అందుకే సుధీర్ గొప్పోడు.. ఈ మాటలు విన్నాక కచ్చితంగా ఫ్యాన్ అవ్వాల్సిందే!!
సుడిగాలి సుధీర్ బుల్లితెరపై ఎంతటి ఫాలోయింగ్, క్రేజ్ సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే. ఎక్కడో బయట స్టేజ్‌ల మీద మ్యాజిక్ షోలు చేసుకునే సుధీర్.. వెండితెరపై హీరోగా ఎదిగి ఓ స్టార్ స్టేటస్‌ను సంపాదించుకున్నాడు. బుల్లితెరపై జబర్దస్త్‌లో కంటెస్టెంట్‌గా వచ్చి.. టీం లీడర్‌గా ఎదిగి.. హీరోగా మారాడు. సుధీర్ జర్నీ ఎందరికో ఆదర్శం. అందుకు సుధీర్‌ను వ్యక్తిగతంగానూ ఇష్టపడేవారు కోకోల్లలు. అయితే తమ అభిమాన సుధీర్‌ను ఈ మధ్య స్కిట్స్‌లో బాగా కించపరిచినట్టు సెటైర్స్ వేయడంతో ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.

సుధీర్‌ను వాడుతారు..
ప్రతీ ఈవెంట్, స్కిట్‌లో సుధీర్‌నే కార్నర్ చేస్తారు. అతడినే పిచ్చోడిని చేసి సెటైర్స్, పంచ్‌లు వేస్తారు. ఈ మధ్య వాటి డోస్ మరింత ఎక్కువైంది. సుధీర్‌ను ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. రాహుల్ సిప్లిగంజ్ అన్న మాటలైతే ఓ రేంజ్‌లో హల్చల్ అయ్యాయి.

హౌలే, గూట్లే..
వినాయక చవితికి ఈటీవీలో వచ్చిన స్పెషల్ ప్రోగ్రాంలో రాహుల్ సిప్లిగంజ్.. సుధీర్‌పై కౌంటర్స్ వేస్తాడు. అందులో భాగంగా గూట్లే, హౌలే గాడు అని సంబోధిస్తాడు. ఇక ఈ పదాలపై సుధీర్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో రాహుల్‌ను బాగా తిట్టారు.

ఢీ షోలో అలా..
ఇవన్నీ ఒకెత్తు అనుకుంటే ఢీ షోలో సుధీర్‌ను అందరూ కలిసి ఆడుకోవడం, చివరకు పిచ్చోడిని చేయడం కామన్‌గా జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో సుధీర్‌పై ప్రదీప్, హైపర్ ఆది, శేఖర్ మాస్టర్ వంటి వారు కౌంటర్స్ వేస్తుంటారు. అలా చేయడంపై ఫ్యాన్స్ హర్ట్ అవ్వడం, సుధీర్‌ను అదే ప్రశ్నను అడగడంతో అదిరిపోయే సమాధానం చెప్పాడు.

లైవ్‌లో సుధీర్..
తాజాగా సుధీర్ లైవ్‌లోకి వచ్చాడు. ఫ్యాన్స్ అడిగిన రకరకాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. అందులో ఓ ఫ్యాన్.. ఢీ షోలో మిమ్మల్ని అలా కించపరిచనట్టు ఎందుకు మాట్లాడుతుంటారు? అని బాగా ఎమోషన్ అయ్యాడు. ఇక ఆ ఫ్యాన్ అలా అడిగే సరికి అసలు విషయం చెప్పాడు.
Recommended Video

అదే మా లక్ష్యం..
ఒకర్ని తిట్టాలని, కించ పరిచాలని ఎవరికీ ఉండదు. జనాలు నా మీద కౌంటర్స్ వేస్తుంటే నవ్వుతున్నారు.. అదే ఒక వేళ పొడిగితే నవ్వుతారని అనిపిస్తే అలాగే చేయమంటాను. మేం ఏది చేసినా మా లక్ష్యం మిమ్మల్ని నవ్వించడం, ఎంటర్టైన్ చేయడం. దాని కోసం ఏదైనా చేస్తాం అని సుధీర్ ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











