Naga Panchami 20th February: తోడేళ్ల దాడి నుంచి పంచమి సేఫ్.. సుబ్రహ్మణ్య స్వామి శక్తి అదుర్స్!
Naga Panchami: నాగపంచమి సీరియల్ రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో ఈ సీరియల్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అద్భుతమైన ట్విస్ట్ లు ఇస్తూ సీరియల్ ను అద్భుతంగా మలుస్తున్నారు. అయితే తాజా ఎపిసోడ్ లో పంచమి కరాళీకి వార్నింగ్ ఇచ్చి ఇంటికి వచ్చేందుకు పయనం అవుతుంది. ముఖ్యంగా అడవి మధ్యలో ఈమె ఉండగా... కరాళీ పంచమిపైకి తోడేళ్లను వదులుతుంది. తన మంత్రశక్తులతో వాటిని వదలగా... పంచమి భయంతో వణికిపోతుంది.
వాటి నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. అడవిలో ఎటు పడితే అటు పరుగులు పెట్టగా... అవి కూడా పంచమిపైకి పరుగున వచ్చాయి. ఎలాగైనా సరే కొరిక్కు తినాలని చూస్తున్న తోడేళ్లను చూసిన పంచమి గజగజా వణికిపోతుంది. ఓ చోట పడిపోగానే అన్నీ తోడేళ్లు చుట్టు ముడతాయి. ఇక తన పని అయిపోయిందని భావించిన పంచమి... తన ఇష్టదైవం అయిన సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకుంటుంది. దీంతో సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉండే ఆయుధం వస్తుంది.

పంచమి పడిపోయిన చోట ఉండి... రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది. ఈక్రమంలోనే తోడేళ్ల పంచమిపైకి దూకబోగా... రక్షణ వలయానికి తాకి చనిపోతాయి. అయితే పంచమి భయంతో అప్పటికే కళ్లు తరిగి పడిపోతుంది. ఆ తర్వాత పంచమిని సేఫ్ చేసిన సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం అక్కడే తిరుగుతుంది. ఇక పూర్తిగా ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.
ఇక నిన్నటి ఎపిసోడ్ లో... ముందుగా పంచమి కరాళీ ఆశ్రమానికి వెళ్తుంది. అక్కడే ఇక్కడికి వచ్చి నాతో పోరాడు కరాళీ.. నీ శక్తి ఏంటో నేనూ చూస్తాను అంటూ ఫైర్ అవుతుంది. అప్పటికే అంజరం వేసుకుని తన శక్తులు చూస్తున్న కరాళీ.. తన మంత్రశక్తితో గరుడను పంచమిపైకి పంపుతుంది. అది ఆశ్రమానికి వెళ్లి బయట కాపు కాయగా.. పంచమి లోపలి నుంచి బయటకు రాగానే దాడి చేస్తుంది. దాన్నుంచి పంచమి తప్పించుకునేందుకు చాలానే ప్రయత్నాలు చేస్తుంది. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వాహనం అయిన నెమలి వస్తుంది.

ఇక ఆ తర్వాత నెమలి, గరుడల మధ్య ఘోరమైన ఫైట్ జరుగుతుంది. రెండు విపరీతంగా పోటీ పడగా... చివరకు దుష్టశక్తి అయిన గరుడను నెమలి చంపేస్తుంది. అలా గరుడ కింద పడిపోగా.. నెమలి వెళ్లిపోతుంది. ఇక ఆ తర్వాత పంచమి... కరాళీని వెతుక్కుంటూ వెళ్తుంది. అడవిలో ఉన్న ఆలయానికి వెళ్లి కరాళీకి వార్నింగ్ ఇస్తుంది. మోక్ష జోలికి వస్తే ప్రాణాలు తీస్తానని హెచ్చరిస్తుంది. ఇద్దరి మధ్యా మాటామాటా పెరుగగా.. వార్నింగ్ ఇచ్చి బయటకు వచ్చేస్తుంది పంచమి.
అలా బయటకు వచ్చిన పంచమిపైకి మరోసారి తన మంత్రశక్తితో తోడేళ్లను దాడికి పంపుతుంది. అదంతా గమనించిన పంచమి ముందుగా బయటకు రాగా వాటిని చూసి భయపడుతుంది. ఆ తర్వాత జరిగిన కథ అంతా మనకు తెలిసిందే.


Click it and Unblock the Notifications











