రష్మీ గౌతమ్‌ను ఆటాడుకొన్న యువ హీరో.. యాంకరమ్మను అంత మాట అనేశాడేంటి?
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు తాజాగా యాంకర్ రష్మీపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఈ మ్యాటర్ తెలిసిన వాళ్ళంతా ఏంటి సుధీర్ అంత మాట అనేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి సుధీర్ బాబు రష్మీ పై ఎలాంటి సెటైర్ వేశారు అనే విషయంపై ఓ లుక్కేద్దాం.
గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు. ఈసారి హరోమ్ హర మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

సుధీర్ బాబు తాజాగా హరోమ్ హర మూవీ ప్రమోషన్లలో భాగంగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొన్నారు. గెస్ట్ గా హాజరైన సుధీర్ బాబును రష్మీ వేదికపైకి ఆహ్వానించింది. ఆ తర్వాత ఓ చిన్న పాప సుధీర్ బాబుని చూసి దయ్యం ఎక్కడ అని ప్రశ్నించింది.
గతంలో సుధీర్ బాబు నటించిన ప్రేమ కథా చిత్రం మూవీని గుర్తు చేస్తూ ఆ పాప ఈ విషయాన్ని అడిగింది. వెంటనే సుధీర్ బాబు పర్ఫెక్ట్ టైమింగ్ తో సమాధానం చెప్పాడు. ఒక దయ్యం ఇక్కడ ఉంటే మరో దయ్యం రాదమ్మా అంటూ కామెంట్ చేశాడు.
వెంటనే రష్మీ ఎక్కడో నేను బుక్ అయ్యాను అనిపిస్తోంది అంటూ అనుమానం వ్యక్తం చేసింది. నేనేం అనలేదు మీరే ఫీల్ అయ్యారు అంటూ సుధీర్ బాబు పంచ్ వేశాడు. దీంతో ఎప్పటిలాగే రష్మీ పంచ్ వేయించుకున్న ఎక్స్ప్రెషన్ పెట్టి అందరినీ నవ్వించింది.
ఇదంతా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోని తాజా ఎపిసోడ్ లో జరిగింది. అయితే ఇంకా తాజా ఎపిసోడ్ రిలీజ్ కాలేదు. కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ చేయగా, అందులో ఈ ఫన్నీ సన్నివేశాలను చూపించారు. ఈ లేటెస్ట్ ఎపిసోడ్ జూన్ 2న ఆదివారం రోజు ప్రసారం కాబోతోంది.

జ్ఞాన సాగర్ ద్వారకా దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ హరోమ్ హర. ముందుగా ఈ మూవీని మే 31న రిలీజ్ చేయాలని భావించారు చిత్ర బృందం. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడి జూన్ 14న రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్న ఈ మూవీలో మాళవిక శర్మ కథానాయకగా నటిస్తోంది. హరోమ్ హర 1989లో చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్ కాగా, చేతన్ భరద్వాజ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











