Bigg Boss Telugu 6: షోలోకి ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టు.. ఇప్పుడెలా మారిపోయిందో చూస్తే!

తెలుగు బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ.. దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. హిందీలో చాలా ఏళ్ల క్రితమే ప్రారంభం అయిన ఈ షో.. తెలుగులోకి మాత్రం ఆరేళ్ల క్రితమే పరిచయం అయింది. అస్సలు పరిచయం లేని కంటెంట్‌తో వచ్చే ఈ కార్యక్రమానికి తెలుగు ప్రేక్షకులు భారీ రెస్పాన్స్‌ను అందించారు. ఫలితంగా ఇది ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరోది కూడా ప్రారంభం అయిపోయింది. ఇక, ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు కూడా ఇందులోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సీజన్‌లోకి ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టు సుదీప పింకీ రెండో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె వివరాలు తెలుసుకోండి!

మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌తో

మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌తో

ఆదివారం (సెప్టెంబర్ 4) నుంచి ప్రారంభం కాబోతున్న ఆరో సీజన్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఇందులో గతంలో వాటికంటే ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండబోతుందని నిర్వహకులు ముందే వెల్లడించారు. అంతేకాదు, షో జరిగే తీరులో కూడా చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్‌ను కూడా మరింత సుందరంగా తీర్చిదిద్దారు.

ఆరో సీజన్ మరింత వైభవంగా

ఆరో సీజన్ మరింత వైభవంగా

బిగ్ బాస్ ప్రియులను ఉర్రూతలూగించేందుకు ఆరో సీజన్ ఎన్నో అంచనాల నడుమ ఆదివారం ప్రారంభించారు. దీనికి సీనియర్ హీరో అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు. కంటెస్టెంట్ల ఆటపాటలతో ఈరోజు ఎపిసోడ్ అంగరంగ వైభవంగా సాగుతోంది. ఇప్పటికే ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఈమె తర్వాత మరికొందరు రాబోతున్నారు.

వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చి

వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చి

బిగ్ బాస్ షో అంటే ఎంత సక్సెస్‌ఫుల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు అనుగుణంగానే ఈ సారి ప్రసారం అవుతున్న సీజన్ కోసం నిర్వహకులు ఫేమస్ అయిన కంటెస్టెంట్లనే ఎంపిక చేసుకున్నారు. బుల్లితెరపై సందడి చేసే నటీనటులు, యాంకర్లతో పాటు సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారికి పెద్దపీట వేశారు. ఇందులో లేడీస్ ఎక్కువగా ఉన్నారు.

రెండవ కంటెస్టెంట్‌గా సుదీప

ఎన్నో అంచనాలను ఏర్పరచుకున్న బిగ్ బాస్ ఆరో సీజన్ తాజాగా ప్రారంభం అయింది. ఇందులోకి మొదటి కంటెస్టెంట్‌గా కీర్తి భట్ ఎంట్రీ ఇచ్చారు. ఆమె తర్వాత రెండో కంటెస్టెంట్‌గా ఒకప్పటి లేడీ చైల్డ్ ఆర్టిస్టు సుదీప అలియాస్ పింకీ ఎంట్రీ ఇచ్చారు. ముందుగా తన కుటుంబ నేపథ్యాన్ని వివరిస్తూ ఆమె వీడియో బైట్ ఇచ్చారు. తనకు భర్త సపోర్ట్ ఎక్కువ అని చెప్పారు.

సుదీప పింకీ నేపథ్యం ఇదేనా

సుదీప పింకీ నేపథ్యం ఇదేనా


చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్‌ను ఆరంభించిన సుదీప.. ఎన్నో సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసింది. ఈ క్రమంలోను 'నువ్వు నాకు నచ్చావ్' మూవీలో పింకీగా యమా ఫేమస్ అయింది. ఆ తర్వాత బుల్లితెరపైన కూడా సందడి చేసిన ఆమె.. పలు సీరియళ్లలో నటించారు. చాలా కాలంగా ప్రేక్షకులకు దూరంగా ఉంటోంది. ఇప్పుడు ఆరో సీజన్ ద్వారా ఆమె రీఎంట్రీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X