మొన్న ఎంగేజ్మెంట్.. ఇప్పుడు 'స్టార్ మా'లో రష్మీతో కలిసి ప్రత్యక్షం అయిన సుధీర్!
గత కొద్దికాలం నుంచి సుధీర్ రష్మీ జంటగా కనిపించడం లేదు. వీరిద్దరికీ ఓ విభేదాలు వచ్చాయని అందుకే వీరిద్దరూ కలిసి షోలలో పాల్గొనలేదని ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతూ వచ్చాయి. అయితే అనూహ్యంగా మొన్నామధ్య సుడిగాలి సుదీర్ షో కోసం ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఇంకేముంది రష్మీకి సుధీర్ కి మధ్య చాలా దూరం వచ్చేసింది అని ప్రచారం జరగగా ఎట్టకేలకు ఒక ప్రోమోతో ఈ పుకార్లకి బ్రేకులు వేశారు. ఆ వివరాల్లోకి వెళితే...

టీమ్ లీడర్‌గా
మెజీషియన్‌గా కెరీర్‌ను ఆరంభించిన సుధీర్.. ఎన్నో చానెళ్లలో స్పెషల్ షో లు చేస్తూ బుల్లితెరపై సందడి చేశారు. ఇలాంటి సమయంలో జబర్దస్త్ కమెడియన్ల దృష్టిలో పడటంతో అందులో ఆర్టిస్టుగా అడుగు పెట్టారు. అలా పరిచయం అయిన చాలా తక్కువ సమయంలో తన టాలెంట్ నిరూపించుకున్నాడు. దీంతో షో నిర్వహకులు అతడికి టీమ్ లీడర్‌గా ప్రమోషన్ కూడా కల్పించారు.

లవర్సే అని
అయితే చాలా తక్కువ టైంలోనే ఉన్నత స్థాయికి ఎదిగిన సుడిగాలి సుధీర్ భారీ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అదే సమయంలో యాంకర్ రష్మీ గౌతమ్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నాడన్న పుకార్లతో ఓ రేంజ్‌లో పాపులర్ అయ్యాడు. చాలా కాలంగా ఆమెతో ఎదో ఉందని అనిపించే విధంగా అందరూ మాట్లాడుతూ ఉండడంతో ఇప్పటి వరకూ వీళ్లిద్దరూ లవర్సే అని అంతా అనుకుంటున్నారు.

అగ్రిమెంట్ రద్దు
అయితే ఈ ఇద్దరూ బుల్లితెర పాపులర్ జంటగా మారారు. అయితే సుధీర్-రష్మీ ఇప్పటివరకు ఈ టీవీ ఛానెల్స్ లో మాత్రమే కనిపించేవారు. 'జబర్దస్త్', 'ఢీ' షోలతో జ్ణానాన్ని ఆకట్టుకునెడివారు. అయితే కొంతకాలంగా వీరు ఈ షో లో కనిపించడం లేదు. వీరిద్దరి మధ్య విభేదాలు కారణం అని అనుకున్నారు కానీ అసలు విషయం లేటుగా వెలుగులోకి వచ్చింది. అదేమంటే వీరిద్దరూ మల్లెమాల అగ్రిమెంట్ రద్దు చేసుకొని మరో పాపులర్ ఛానల్ స్టార్ మాలో ఎంట్రీ ఇచ్చారు.,

హోలీ సెలబ్రేషన్స్
అలా కొత్త ఛానల్ లో అడుగుపెట్టిన ఈ జంట కలిసి ఇప్పుడు హోలీ సెలబ్రేషన్స్ ను మొదలు పెట్టారు. హోలీ సందర్భంగా స్టార్ మా ఛానల్ లో ఓ స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేశారు. దీనికి సుధీర్-రష్మీ హోస్ట్ లుగా వ్యవహరించారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. తెలుగు సీరియల్స్ లో పాపులర్ అయిన కొందరు నటీనటులు ఈ ప్రోగ్రామ్ లో కనిపించనున్నారు. కమెడియన్ అవినాష్.. 'అన్నా మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ..' అంటూ డైలాగ్ చెప్పగానే సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు.

కొత్త ప్రయాణానికి
ఆ తర్వాత సుధీర్ రష్మీ కోసం ఓ పాట పాడేశాడు. దానికి ఇంప్రెస్ అయిన రష్మీ.. 'నీకు.. నీ ఫ్యూచర్ కి ఎప్పుడు దిష్టి తగలకుండా' అంటూ అతనికి దిష్టి చుక్క పెట్టింది. ఇక యాంకర్ రవి.. తన కూతురు వియాతో కలిసి ఓ సాంగ్ కి డాన్స్ పర్ఫార్మ్ చేశారు. మొత్తం మీద ఈ ఇద్దరి కొత్త ప్రయాణానికి సంబంధించిన ఈ ప్రోమో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











