India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sudigali Sudheer : నడిరోడ్డుపై సుధీర్ గాలి వేషాలు.. అమ్మాయి వెంట పడుతున్న వీడియో లీక్

  |

  జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న కమెడియన్స్ అందరూ కూడా ప్రస్తుతం సినిమా ప్రపంచంలో చాలా బిజీగా మారుతున్న విషయం తెలిసిందే. కొందరు అయితే సినిమాలలో లీడ్ రోల్స్ కూడా చేస్తున్నారు. ఇక అదే తరహాలో సక్సెస్ అవుతున్న వారిలో సుడిగాలి సుదీర్ కూడా టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు. జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా ఎంతగానో గుర్తింపు అందుకున్న సుధీర్ ఇప్పుడు హీరోగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే రీసెంట్ గా అతనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఆ వివరాల్లోకి వెళితే..

  అతని సపోర్ట్ తోనే..

  అతని సపోర్ట్ తోనే..

  జబర్దస్త్ లోకి మొదట అడుగు పెట్టినప్పుడు సుడిగాలి సుదీర్ పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. అతన్ని బాగా సపోర్ట్ చేసి స్టేజి పైకి తీసుకువచ్చింది మాత్రం వేణు వండర్స్ టీం. కమెడియన్ వేణు అతన్ని మొదట కేవలం రైటర్ గానే జబర్దస్త్ తీసుకువచ్చాడు. అయితే అతనిలో కూడా మంచి కామెడీ టైమింగ్ ఉంది అని నిర్వాహకులను ఒప్పించి స్టేజ్ పైకి తీసుకువచ్చి చాలాసార్లు అవకాశాలు ఇచ్చాడు. అతని సపోర్ట్ తోనే సుదీర్ తో పాటు గెటప్ శ్రీను కూడా జబర్దస్త్ లో సక్సెస్ అయ్యారు.

   ప్రతి ఎపిసోడ్ కూడా హైలెట్

  ప్రతి ఎపిసోడ్ కూడా హైలెట్


  ఇక జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి కూడా కొన్నేళ్ల వరకు కొనసాగిన సుధీర్ ఎంతమంది వెళ్లిపోతున్నా కూడా తన టీంను విడిచిపెట్టలేదు. అయితే మధ్యలో గెటప్ శ్రీను కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ మళ్లీ చాలా తొందరగానే ఒకటయ్యారు. ఇక వీరికి తోడుగా ఆటో రాంప్రసాద్ వచ్చిన తర్వాత ప్రతి ఎపిసోడ్ కూడా హైలెట్ గా నిలిచింది. ఏ మాత్రం వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు సాగారు.

  జబర్దస్త్ సక్సెస్ లో కీలక పాత్ర

  జబర్దస్త్ సక్సెస్ లో కీలక పాత్ర

  వారు ముగ్గురు కలిస్తేనే స్కిట్ అనేది అద్భుతంగా వర్కౌట్ అవుతుంది అని ఏ ఒక్కరు మిస్ అయినా కూడా ఏదో వెలితిగానే అనిపిస్తుంది అని చాలాసార్లు మిగతా కమెడియన్స్ కూడా కామెంట్స్ చేశారు. విభిన్నమైనమైన తరహాలో కామెడీ క్రియేట్ చేస్తూ జబర్దస్త్ షో రేటింగ్ పెరగడానికి సుడిగాలి సుధీర్ టీమ్ కూడా ముఖ్య కారణం. అయితే సుధీర్ ప్రస్తుతం సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటూ చాలా బిజీగా మారుతున్నాడు.

  అందుకే జబర్దస్త్ కు దూరంగా..

  అందుకే జబర్దస్త్ కు దూరంగా..

  జబర్దస్త్ కు వీడ్కోలు చెప్పడంతో కొన్ని వివాదాల కారణంగా అతను దూరమయ్యాడని కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి. కానీ నిజానికి సుధీర్ గెటప్ శ్రీను ఆటో రాంప్రసాద్ ముగ్గురు కూడా సినిమాలతో బిజీ కావడం వలన జబర్దస్త్ కు సరైన సమయం కేటాయించలేకపోతున్నారు. అందుకే ఆ షో నుంచి తప్పకుంటున్నట్లుగా మరికొందరు వివరణ ఇచ్చారు.

  అమ్మాయి వెంట పడుతున్న సుధీర్

  అమ్మాయి వెంట పడుతున్న సుధీర్

  ప్రస్తుతం సుధీర్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతొంది. మొదట ఆ వీడియో చూసిన కొందరు సుధీర్ ఎవరో అమ్మాయి వెనక పడుతున్నారు అని కామెంట్స్ చేశారు. కానీ అది నిజం కాదు. కేవలం సినిమా షూటింగ్ కోసం అలా సుధీర్ అమ్మాయి వెంట పడుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.

  ఏ సినిమా అంటే?

  ఇక వివరాల్లోకి వెళితే 'గాలోడు' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఆ ప్రాజెక్టులో సుధీర్ ఒక రొమాంటిక్ బాయ్ గా కనిపించబోతున్నాడట. రాజశేఖర్ అనే దర్శకుడు తలకెక్కిస్తున్న ఆ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం కొన్ని సాంగ్స్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇదివరకే సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్ సినిమాలు చేసిన సుధీర్ ఇప్పుడు గాలోడు అనే సినిమాతో కూడా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. అలాగే మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయి. మరి ఆ సినిమాలతో సుధీర్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

  English summary
  Sudigali Sudheer at road side with a beautiful girl and video viral in social media
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X