హైపర్ ఆది, సుడిగాలి సుధీర్‌కు భారీ షాక్.. ఆ ఇద్దరు హాట్ యాంకర్లూ తగ్గించుకోవాల్సిందే.!
జబర్ధస్త్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ షో గురించి తెలియని వారుండరు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఈ కామెడీ షో దాదాపు ఏడేళ్లుకు పైగానే ప్రభావాన్ని చూపిస్తోంది. మొదట్లో వారంలో ఒకరోజు మాత్రమే ప్రసారం అయిన ఈ షో... ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన వల్ల రెండో రోజుకు పెరిగింది. దీంతో గురువారం జబర్ధస్త్, శుక్రవారం ఎక్స్‌ట్రా జబర్ధస్త్ ప్రసారం అవుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోందంటే టీమ్ లీడర్ల పాత్ర చాలా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ లీడర్లు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్‌కు భారీ షాక్ తగిలింది. ఆ వివరాలు మీకోసం.!

జబర్ధస్త్ వల్ల ఆ నలుగురికి ప్రత్యేకమైన గుర్తింపు
ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, రైటర్లు మాత్రమే కాదు... జబర్ధస్త్ వల్ల ఇద్దరు యాంకర్లు అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్ కూడా బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం వీళ్లు బెస్ట్ యాంకర్లుగా వెలుగొందుతున్నారంటే అది జబర్ధస్త్ వల్లే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్లతో పాటు రోజా, నాగబాబుకు కూడా ఈ కామెడీ షో బాగా ఉపయోగపడడంతో పేరు తెచ్చిపెట్టింది.

చాలా మంది వస్తే.. వీళ్లు బాగా క్లిక్ అయ్యారు
జబర్ధస్త్‌లో ప్రారంభంలో సినీ పరిశ్రమకు చెందిన కమెడియన్లు టీమ్ లీడర్లుగా తీసుకున్నారు. ఆ తర్వాత కొత్త వారికి సైతం అవకాశాలు కల్పించారు. దీంతో చాలా మంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలాంటి వారిలో ధన్‌రాజ్, వేణు, చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్, రాకెట్ రాఘవ, హైపర్ ఆది, అదిరే అభి సహా ఎంతో మంది బాగా క్లిక్ అయ్యారు.

మంచి టైమ్‌లో జబర్ధస్త్‌కు భారీ ఎదురుదెబ్బలు
భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సాధిస్తూ.. నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. సక్సెస్‌ఫుల్‌గా ప్రసారం అవుతోన్న సమయంలోనే ఆ షో నుంచి మెగా బ్రదర్ నాగబాబు బటయకు వెళ్లిపోయారు. ఆ వెంటనే అప్పటి వరకు దర్శకత్వం వహించిన నితిన్, భరత్ కూడా గుడ్‌బై చెప్పేశారు. వీళ్లతో పాటు చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీ టీమ్‌లు కూడా వెళ్లిపోయాయి.

ఆ విషయంలో జబర్ధస్త్ చాలా బెటర్ అంటున్నారు
నాగబాబు గ్యాంగ్ మరో చానెల్‌లోకి ఎంటర్ అవడంతో పాటు ‘అదిరింది' అనే షోను ప్రారంభించిన విషయం తెలిసిందే. జబర్ధస్త్ వాళ్లంతా అక్కడకు వెళ్లడం వెనుక రెమ్యూనరేషన్ పెరుగుదలే కారణమన్న టాక్ వినిపించింది. అయితే, అదిరింది టీమ్ లీడర్లు మాత్రం జబర్ధస్త్ రెమ్యూనరేషన్లే ఎక్కువని, కొత్తదనం కోసమే మరో చానెల్‌లోకి వచ్చామని చెబుతున్నారు.

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్‌కు భారీ షాక్
జబర్ధస్త్‌లో టీమ్ లీడర్లకు ఇచ్చే రెమ్యూనరేషన్ గురించి కొద్ది రోజులుగా ఎన్నో వార్తలు ప్రచారం అవుతోన్నాయి. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. దీని ప్రకారం.. కరోనా ప్రభావంతో చాలా నష్టపోయిన జబర్ధస్త్ నిర్వహకులు... ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ టీమ్‌లకు భారీగా కోత విధించారని తెలుస్తోంది.
Recommended Video

ఆ ఇద్దరు హాట్ యాంకర్లూ తగ్గించుకోవాల్సిందే.!
ప్రస్తుతం జబర్ధస్త్‌లో సుధీర్, ఆది టీమ్‌లకు మాత్రమే రూ. 4 లక్షలు ఇస్తున్నారని తెలిసింది. అందుకే వాళ్లకు ఎక్కువగా మిగిలిన వాళ్లకు తక్కువగా కోత పెడుతున్నారని సమాచారం. వీరితో పాటు ఇద్దరు యాంకర్లు రష్మీ, అనసూయ పారితోషికం కూడా తగ్గించుకోవాల్సిందేనని జబర్ధస్త్ నిర్వహకులు చెప్పినట్లు ఓ న్యూస్ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











