వీడియో: సుధీర్ ఎఫైర్స్ బయటపెట్టిన స్పెషల్ గెస్ట్.. రోజాది ప్రతిపక్షమంటూ షాకిచ్చిన కొడుకు.!

By Manoj Kumar P

తెలుగు బుల్లితెర చరిత్రలో తక్కువ వ్యవధిలోనే ఎక్కువ పేరును సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకడు. యాక్టింగ్, కామెడీ, డ్యాన్స్, మ్యాజిక్, సింగింగ్ ఇలా అన్నింటిలోనూ సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడీ యంగ్ స్టార్. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సుధీర్‌కు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా అతడిని ఇష్ట పడుతుంటారు. అందుకే ఈ టాలెంటెడ్ యాక్టర్‌కు భారీ డిమాండ్ ఉంది. తాజాగా సుధీర్ ఎఫైర్స్ బయట పడ్డాయి. అతడికి ఎంత మంది లవర్స్ ఉన్నారన్నది రివీల్ అయిపోయింది. ఇంతకీ ఇవన్నీ ఎవరు చెప్పారు అని అనుకుంటున్నారా.? అయితే పూర్తిగా చదవండి.

రష్మీ వల్ల బాగా ఫేమస్ అయ్యాడు

రష్మీ వల్ల బాగా ఫేమస్ అయ్యాడు

సుడిగాలి సుధీర్ తన టాలెంట్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంటే.. యాంకర్ రష్మీతో ఎఫైర్ ఉందంటూ వస్తున్న వార్తలతో బాగా ఫేమస్ అయ్యాడు. వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. చాలా మంది రష్మీ, సుధీర్‌ను యూట్యూబ్ జోడీ అని పిలుస్తుంటారు.

 వాళ్ల టార్గెట్ కూడా ఈ ఇద్దరే

వాళ్ల టార్గెట్ కూడా ఈ ఇద్దరే

గత పదేళ్ల కాలంలో సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ మధ్య వచ్చినన్ని రూమర్లు మరే జంటపై రాలేదు. అందుకే ఈ జంటకు సంబంధించి ఏది జరిగినా హాట్ టాపిక్ అవుతోంది. దీన్ని చాలా మంది డైరెక్టర్లు కూడా క్యాష్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఈ ఇద్దరిపై ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇలా ఎన్నో షోలు వచ్చిన విషయం తెలిసిందే.

తొలి ప్రయత్నమే దెబ్బ కొట్టింది

తొలి ప్రయత్నమే దెబ్బ కొట్టింది

బుల్లితెరపై తిరుగులేని స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న సుధీర్.. ఇటీవల ‘సాఫ్ట్‌వేర్ సుధీర్' అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ పతాకంపై పారిశ్రామికవేత్త కే శేఖర్‌ రాజు నిర్మించిన ఈ సినిమాను రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల తెరకెక్కించాడు. ధన్య బాలకృష్ణ హీరోయిన్. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా పరాజయాన్ని మూటగట్టుకుంది.

మరో ప్రత్యేకమైన షోతో వస్తున్నారు

‘జబర్ధస్త్' కామెడీ షో నిర్మాణ సంస్థ మల్లెమాల ప్రతి పండుగకు, ప్రత్యేకమైన రోజుకు సరికొత్త ప్రోగ్రామ్‌లతో ముందుకు వస్తుందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రాబోయే సంక్రాంతిని పురస్కరించుకుని ‘అమ్మా నాన్న ఓ సంక్రాంతి' అనే స్పెషల్ ఎపిసోడ్ చేస్తున్నారు. దీనికి రోజా, సుధీర్, అనసూయ సహా ఎంతో మంది ఆర్టిస్టులు వస్తున్నారు.

సుధీర్ ఎఫైర్స్ బయటపెట్టిన స్పెషల్ గెస్ట్

సుధీర్ ఎఫైర్స్ బయటపెట్టిన స్పెషల్ గెస్ట్

ఈ ప్రోగ్రామ్‌లో సుడిగాలి సుధీర్‌ను హైలైట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రోగ్రామ్‌కు ఓ గంగిరెద్దును స్పెషల్ గెస్ట్‌గా తీసుకొచ్చారు. దాన్ని స్టేజ్ మీదకు తీసుకొచ్చి ఆది.. సుధీర్ గురించి ప్రశ్నలు అడిగాడు. ‘సుధీర్‌కు 40 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా' అనగానే అది అవును అన్నట్లుగా తల ఊపింది. దీంతో అతడు షాక్ అయిపోయాడు.

రోజా సహా అందరి పిల్లల కిడ్నాప్

రోజా సహా అందరి పిల్లల కిడ్నాప్

సంక్రాంతి సందర్భంగా వస్తున్న ఈ ప్రోగ్రాంలో రోజా అదిరిపోయే స్పెప్పులతో అలరించారు. అయితే, ఇందులో ఆమె కుమారుడు సహా మిగిలిన వారి పిల్లలందరినీ హైపర్ ఆది కిడ్నాప్ చేస్తాడు. తర్వాత పిల్లలంతా పెద్దలకు ఎదురు తిరుగుతారు. ముఖ్యంగా రోజా కుమారుడు.. ‘నువ్వు ప్రతిపక్షం.. మేము అధికార పక్షం' అని చెప్పిన డైలాగ్ హాట్ టాపిక్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X