For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నైట్ అయింది ఏంటి మరీ అంటూ సుధీర్ కొంటె ప్రశ్న: గు* అని సిగ్గుతో నాలుక కరుచుకున్న యాంకర్

  |

  దాదాపు ఎనిమిదేళ్లుగా తెలుగు బుల్లితెరపై హవాను చూపిస్తూ.. నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. వారానికి రెండు రోజుల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఈ కార్యక్రమానికి క్రమంగా ఆదరణ పెరుగుతూనే ఉంది. అందుకే దీనికి పోటీగా ఎన్ని షోలు వచ్చినా.. అవన్నీ ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. ఈ మధ్య కాలంలో జబర్ధస్త్‌లో ఊహించని ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సుడిగాలి సుధీర్‌తో పాటు యాంకర్ అనసూయ భరద్వాజ్ వ్యవహరించిన తీరు హాట్ టాపిక్ అవుతోంది. అసలేం జరిగిందంటే!

   సుదీర్ఘ ప్రయాణం.. వందల మంది ఎంట్రీ

  సుదీర్ఘ ప్రయాణం.. వందల మంది ఎంట్రీ

  తెలుగులో సుదీర్ఘ కాలంగా ప్రసారం అవుతూ సత్తా చాటుతోన్న ఏకైక షో జబర్ధస్త్ మాత్రమే. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఈ షో... వాటన్నింటినీ బ్రేక్ చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. అదే సమయంలో రేటింగ్‌లోనూ హవాను చూపిస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని వందల మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. వాళ్లిప్పుడు సెలెబ్రిటీలయ్యారు.

   జబర్ధస్త్ అప్పుడలా... ఇప్పుడు మరోలా

  జబర్ధస్త్ అప్పుడలా... ఇప్పుడు మరోలా

  జబర్ధస్త్‌ షో ప్రేక్షకులకు మజాను పంచుతున్నప్పటికీ.. దీని నడిచే తీరుపై చాలా మంది పెదవి విరుస్తూనే ఉన్నారు. దీనికి కారణం ఇందులో డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉండడమే. అప్పట్లో దీని వల్ల షోను బ్యాన్ చేయాలని కూడా డిమాండ్లు వినిపించాయి. ఇక, ఈ మధ్య కాలంలో అలాంటివి కొంచెం తగ్గాయి. దీంతో ఎటువంటి అవాంతరాలు లేకుండా జబర్ధస్త్ రన్ అవుతోంది.

   ఎక్కువగా అలాంటివే చూపిస్తున్నారుగా

  ఎక్కువగా అలాంటివే చూపిస్తున్నారుగా

  గతంలో కంటే ఇప్పుడు జబర్ధస్త్‌ ఆసక్తికరంగా మారుతోంది. దీనికి కారణం ఇందులో వివాదాలు, గొడవలు, ప్రేమలు, రొమాన్స్ ఇలా ఎన్నో అంశాలను హైలైట్ చేసి చూపించడమే. వీటినే ప్రోమోలో చూపించడంతో షోకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా టీఆర్పీలో ఈ షో దూసుకుపోతోంది. ఇలా కొన్ని వారాలుగా షో నిర్వహకులు సరికొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.

  వచ్చే వారం పెళ్లిళ్లతో సందడిగా జబర్ధస్త్

  వచ్చే వారం పెళ్లిళ్లతో సందడిగా జబర్ధస్త్

  వచ్చే వారం ప్రసారం కాబోతున్న జబర్ధస్త్ షోకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇక, ఇందులో రెండు జంటలకు పెళ్లిళ్లు చేస్తున్నట్లు చూపించారు. అందులో ఒకటి యూట్యూబ్ జోడీ రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ కాగా.. రెండోది హైపర్ ఆది.. దీపిక పిల్లి జంట. పెళ్లి బట్టల్లో ఎంట్రీ ఇవ్వడం నుంచి మొత్తం సందడిగా సాగింది. దీంతో ఈ ప్రోమో తెగ వైరల్ అయిపోయింది.

  నైట్ అయింది ఏంటి మరీ అంటూ సుధీర్

  రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ జబర్ధస్త్ కోసం పెళ్లి బట్టల్లో ఎంట్రీ ఇచ్చారు. ఇక, ఈ ప్రోమోలో సుధీర్ మాట్లాడుతూ ‘ఆ సూర్యరశ్మి ఉన్నంత కాలం సుధీర్ రష్మీ ఇలాగే ఉంటారు' అనగా దానికి హైపర్ ఆది పంచ్ వేస్తాడు. ఆ తర్వాత రష్మీ ‘సుధీర్ ఏం చూస్తున్నావ్ అడుగు' అంటుంది. అప్పుడు సుధీర్ ‘పదిన్నర అయింది ఏంటి మరీ' అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ వదులుతాడు.

  Working With Comedian Bhadram Is a Learning Experience - Altaf Hassan
  గు* అని నాలుక కరుచుకున్న యాంకర్

  గు* అని నాలుక కరుచుకున్న యాంకర్

  అభి స్కిట్ చేస్తోన్న సమయంలో అతడిని టీమ్ మెంబర్ రాము ‘గుర్రానికి ముందు.. ఏనుగుకు వెనుక ఉండేది ఏంటి' అని అడుగుతాడు. అప్పుడు వెంటనే అనసూయ ‘గు' అంటూ సమాధానం చెబుతుంది. అప్పుడు అభి ‘ఏం మాట్లాడుతున్నావ్ అనూ' అని అనగానే ఆమె సిగ్గుతో తల దించుకుంటుంది. నిజానికి అనసూయ చెప్పిన ఆన్సర్ కరెక్టే అయినా దాన్ని డబుల్ మీనింగ్ చేశారు.

  English summary
  Sudigali Sudheer and Anasuya Double Meaning Dialogues Highlighted in Jabardasth Latest Promo. This Video Gone Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X