శ్రీముఖి నడుము మీద సుధీర్ కామెంట్.. అలా ఉందని అనడంతో అంతా షాక్
పండుగలు వచ్చాయంటే ఆ సందడి బుల్లితెరపై కనిపించాల్సిందే. ప్రతీ పండుగకు స్పెషల్ ఈవెంట్లు చేయడం ఆనవాయితీగా వస్తోన్న సంగతే. అలా ఈ హోలీ పండుగ సందర్భంగా ఈటీవీలో అదిరిపోయే ఈవెంట్ రాబోతోంది. ఇప్పటికే వదిలిన ప్రోమోలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అసలు సిసలు ప్రోమోను వదిలారు. ఇందులో నితిన్, శ్రీముఖి, అన్నపూర్ణ, సుధీర్, వర్ష, రోహిణి ఇలా అందరూ కలిసి దుమ్ములేపేశారు.

రంగ్ దే ప్రమోషన్స్..
నితిన్ ప్రస్తుతం రంగ్ దే ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. నేడు విడుదలైన ఈ మూవీకి డివైడ్ టాక్ వచ్చింది. అయినా కూడా సినిమాను ఇంకాస్త ప్రమోట్ చేసుకుని వీకెండ్, హోలీ పండుగల ద్వారా గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే బుల్లితెరపై నితిన్ సందడి చేసేందుకు వచ్చాడు.

రంగు పడుద్ది..
శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్ట్‌లందరూ కలిసి రంగు పడుద్ది అనే స్పెషల్ ఈవెంట్‌ను హోలి నాడు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఇందులో సుధీర్ యాంకర్‌గా వ్యవహరించాడు. శ్రీముఖి, అన్నపూర్ణ, రోహిణి, రాం ప్రసాద్, వర్ష, భాను అందరూ రచ్చ రచ్చ చేశారు.

హోలి వేడుకలు..
హెలీ సందర్భంగా చేస్తోన్న ఈవెంట్ కావడంతో అందరూ రచ్చ రచ్చ చేశారు. ఉట్టి కొట్టడం, రంగులద్దుకోవడం, అదిరిపోయే డ్యాన్స్ పర్ఫామెన్స్‌లతో అందరూ దుమ్ములేపేశారు. అయితే నితిన్ ఎంట్రీని గ్రాండ్ లెవెల్‌లో ప్లాన్ చేసినట్టున్నారు.

డ్యాన్సులతో వెల్కమ్..
నితిన్ ఫేమస్ పాటలకు అందరూ స్టెప్పులేశారు. నీ చేతి గాజులు ఘల్లుమన్నవే అంటూ శ్రీముఖితో నితిన్ డ్యాన్స్ చేశాడు. ఇక అందులో పిట్ట నడము అని రావడం, దాన్ని సుధీర్ పాయింట్ అవుట్ చేయడం హైలెట్‌గా నిలిచింది. పిట్టనడుము అనుకుంటూ రింగ్ రోడ్‌ను చూపించారు అంటూ శ్రీముఖి మీద సెటైర్ వేసేశాడు సుధీర్. దీంతో అందరూ పగలబడి నవ్వేశారు.

జిత్తు మాస్టర్..
ఇక ఇదే ఈవెంట్‌లో జిత్తు మాస్టర్ డ్యాన్స్ పర్ఫామెన్స్ చూసి కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. స్టేజ్ మీదే ఎమోషనల్ అయిన నితిన్.. తన తదుపరి చిత్రంలో ఓ సాంగ్ కంపోజ్ చేసేందుకు చాన్స్ ఇస్తానని మాటిచ్చాడు.


Click it and Unblock the Notifications











