Sudigali Sudheer: సక్సెస్ కొట్టిన దర్శకుడితో సుధీర్ మూవీ.. ఈసారి ఆ రేంజ్ బడ్జెట్లో మరో ట్విస్ట్!
టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుదీర్ ఇప్పుడు స్టార్ హీరోగా గుర్తింపు అందుకోవడానికి మరింత కష్టపడుతున్నాడు. ఇంతకుముందు అతను రెండు సినిమాలతో పరవాలేదు అనే విధంగా మంచి సక్సెస్ అయితే అందుకున్నాడు.
ఇక కమర్షియల్ గా ఒక సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది. అయితే ఇప్పుడు సుదీర్ నుంచి డీసెంట్ బడ్జెట్లో మరో మూవీ రాబోతోంది. ఆ సినిమాకు ఒక సక్సెస్ అందుకున్న దర్శకుడు తెరపైకి తీసుకు వస్తూ ఉండడం విశేషం. పూర్తి వివరాల్లోకి వెళితే..

మొదటి రైటర్ నుంచి: సుడిగాలి సుధీర్ గురించి టెలివిజన్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. అతను మొదట కొన్ని స్టేజ్ లపై మెజీషియన్ గా తన టాలెంట్ను నిరూపించుకుంటూ ఆ తర్వాత టెలివిజన్ ప్రపంచంలోకి అడుగు పెట్టాడు. ఇక తర్వాత అతను జబర్దస్త్ లోకి వేణు వండర్స్ టీం ద్వారా పరిచయమయ్యాడు. మొదట రైటర్ గా మొదలైన అతని ప్రయాణం ఆ తర్వాత టీం లీడర్ వరకు వెళ్ళింది.

అతని రెమ్యునరేషన్ కూడా: సుడిగాలి సుదీర్ జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు అందుకోవడమే కాకుండా ఆర్థికంగా కూడా నిలదొక్కుకున్నాడు. టీం లీడర్ గా మారిన తర్వాత జబర్దస్త్ లో అతని రెమ్యునరేషన్ కూడా గట్టిగానే పెరిగింది. అలాగే పోవే పోరా వంటి గేమ్ షోలో కూడా మంచి క్రేజ్ అందుకున్నాడు. ఇక ఢీ షో తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ అలాగే ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ లో కూడా సుడిగాలి సుదీర్ హైలెట్ అవుతూ వస్తున్నాడు.

కొన్ని విభేదాలు కారణంగానే: సుడిగాలి సుదీర్ ఇటీవల కాలంలో జబర్దస్త్ కు దూరమైన విషయం తెలిసిందే. అతను కొన్ని విభేదాలు కారణంగానే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసాడు అని అనేక రకాల రూమర్స్ అయితే వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదు అని నటుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపునందుకోవాలి అని అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉండటంతో అతనికి జబర్దస్త్ చేసే టైం దొరకడం లేదట. అందుకే జబర్దస్త్ నుంచి కాస్త దూరం జరిగినట్లుగా అతని సన్నిహితులు చెబుతున్నారు.

మాస్ ఏరియాలో మంచి కలెక్షన్స్: అయితే సుడిగాలి సుధీర్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కాకుండా స్టార్ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. అతను నటించిన సినిమాలకు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ మధ్య సుదీర్ గాలోడు అనే ఒక సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా మాస్ ఏరియాలో మంచి కలెక్షన్స్ అందుకుంది. దాదాపు ఏడు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకోవడంతో సుధీర్ కు చాలా ఆఫర్స్ వచ్చాయి.

పాగల్ దర్శకుడితో కొత్త సినిమా: సుధీర్ తొందరపడకుండా మంచి కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఇక ఈరోజు అతను మరొక కొత్త సినిమాను మొదలు పెట్టాడు. పాగల్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు నరేష్ అతను సినిమా చేయబోతున్నాడు.
అందుకు సంబంధించిన లాంచ్ కార్యక్రమాలు కూడా ఈరోజు హైదరాబాదులో జరిగాయి. ఇక ఈ సినిమాకి కూడా నిర్మాతలు గట్టిగానే బడ్జెట్ కేటాయించినట్లుగా తెలుస్తోంది. దాదాపు ఆరు కోట్లతో మాస్ లవ్ స్టోరీ గా ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాతో సుధీర్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











