Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి లేడీ చైల్డ్ ఆర్టిస్ట్.. చాలా గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు!
ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగు బుల్లితెరపైకి వచ్చినా.. సరికొత్త కంటెంట్, అదిరిపోయే టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య గొడవలు, లవ్ ట్రాకులు ఇలా ఎన్నో రకాల చిత్ర విచిత్రమైన పరిణామాలతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది బిగ్ బాస్. రియాలిటీ ఆధారంగా నడిచే ఈ కార్యక్రమానికి తెలుగు ఆడియెన్స్ భారీ రెస్పాన్స్ అందించారు. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను ప్రసారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ నుంచి ఆరో దాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల వివరాలు ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ షోలో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టు రాబోతున్నట్లు తెలిసింది. ఆ వివరాలు మీకోసం!

దేశంలోనే టాప్.. ఆరోది రెడీగానే
బిగ్ బాస్ ఇండియాలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్న విషయం తెలిసిందే. కానీ, తెలుగులో మాత్రమే దీనికి అత్యధిక రేటింగ్ దక్కుతోంది. ఫలితంగా ఈ సీజన్ దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. దీంతో నిర్వహకులు ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేశారు. ఇక, ఇప్పుడు సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ఆరో దానిని కూడా మొదలు పెట్టబోతున్నారు.

వరుస ప్రోమోలు... కలర్‌ఫుల్‌గా
భారీ అంచనాల నడుమ రాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ సీజన్‌కు సంబంధించిన లోగో ప్రోమోను విడుదల చేశారు. అలాగే, రెండు రోజుల క్రితమే సీజన్ మెయిన్ ప్రోమోను వదిలారు. వీటికి భారీ స్పందన కూడా దక్కింది. ఇక, ఈ సీజన్ ఎంతో కలర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు ప్రోమోలో చూపించారు.

ఆరో సీజన్ పనులు ఎలాగంటే
సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్ పనులు దాదాపుగా పూర్తైనట్లు బుల్లితెర వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే షోను నడిపించే హౌస్ సెట్ వర్కును ఇటీవలే నిర్వహకులు పూర్తి చేశారట. దీన్ని గతంలో ఎన్నడూ లేనంత అందంగా చూపించబోతున్నారట. అలాగే, ఈ సీజన్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కూడా పూర్తైనట్లు టాక్.

కంటెస్టెంట్ల లిస్ట్ కూడా ఫైనల్
అత్యంత వైభవంగా మొదలు కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్ కోసం నిర్వహకులు ఎప్పుడో గ్రౌండ్ వర్క్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగానే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియలో ఒక రౌండ్‌ను కూడా పూర్తి చేసి షార్ట్ లిస్టును బిగ్ బాస్ టీమ్ రెడీ చేసింది. ఇప్పుడు వాళ్లతో రెమ్యూనరేషన్ డీల్స్ చేసుకుంటున్నారు. అంతేకాదు, ఈ సీజన్ కోసం ఇద్దరు కామనర్స్‌ను కూడా దింపుతున్నారట.

జాగ్రత్తలు తీసుకున్న లీకులే
ఎన్నో అంచనాల నడుమ స్టార్ట్ అయ్యే బిగ్ బాస్ ఆరో సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్ గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు సెలెబ్రిటీల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే, ఇందులో ఎవరు పాల్గొంటారన్న దానిపై క్లారిటీ రావట్లేదు. దీనికి కారణం ఈ సారి నిర్వహకులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. అయినా కొన్ని పేర్లు బయటకు వస్తూనే ఉన్నాయి.

బిగ్ బాస్ షోలోకి పింకీ ఎంట్రీ
గతంలో కంటే ఎంతో కలర్‌ఫుల్‌గా రాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఫలానా సెలెబ్రిటీ పాల్గొనే అవకాశం ఉన్నట్లు ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంతో మంది పేర్లు బయటకు వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆరో సీజన్‌లో ఒకప్పటి లేడీ చైల్డ్ ఆర్టిస్టు సుదీప అలియాస్ పింకీ పాల్గొనబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది.
Recommended Video


చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీ
చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్‌ను ఆరంభించిన సుదీప.. ఎన్నో సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసింది. ఈ క్రమంలోను ‘నువ్వు నాకు నచ్చావ్' మూవీలో పింకీగా యమా ఫేమస్ అయింది. ఆ తర్వాత బుల్లితెరపైన కూడా సందడి చేసిన ఆమె.. చాలా కాలంగా ప్రేక్షకులకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఆరో సీజన్ ద్వారా ఆమె రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications











