అమ్మాయి విషయంలో సుడిగాలి సుధీర్ చీకటి కోణం.. బయట పెట్టిన జాఫర్

బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని కమెడియన్, ఆర్టిస్ట్ సుడిగాలి సుధీర్. ఆయనకు స్మాల్ స్క్రీన్ పై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి అంచెలంచెలుగా ఎదిగారు. తన టాలెంట్ తో ఆడియెన్స్ కు సరికొత్త కామెడీని అందించారు. మరోవైపు బుల్లితెర యాంకర్స్, నటీమణులతోనూ సుడిగాలి సుధీర్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ సుడిగాలి సుధీర్ టాప్ టెలివిజన్ ప్రోగ్రామ్స్ హోస్ట్ గా వ్యవహరిస్తూ అలరిస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యామిలీ స్టార్ షోలో తాజాగా సుడిగాలి సుధీర్ కు చుక్కెదురైంది. ఆ షోకు ఎంట్రీ ఇచ్చిన జర్నలిస్ట్, బిగ్ బాస్ ఫేమ్ జాఫర్ సుధీర్ చీకటి కోణం అంటూ బాంబ్ పేల్చారు. ప్రస్తుతం ఆయన మాటలు సంచనంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

బుల్లితెర టు వెండితెర.. సుడిగాలి సుధీర్ జోరు..
పాపులర్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు సుడిగాలి సుధీర్. అంతకు ముందు మ్యాజిక్ షోలు చేస్తూ జీవనం సాగించే వాడు. కానీ జబర్దస్త్ ఎంట్రీతో అతని లైఫ్ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. అదే స్థాయిలో సుడిగాలి సుధీర్ కూడా కష్టపడ్డారు. అతని అణకువ, సమయస్ఫూర్తి, కామెడీ స్కిల్స్, యాంకరింగ్ స్కిల్స్ తో టెలివిజన్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు.

Sudigali Sudheer affair with a Girl

మరోవైపు నటుడిగానూ వెండితెరపై మెప్పించారు. సాఫ్ట్ వేర్ సుధీర్, 3 మంకీస్, వాంటెడ్ పండుగాడు, గాలోడు, కాలింగ్ సహస్త్ర వంటి చిత్రాలతో బాగా ఆకట్టుకున్నారు. గాలోడు సినిమా మంచి ఫలితాన్ని అందించింది. ఇక నెక్ట్స్ గోట్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇలా సుడిగాలి సుధీర్ బుల్లితెర నుంచి వెండితెరకు ప్రయాణించిన తీరు ఆసక్తికరంగా మారింది.

మళ్లీ బుల్లితెరపైకే..
సుడిగాలి సుధీర్ ఇక వెండితెరకు దూరంగా ఉంటారని అందరూ భావించారు. జబర్దస్త్ ను వీడిన తర్వాత తను చేయబోయే సినిమాలపై అభిమానులు, ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని పెంచాయి. సినిమా తర్వాత సినిమాను తీసుకొచ్చారు. గాలోడు చిత్రంతో మంచి మాస్ రెస్పాన్స్ ను కూడా దక్కించుకున్నారు. ఇకపై హీరోగా బిజీ అవుతారని అంతా అనుకునే సమయంలో ఏమైందో ఏమో గానీ మళ్లీ బుల్లితెరవైపే అడుగులు వేశారు. ఇందుకు కారణం ఏంటనేది ఆసక్తికరంగా మారింది.

సుడిగాలి సుధీర్ పై జాఫర్ సంచలన వ్యాఖ్యలు..
ప్రస్తుతం సుడిగాలి సుధీర్ ఫ్యామిలీ స్టార్స్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు తాజాగా బిగ్ బాస్ ఫేమ్, జర్నలిస్ట్ జాఫర్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆయనతో పాటు బుల్లితెర నటీమణులు కూడా వచ్చారు. అయితే ఈ ఎపిసోడ్ లో మాత్రం సుడిగాలి సుధీర్ నే జాఫర్ ప్రశ్నల వర్షంతో వణికిపోయేలా చేశారు. సుడిగాలి సుధీర్ చీకటి కోణం అంటూ ఫ్యామిటీ స్టార్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో బాంబ్ పేల్చారు. ఈ సందర్భంగా సుడిగాలి సుధీర్ ఒక అమ్మాయితో ఎఫైర్ నడిపాడని, ఆమెను ప్రొఫెషనల్ గానే కాకుండా రియల్ లైఫ్ ను వాడుకున్నాడని జాఫర్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గ్గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X