విశ్వక్ సేన్‌తో బాలయ్యపై నోరుజారిన సుడిగాలి సుధీర్ .. లైవ్ షోలో ఏం జరిగింది?
తెలుగు ప్రేక్షకులను సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎంతలా ఎంటర్ టైన్ చేస్తున్నాయో... వాటికి తీసిపోకుండా టీవీషోలు కూడా రన్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగులో వచ్చే రియాలిటీ షోలు, గేమ్ షోలు, టాక్ షోలు ఎంతటి సక్సెస్ ను అందుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే బుల్లితెరపై తమ వాక్ ధాటితో ఆకట్టుకునే ప్రజంటర్స్ చాలా మందే ఉన్నారు. వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే, కొన్నేండ్ల పాటు సుడిగాలి సుధీర్ 'జబర్దస్త్' కామెడీ షోలో నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని ప్రయత్నించారు. పలు చిత్రాలు చేశారు. గాలోడు తో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటు టీవీ ఆడియెన్స్ కూడా యాంకర్ పలు టీవీ షోల్లో కనిపిస్తూ అలరిస్తున్నారు. ప్రస్తుతం 'ఫ్యామిలీ స్టార్స్' టీవీ షోకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. గెస్ట్ లతో మంచి అవుట్ పుట్ ను అందిస్తున్నారు.

ఈక్రమంలోనే తాజాగా షోకు 'లైలా' సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గెస్ట్ గా విచ్చేశారు. అదే విషయాన్ని ప్రోమోలో కూడా చూపించారు. షోలో ఎంతో సరదాగా కనిపించారాయన. ఇతర ఆర్టిస్ట్ లతో సంతోషంగా గడిపారని తెలుస్తోంది. అయితే ప్రోమో చివర్లో మాత్రం ఆడియెన్స్ కు బిగ్ షాక్ ఇచ్చారు. ముఖ్యంగా విశ్వక్ సేన్ కు ఓ టఫ్ సిచ్యూయేషన్ ను క్రియేట్ చేశారు సుడిగాలి సుధీర్.
నందమూరి బాలక్రిష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య కొన్నాళ్లుగా కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో వారిద్దరూ ఎప్పుడూ బహిర్గతంగా మాట్లాడలేదు. కానీ పలు సందర్భాల్లో మాత్రం వార్ కొనసాగుతుందని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో సుడిగాలి సుధీర్.. నందమూరి బాలయ్య, తారక్ కు వీరాభిమాని అయిన విశ్వక్ సేన్ ను ఇరుకున పెట్టే ప్రశ్నను అడిగారు.

మీరు బాలయ్య, తారక్ తో ఎంతో గౌరవంగా ఉంటారు కదా.. మరి ఇద్దరిలో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టమని అడిగారు. దీనికి విశ్వక్ ఎలా బదులిచ్చారనేది ప్రోమో లో చూపించలేదు. ఫిబ్రవరి 9న ఫుల్ ఎపిసోడ్ విడుదల కానుంది. అయితే ఇప్పటికే లైలా మూవీ ప్రమోషన్స్ లో విశ్వక్ సేన్ పలు కాంట్రవర్సీ క్వశ్చన్స్ ను ఎదుర్కొంటున్నారు. వాటికి ఎంతో ఓపిగ్గా, సూటిగా సమాధానాలు ఇస్తూ వస్తున్నారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఫ్యామిలీ స్టార్స్ షోలో నందమూరి కోల్డ్ వార్ ని పరోక్షంగా టచ్ చేస్తూ విశ్వక్ సేన్ దగ్గరకు వచ్చిన ప్రశ్నకు ఎలా బదులిచ్చారనేది చూడాలి.


Click it and Unblock the Notifications











