9 ఏళ్ల క్రితం అభిజిత్ ఇలా ఉన్నాడా.. పక్కనే మరో యంగ్ హీరో.. కులం, మతం అంటూ ఎమోషనల్ పోస్ట్!

నేడు ఫ్రెండ్షిప్ డే కావడంతో సినిమా సెలబ్రేటీలు వారి స్నేహితుల ఫొటోలు పోస్ట్ చేస్తూ స్పెషల్ గా విష్ చేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిట్ ఫొటో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది. ఎక్కువగా ప్రైవసీ లైఫ్ ను గడిపే అభిజిత్ చాలా తక్కువమంది స్నేహితులతో క్లోజ్ గా ఉంటాడు. ఇక రీసెంట్ గా ఒక యువ నటుడు అభిజిత్ తో ఉన్న అనుబంధం గురించి చాల ఎమోషనల్ గా పోస్ట్ చేశాడు.

కూల్ గా సైలెంట్ గా

కూల్ గా సైలెంట్ గా

బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ట్ అయ్యే ముందు వరకు అభిజిత్ ఓ వర్గం వారికి తప్పితే మిగతా నార్మల్ ఆడియెన్స్ కు పెద్దగా తెలియదు. నిజానికి బిగ్ బాస్ లో అభిజిత్ చివర వరకు ఉంటాడని ఎవరు ఊహించలేదు. కూల్ గా సైలెంట్ గా కాంట్రవర్సీ చేయకుండా ఉంటే చివరి వరకు నిలవడం కష్టమని కూడా అనుకున్నారు. కానీ అదే అతనికి బాగా కలిసొచ్చింది. అంత కూల్ గా ఉండడమే జనాలకు కనెక్ట్ అయ్యేలా చేసింది.

ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా

ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా

అభీజిత్ లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపేట్టిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఎలాంటి సినిమా చేసినా కూడా అతనికి అంతగా కలిసి రాలేదు. ఆ రేంజ్ లో డిజాస్టర్స్ వస్తాయని కూడా ఎవరు ఊహించలేదు. అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా మళ్ళీ బిగ్ బాస్ షో ద్వారా ఫామ్ లోకి వచ్చేశాడు.

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు. కేవలం ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రమే సినిమాలోని సన్నివేశాలు బాగా కనెక్ట్ అయ్యాయి. అంతే కాకుండా అందులో హీరో హీరోయిన్స్ కు కూడా మాంచి క్రేజ్ దక్కింది. సాంగ్స్ ఇప్పటికి కుడా ట్రెండ్ అవుతుంటాయి.

అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు

అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు

ఇక సినిమాలో మెయిన్ లీడ్ లో నటించిన అభీజిత్, సుధాకర్, కౌశిక్ దర్బా మంచి గుర్తింపు అందుకున్నారు కానీ అనుకున్నంత రేంజ్ లో హీరోలుగా సక్సెస్ అవ్వలేదు. ఇక ఆ సినిమాలో నెగిటివ్ రోల్స్ లో కనిపించిన విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి మాత్రం స్టార్స్ గా క్లిక్కయ్యారు. అయినప్పటికీ వారి స్నేహంలో ఎలాంటి తేడా రాలేదు.

సుధాకర్ ఎమోషనల్ పోస్ట్

సుధాకర్ ఎమోషనల్ పోస్ట్

ఇక రీసెంట్ గా సుధాకర్ ఒక ఫొటోను పోస్ట్ చేశాడు.అందరికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు! కుల, మత, సరిహద్దులు మొదలైన వాటితో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకునే ఏకైక రోజు ఇదే .. నాకు వేల మంది స్నేహితులు ఉన్నారు. ఇక లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా ద్వారా వచ్చిన స్నేహానికి గుర్తుగా ఈ ఫొటో షేర్ చేస్తున్నట్లు.. వివరణ ఇచ్చారు.

సినిమాల విషయానికి వస్తే..

సినిమాల విషయానికి వస్తే..

8 ఏళ్ళ క్రితం దిగిన ఈ ఫొటోను ఇంకా అలానే దాచుకున్నాడు అంటే వారి మధ్య స్నేహం ఎలా ఉందో అర్థం చెలుకోవచ్చు. ఇక సినిమాల విషయానికి వస్తే.. కౌశిక్ లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా తరువాత మళ్ళీ కనిపించలేదు. అభిజిత్ మాత్రం కొన్ని కథలపై చర్చలు జరుపుతున్నాడు. మరోవైపు సుధాకర్ కూడా కేవలం లీడ్ రోల్స్ అని కాకుండా క్రాక్ లాంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X