సీటు కాదు కదా.. అసెంబ్లీ గేటు కూడా తాకలేవు .. కామెంట్స్‌తో హీటెక్కించిన సుడిగాలి సుధీర్!
సుడిగాలి సుధీర్ వచ్చాక సర్కార్ షో రేటింగ్ లో టాప్ లో ఉంది అంటే అతిశయోక్తి కాదు. యాంకర్ ప్రదీప్ కన్నా ఎక్కువగా సుధీర్ ఈ షోను తనదైన కామెడీతో టాప్ లో ఉంచాడు. ఇప్పటికే 10 ఎపిసోడ్స్ ను విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ షో.. తాజగా 11 వ ఎపిసోడ్ లో అడుగుపెట్టింది. మరి ఈ 11 వ ఎపిసోడ్ లో సుధీర్ ను ఆడుకున్నది ఎవరు.. ? వచ్చిన ముద్దుగుమ్మలు ఎవరు.. ? అనేది తెలుసుకుందాం.
సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సర్కార్ సీజన్ 4 కు ఈసారి అందాల ముద్దుగుమ్మ అనసూయ, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ మాస్టర్, సింగర్ మనో, సింగర్ గీతామాధురి పాల్గొన్నారు. సుడిగాలి సుధీర్, అనసూయ కలిస్తే ఆ రచ్చ ఉంటుందో జబర్దస్త్ చూసిన వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుధీర్ పంచ్ లు వేస్తే .. అనసూయ కౌంటర్లు వేయడంలో ముందు ఉంటుంది. ఇక బాబా భాస్కర్ మాస్టర్ అల్లరి నెక్స్ట్ లెవెల్.. ఇంకోపక్క జబర్దస్త్ జడ్జిగా మారక మనో కూడా పంచ్ లతో అదరకొడుతున్నాడు. ఇలా వీరి ముగ్గురు మాటల గారడకి సుధీర్ అల్లాడిపోయాడు.

యాంకర్ అనసూయ పొట్టి డ్రెస్ వేసుకొని సూయ సూయ అనసూయ అనే పాటతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆమె అందానికి ముగ్ధుడైన సుధీర్.. ఏంటండీ.. ఇంత అందంగా రెడీ అయి వచ్చారు అని పులిహోర కలపడానికి రెడీ అవ్వగా వెంటనే అనసూయ... యాంకర్ నువ్వని తెలియక అంటూ పంచ్ వేసింది. దీనికి సుధీర్ షాక్ లో చూస్తూ ఉండగానే కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ వచ్చాడు. ప్రదీప్ ఎక్కడ.. ప్రదీప్ కావాలి అని గోలపెట్టాడు. అంతలోనే కొరియోగ్రాఫర్లందరూ నంబర్లు లెక్కపెడుతూ 8 దగ్గరే ఎందుకు ఆపేస్తారు అని సుధీర్ అడిగితే.. మనిషి అన్నాక ఎక్కడో ఓ చోట ఆపాలి.. నీలా కాదు అంటూ భాస్కర్ పంచ్ వేశాడు.
ఇక మూడో కంటెస్టెంట్ గా సింగర్ మనో ఎంట్రీ ఇచ్చాడు. ఆయన కూడా సుధీర్ కు పంచ్ లు విసురుతూనే ఉన్నాడు. నీ ఒళ్లంతా కసేరా అంటూ ఒక ఆట ఆడుకున్నాడు. చివర్లో గీతా మాధురితో కూడా పులిహోర కలపడానికి ప్రయత్నించగా బాబా భాస్కర్ అడ్డుపడి నవ్వులు పూయించాడు. ఎంట్రీలతో మాత్రమే నవ్వులు పూయించిన సుధీర్.. ఇక గేమ్ లో పాలిటిక్స్ గురించి ప్రశ్నలు అడిగి సీరియస్ నెస్ పెంచాడు.

పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రశ్న అంటూ .. హీట్ పెంచాడు. సీటు కాదు కదా.. అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అనే డైలాగు చెప్తూ.. అసెంబ్లీకి సంబంధించిన ప్రశ్న అడిగినట్లు ప్రోమోలో చూపించాడు. ఇక అందరి ముఖాల్లో ఒక టెన్షన్ కనిపించడం ప్రోమో ముగిసింది. ప్రస్తుతం ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటి వరకూ వచ్చిన పది ఎపిసోడ్లలాగే ఈ కొత్త ఎపిసోడ్ కూడా చాలా ఎంటర్టైనింగా ఉండబోతోందని తాజా ప్రోమో చూస్తే స్పష్టమవుతోంది.
ఇకపోతే సుధీర్ ఒకపక్క షోస్ చేస్తూనే ఇంకోపక్క హీరోగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం సుధీర్ హీరోగా గోట్ అనే సినిమా తెరకెక్కతోంది. ఇప్పటికే గాలోడు సినిమాతో హిట్ అందుకున్న సుధీర్.. త్వరలోనే గోట్ సినిమాతో రాబోతున్నాడు. మరి ఈ సినిమాతో సుధీర్ హీరోగా మరో హిట్ ను అందుకుంటాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











