్రయత్నాలను తిప్పి కొట్టారు. ఇదంతా ఎంతో ఆసక్తికరంగానే సాగిపోయింది.
సందీప్‌కే షాకిచ్చిన శుభశ్రీ:రణధీర టీమ్ దగ్గర ఉన్న తాళం దొంగిలించడానికి ప్రయత్నించి ఫెయిల్ అయిన మహాబలి టీమ్ సభ్యులు ఢీలా పడిపోయారు. అప్పుడే శుభశ్రీ రాయగురు.. సందీప్ మాస్టర్ సాధించిన పవర్ అస్త్రాన్ని కాజేయాలని ప్లాన్ చేసింది. అనుకున్నట్లుగానే పలువురి సహాయం తీసుకుని అతడి బెడ్ దగ్గర ఉన్న దాన్ని దొంగలించింది. దాన్ని కొన్ని ప్రదేశాల్లో దాచేసి షాక్ ఇచ్చేసింది.
బిగ్ బాస్ హింట్ ఇచ్చాడు:సందీప్ పవర్ అస్త్రాన్ని శుభశ్రీ దొంగలించిన తర్వాత బిగ్ బాస్ తొలిసారిగా అతడికి ఓ హింట్ ఇచ్చాడు. ఈ మేరకు గంభీరమైన గొంతుతో 'కంటెస్టెంట్లు అందరికీ ఒక చిన్న చమక్కు. సప్త సముద్రాలు ఈదిన వీరుడైనా ఆదమరిస్తే.. పిల్ల కాలువలో మునగాల్సిందే. ఆ వీరుడు ఎవరు? ముంచింది ఎవరు? మునిగింది ఏంటి? చెప్పుకోండి చూద్దాం' అంటూ ఒక చమక్కును వదిలాడు.
శుభశ్రీకి చెప్పేసిన గౌతమ్:బిగ్ బాస్ ఆ చమక్కును వదలగానే గౌతమ్, శుభశ్రీని తీసుకు వెళ్లి 'నువ్వు సందీప్ మాస్టర్ పవర్ అస్త్రాన్ని కొట్టేశావు కదా. దాని గురించే హింట్ ఇచ్చాడు' అని చెప్పాడు. దీంతో ఆమె తెగ నవ్వేసుకుంది. ఆ తర్వాత మహాబలి టీమ్ సభ్యులందరూ తమలో తాము నవ్వుకున్నారు. కానీ, రణధీర టీమ్ సభ్యులతో పాటు సందీప్ మాస్టర్ కూడా ఏం జరిగిందా అని ఆలోచనలో పడ్డారు.
సందీప్‌ను డైవర్ట్ చేసేలా:బిగ్ బాస్ చమక్కు గురించి అందరూ ఆలోచిస్తుండగా.. రతికా రోజ్.. సందీప్ మాస్టర్ దగ్గరకు వెళ్లి అతడిని డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే 'బిగ్ బాస్ మమ్మల్ని రణధీర టీమ్ దగ్గర ఉన్న తాళాలను కొట్టేయాలని ఇండైరెక్టుగా చెప్పాడు' అంటూ అతడి మనసును మళ్లించింది. మొత్తానికి బెడ్‌రూంలో శుభశ్రీ చేసిన పనికి బిగ్ బాసే హింట్ ఇవ్వాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications











