నిజంగానే ప్రేమించుకుంటున్న రష్మీ సుధీర్.. పెళ్లి కూడా.. ఆ వీడియోతో వ్యవహారం లీక్.!

By Manoj

బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న షో జబర్ధస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వీళ్లంతా తక్కువ సమయంలోనే పాపులారిటీని దక్కించుకున్నారు. ఇలా ఈ షో ద్వారా వెలుగులోకి వచ్చి ఊహించని రీతిలో క్రేజ్ సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుధీర్... యాంకర్ రష్మీ గౌతమ్ పేర్లను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దీనికి కారణం వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు వార్తలు వస్తుండడమే. ఈ నేపథ్యంలో తాజాగా బయటకు వచ్చిన ఓ వీడియోతో వీళ్ల ప్రేమ వ్యవహారం లీకైంది. అంతేకాదు, పెళ్లి గురించి కూడా మనసు విప్పి మాట్లాడారు. ఆ వివరాలు మీకోసం.!

ఇలా కంటే యూట్యూబ్ జోడీగా ఫేమస్

ఇలా కంటే యూట్యూబ్ జోడీగా ఫేమస్

అద్భుతమైన గ్లామర్‌తో తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా వెలుగొందుతోంది జబర్ధస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్. యాక్టింగ్, డ్యాన్స్, మ్యాజిక్, సింగింగ్ ఇలా అన్ని రకాల విద్యలను ప్రదర్శిస్తూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు సుడిగాలి సుధీర్. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న వీరిద్దరూ సొంత పేర్లతో కంటే యూట్యూబ్ జోడీ అనే బిరుదుతో బాగా పాపులర్ అయ్యారు.

ఖండించినా...... అస్సలు తగ్గడం లేదు

ఖండించినా...... అస్సలు తగ్గడం లేదు

రష్మీ.. సుధీర్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు, వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వీళ్ల గురించి ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి. మరీ ముఖ్యంగా యూట్యూబ్‌లో కొన్ని వందల వీడియోలు పుట్టుకొచ్చాయి. దీంతో రష్మీ సుధీర్ ఇద్దరూ ఈ వార్తలను ఖండించారు. అయినా వాటికి మాత్రం పుల్‌స్టాప్ పడడం లేదు.

బలం చేకూరేలా చేస్తున్న షోల మేకర్లు

బలం చేకూరేలా చేస్తున్న షోల మేకర్లు

టెలివిజన్‌లోనే ఫేమస్ జోడీగా పేరొందిన రష్మీ సుధీర్‌కు విడివిడిగా కంటే జంటగానే ఎక్కువ క్రేజ్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు షోల మేకర్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే వీళ్లిద్దరి మధ్య రొమాంటిక్ యాక్ట్‌లు ప్లాన్ చేస్తున్నారు. అలాగే, చాలా మంది ఫిల్మ్ మేకర్లు కూడా వీళ్లతో సినిమాలు చేయాలని చూశారు. కానీ, ఇప్పటి వరకు సెట్ కాలేదు.

లేదంటూనే చేస్తుండడంతో అనుమానం

లేదంటూనే చేస్తుండడంతో అనుమానం


తమ తమ కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో రొమాంటిక్ యాక్ట్‌లు చేసినప్పటికీ... పర్సనల్ ఇంటర్వ్యూలు తదితర ఈవెంట్లలో కూడా రష్మీ.. సుధీర్ తమ మధ్య ఎఫైర్ ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా సుధీర్ తరచూ ఏదో ఒక స్టేట్‌మెంట్ ఇస్తుండడంతో వీళ్ల మధ్య ఎఫైర్ ఉందన్న వార్తలకు బలం చేకూరుతోంది. దీంతో మరిన్ని వార్తలు పుట్టుకొస్తున్నాయి.

రష్మీ సుధీర్‌కు పెళ్లి చేసిన జబర్ధస్త్ టీమ్

రష్మీ సుధీర్‌కు పెళ్లి చేసిన జబర్ధస్త్ టీమ్


సరదా సత్తిపండు అదుర్స్ ఆనంద్ టీమ్ స్కిట్ చేసింది. ఇందులో భాగంగా ఆనంద్... సుధీర్‌లా, వినోదిని అలియాస్ వినోద్.. రష్మీలా గెటప్ వేసుకుని యాక్టింగ్ చేశారు. గతంలో వాళ్లిద్దరూ చేసిన రొమాంటిక్ డ్యాన్స్‌ను వీళ్లిద్దరూ చేశారు. ఆ తర్వాత ఈ యూట్యూబ్ జోడీకి వివాహం కూడా అయినట్లు చూపించారు. అంతేకాదు, సత్తిపండు.. రష్మీ తల్లి గెటప్ వేసి అలరించాడు.

Recommended Video

Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
నిజంగానే ప్రేమించుకుంటున్న రష్మీ సుధీర్

నిజంగానే ప్రేమించుకుంటున్న రష్మీ సుధీర్

ఇప్పటి వరకు ఉత్తుత్తి స్కిట్లతో తమ మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు క్రియేట్ చేసుకున్నారు రష్మీ సుధీర్. ఇక, తాజాగా విడుదలైన వీడియోలో వీళ్ల మధ్య నిజమైన ప్రేమ ఉన్నట్లు బయటకు వచ్చింది. సరదా సత్తిపండు అదుర్స్ ఆనంద్ టీమ్ స్కిట్‌లో భాగంగా రష్మీ సుధీర్ యాక్టింగ్ చేయాలి. అయితే, దాని నుంచి బయటకు వచ్చేసి రొమాన్స్ చేసిందీ జంట.

నేను రాసింది చేయకుండా.. రియల్‌గా

ఇక, ఈ స్కిట్‌లో సుధీర్‌ను ‘నీకు ఇంటి పనులు చేయడం వచ్చా' అంటూ ప్రశ్నించింది రష్మీ. అంతేకాదు, చివర్లో ‘మా అమ్మ కూడా గయ్యాలిలా ఉంటే నీకు ఓకేనా' అని అడిగింది. దీనికి ‘నీలాంటి మంచి అమ్మాయి కోసం ఏదైనా భరిస్తా' అంటూ సమాధానమిచ్చాడు సుధీర్. దీంతో ఆనంద్ ఎంటరై ‘నేను రాసింది చేయకుండా నిజంగా లవ్ ట్రాక్ నడుపుతున్నారేంటి' అని అంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X