ఆమెకు యాటిట్యూడ్, పొగరు.. రష్మీ అలాంటిది.. నిజ స్వరూపం బయటపెట్టిన సుడిగాలి సుధీర్

సుడిగాలి సుధీర, రష్మీ గౌతమ్‌లు బుల్లితెరపై ఎంతగా క్రేజ్ సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరు గత కొన్నేళ్ల నుంచి ప్రేక్షకులను అలరిస్తూనే వస్తున్నారు. ఈ ఇద్దరికీ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరి మధ్య ఏదో తెలియన బంధం ఉందని భావిస్తుంటారు. అయితే తామిద్దరం ఏది చేసినా అది కేవలం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి మాత్రమేనని చెప్పుకొస్తారు. అంతకు మించి తామిద్దరి మధ్య ఏది లేదని గతంలో ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు. తాజాగా వీరిద్దరు అలీ నిర్వహించే షోలో గెస్ట్‌లు విచ్చేశారు.

 లాక్ డౌన్ సమయంలో..

లాక్ డౌన్ సమయంలో..

గతంలోనూ ఈ ఇద్దరు సపరేట్‌గా ఈ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ తరువాత వస్తోన్న షోలో ఇద్దరిద్దరినీ పట్టుకొచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. గతవారంలో ప్రదీప్, సుమ ఎన్నో విషయాలను పంచుకున్నారు. తాజాగా రష్మీ, సుధీర్ వచ్చి షోలో హల్చల్ చేశారు.

ఇద్దరూ కలిసి..

ఇద్దరూ కలిసి..

రష్మీ, సుధీర్ ఇద్దరూ కలిసి అలీతో సరదాగా షోలో సందడి చేశారు. ఇరువురు ఎన్నో విషయాల గురించి చెప్పుకొచ్చారు. లాక్ డౌన్ సమయంలో ఏవిధంగా గడిపారో తెలిపారు. అంతేకాకుండా ఇద్దరూ ఒకరి గురించి ఒకరు ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే రష్మీ మనస్తత్వం, క్యారెక్టర్ గురించి సుధీర్ వివరించాడు.

యాటిట్యూడ్, పొగరు..

యాటిట్యూడ్, పొగరు..

రష్మీ చూడటానికి బయటకు ఏదో యాటిట్యూడ్ చూపించినట్టుగా ఉంటుంది.. పొగరుగా ఉన్నట్టు కనిపిస్తుంది.. చాలా ధైర్యవంతురాలుగా అనిపిస్తుంది కానీ అలాంటిది కాదని చెప్పుకొచ్చాడు. రష్మీ లోపల వేరేలా ఉంటుందని సుధీర్ అసలు సంగతి చెప్పుకొచ్చాడు.

చాలా సెన్సిటివ్..

చాలా సెన్సిటివ్..

రష్మీ చాలా సెన్సిటివ్.. ఎంతో సున్నితంగా ఉంటుందని పేర్కొన్నాడు. ప్రతీ చిన్నదానికి ఎమోషనల్ అవుతుందని, ఢీ షోలో కూడా ఊరికే ఏడుస్తుందని చెప్పుకొచ్చాడు. అవును నటులంటేనే సెన్సిటివ్‌గా ఉంటారు కదా అని రష్మీకూడా సుధీర్ మాటలకు ఒత్తాసు పలికింది.

Recommended Video

#HBDSudigaliSudheer : Sudigali Sudheer Next Film with Rashmi Gautam
వారు కూడా బతకాలి కదా..

వారు కూడా బతకాలి కదా..

వెబ్‌సైట్స్‌లో వచ్చే కథనాలపై ఎలా రియాక్ట్ అవుతారని రష్మీ, సుధీర్‌ను అలీ ప్రశ్నించాడు. వారు కూడా బతకాలి కదా.. మా మీద అలా రాస్తే వారికి ఎంతో కొంత వస్తుంది, బతుకుతారు కదా.. బతకనివ్వండని చెప్పుకొచ్చారు. మా ఇద్దరి వరకు ఏది రాసినా పర్లేదు గానీ వ్యక్తిగత విషయాలు రాస్తే కొంచెం బాధగా అనిపిస్తుందని పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X