వీడియో: ట్రాక్ మార్చిన సుడిగాలి సుధీర్.. రష్మీని వదిలేసి మరో యాంకర్‌తో రొమాన్స్.!

By Manoj Kumar P

ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా పరిచయమై... తక్కువ వ్యవధిలోనే భారీ స్థాయిలో గుర్తింపుతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. అద్భుతమైన కామెడీని పండించడంతో పాటు మ్యాజిక్, డ్యాన్స్, సింగింగ్ ఇలా ఎన్నో విద్యలతో ఆల్‌రౌండర్‌గా వెలుగొందుతున్నాడు. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న అతడు... యాంకర్ రష్మీ గౌతమ్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అతడు మరో యాంకర్‌తో రొమాన్స్ చేసి షాకిచ్చాడు. ఆ వివరాలు మీకోసం.!

సుడిగాలి సుధీర్... బుల్లితెర ప్లేబాయ్

సుడిగాలి సుధీర్... బుల్లితెర ప్లేబాయ్

కమెడియన్‌గా, టీమ్ లీడర్‌గా, యాంకర్‌గా సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు బుల్లితెర ఆల్‌రౌండర్ సుడిగాలి సుధీర్. వరుస ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతున్న అతడు... ప్లేబాయ్‌గా పేరొందాడు. రష్మీ సహా కొందరు యాంకర్లతో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు వార్తలు రావడానికి తోడు స్కిట్లలో ఆ తరహా పాత్రలే వేస్తుండడం వల్ల సుధీర్‌కు ఈ పేరు వచ్చింది.

ఈ యూట్యూబ్ జోడీ... ఫుల్ ఫేమస్

ఈ యూట్యూబ్ జోడీ... ఫుల్ ఫేమస్

తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది ఎంట్రీ ఇచ్చారు... కానీ వారిలో కొందరు మాత్రమే భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు. అలాంటి వారిలో యూట్యూబ్ జోడీ రష్మీ గౌతమ్... సుడిగాలి సుధీర్ జంట ఒకటి. జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా తెలుగు వాళ్లకు పరిచయం అయిన ఈ ఇద్దరూ... జంటగా పాపులర్ అయ్యారు. ఈ క్రమంలోనే వీళ్లపై ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి.

తన ఎదుగుదలకు రష్మీనే కారణమని

తన ఎదుగుదలకు రష్మీనే కారణమని

రోజులు గడుస్తున్న కొద్దీ రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ మధ్య ప్రేమాయణం సాగుతోందన్న వార్తలు పెరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని ఇద్దరూ ఖండిచినప్పటికీ పుకార్లకు పుల్‌స్టాప్ పడడం లేదు. ఇలాంటి సమయంలోనే కొద్ది రోజుల క్రితం సుధీర్... ‘నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి రష్మీనే కారణం. ఆమె వల్లే నేను మరింత ఫేమస్ అయ్యాను' అని చెప్పుకొచ్చాడు.

రష్మీ - సుధీర్.. వాళ్లకు రెండు అస్త్రాలు

రష్మీ - సుధీర్.. వాళ్లకు రెండు అస్త్రాలు

ఒక్కొక్కరిగా కంటే జంటగానే ఎక్కువ ఫేమస్ అయ్యారు రష్మీ గౌతమ్... సుడిగాలి సుధీర్. అందుకే వీళ్లిద్దరి పాపులారిటీని వాడుకొని క్యాష్ చేసుకోవాలని చాలా మంది మేకర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం చేస్తున్న షోలలో వీళ్లిద్దరిపై ప్రత్యేకమైన థీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అందుకే తరచూ వీళ్లిద్దరూ రొమాంటిక్ డ్యాన్స్, స్కిట్లు చేస్తున్నారు.

ట్రాకు మార్చేసిన సుడిగాలి సుధీర్

ట్రాకు మార్చేసిన సుడిగాలి సుధీర్

రష్మీ గౌతమ్‌తో రొమాన్స్ పండిస్తూ రోజు రోజుకూ ఫుల్ ఫేమస్ అయిపోతోన్న సుడిగాలి సుధీర్... దాన్ని కంటిన్యూ చేసేలా తరచూ ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నాడు. ఆమెతో కలిసి ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జబర్ధస్త్ కమెడియన్ షడన్‌గా ట్రాక్ మార్చేశాడు.

రష్మీని వదిలేసి మరో యాంకర్‌తో రొమాన్స్.!

రష్మీని వదిలేసి మరో యాంకర్‌తో రొమాన్స్.!

రష్మీతో ఎన్నోసార్లు రొమాంటిక్ డ్యాన్స్ చేసి మెప్పించాడు సుధీర్. తాజాగా అతడు ఆమెను వదిలేసి మరో హాట్ యాంకర్ వర్షిణితో ట్రాక్ కలిపాడు. వచ్చే వారం ప్రసారం కానున్న ఢీ షో ప్రోమోలో ఇది ప్రత్యక్షమైంది. ఇందులో రష్మీ ముందరే ఆమెతో రొమాంటిక్ డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. వర్షిణి కూడా సుధీర్‌తో కలిసి కాళ్లు కదిపింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Recommended Video

Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
సుధీర్ గురించి వర్షిణి ఏం చెప్పిందంటే

సుధీర్ గురించి వర్షిణి ఏం చెప్పిందంటే

కొద్ది రోజుల క్రితం ఓ యూట్యూబ్‌ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది వర్షిణి. ఆ సమయంలో ఆమెకు సుడిగాలి సుధీర్‌తో ఎఫైర్ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందిస్తూ... ‘సుధీర్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. అతడిని నేను బ్రో బ్రో అని పిలుస్తుంటా. తను కూడా నన్ను బ్రో అంటాడు. బ్రదర్ సిస్టర్ రిలేషన్ ఉన్న మా ఇద్దరికి పెళ్లి అంటే ఎలాగో అనిపిస్తుంది' అని ఆమె చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X