అలాంటి సెటిల్‌మెంట్స్ చేస్తోన్న సుధీర్.. అర్ధరాత్రి వెళ్లి మరీ వసూల్ చేస్తాడట!!
బుల్లితెరపై జబర్దస్త్ ఓ సంచలనం. కంటెంట్‌లోనూ, క్వాలిటీలోనూ జబర్దస్త్ ప్రత్యేకం. ఈ వేదిక నుంచి ఎంతో మంది గొప్ప స్థాయికి ఎదిగారు. ఎందరి జీవితాల్లోనూ జబర్దస్త్ వెలుగులు నింపింది. బుల్లితెర నుంచి వెండితెరపై వెలిగేలా చేసింది. అందులో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది వంటి వారు వెండితెరపై మెరుస్తున్నారు. సుడిగాలి సుధీర్ హీరోగా మారి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. సుడిగాలి సుధీర్ టీమ్ పర్ఫామెన్స్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్, సుధీర్ కలిశారటంటే నవ్వుల ఝల్లు కురవాల్సిందే. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో సుధీర్, గెటప్ శ్రీనుల కామెడీ అదిరిపోయింది.

మొదటి నుంచి..
సుడిగాలి సుధీర్ టీమ్ మొదటి నుంచి ఒకటిగానే ఉంది. ఈ ముగ్గురు కూడా మంచి స్నేహితులు. గెటప్ శ్రీను, రాం ప్రసాద్, సుధీర్ కలిసి చేసే స్కిట్స్ అన్నీ కూడా యూట్యూబ్‌లో వైరల్ అవుతుంటాయి. జబర్దస్త్‌లో వీరు టీమ్ లీడర్స్ అయిన క్షణం నుంచి స్కిట్స్‌ల స్వరూపమే మారిపోయింది.

వెండితెరపైనా..
బుల్లితెరపై ఈ ముగ్గురి కామెడీ టైమింగ్స్‌కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరీ ముఖ్యంగా రాం ప్రసాద్ ఆటో పంచ్‌లు ఫుల్ ఫేమస్. అందుకే ఈ ముగ్గురు కలిసి వెండితెరపైనా నవ్వులు పూయించారు. త్రీ మంకీస్ అంటూ ఈ ముగ్గురు కలిసి చేసిన సినిమా ఓ మోస్తరుగా మెప్పించింది. తాజాగా వీరు వేసిన స్కిట్‌కు సంబంధించిన ప్రోమో బాగానే వైరల్ అవుతోంది.

రౌడీయిజం నేర్పుతారట..
వచ్చే వారం వీరు వేయబోయే స్కిట్‌లో రౌడీయిజం గురించి ఉండబోతోంది. ఇక్కడ రౌడీయిజం నేర్పబడుతుందనే డిఫరెంట్ స్కిట్ వేయబోతోన్నారు. ఇందులో భాగంగా సుధీర్, రాం ప్రసాద్ మధ్య సంభాషణ ఆకట్టుకుంది. మధ్యలో రష్మీ, రోజా, మనో వేసిన పంచ్‌లు బాగా వర్కౌట్ అయ్యాయి.

సెటిల్ మెంట్స్ చేయడంలో...
నువ్ రౌడీలా లేవే అని సుధీర్‌ను రాం ప్రసాద్ ప్రశ్నిస్తాడు. నేను రౌడీలా లేనా? ఈ మధ్యే ఓ సెటిల్ మెంట్ చేశానని చెబుతూ.. ఒకడు రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు వాడు మనదగ్గరికి అని పూర్తి చేసేలోపు.. ఒకరిని మనం లాగేసి సెటిల్ మెంట్ చేశామని కౌంటర్ వేయడంతో అంతా నవ్వేశారు. మధ్యలో రష్మీ ఎంటరై ఒకవేళ నలుగురు చేసుకుని ఉంటే అని అడిగింది. ఈ సారి రోజా ఎంటరై.. ముగ్గుర్ని సుధీర్ ఉంచుకుని ఒకరిని ఇచ్చేస్తాడని సెటైర్ వేసింది.
Recommended Video

అర్దరాత్రి వెళ్లి..
ఇక అనంతరం గెటప్ శ్రీను తనదైన మ్యానరిజంతో రౌడీ గెటప్‌లో ఎంట్రీ ఇస్తాడు. యాభై వేలను ఎలా వసూల్ చేస్తావో చెప్పు అని సుధీర్‌ను అడగడంతో.. యాభై వేలు ఇవ్వలేదనుకో అర్దరాత్రి మీ ఇంటికి వస్తా అని చెప్పడంతో రష్మీ మరో పంచ్ వేసింది. యాభై వేలకే వస్తావా? అని అనడంతో అంతా షాక్ అయ్యారు. ఇలా మొత్తానికి అందరూ కలిసి సుధీర్‌తో బాగా ఆడుకున్నారు.


Click it and Unblock the Notifications











