తండ్రైన సుడిగాలి సుధీర్.. ఏకంగా బిడ్డతోనే: వాళ్లను అలా అడగడం వల్లే అంటూ రష్మీ సంచలన వ్యాఖ్యలు
ఓ షో ద్వారా పరిచయమై.. చాలా తక్కువ సమయంలోనే ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగిన వారిలో సుడిగాలి సుధీర్ ఒకడు. దాదాపు ఏడేళ్లుగా జబర్ధస్త్ అనే షోలో సందడి చేస్తోన్న అతడు.. నెంబర్ వన్ కమెడియన్‌గా కితాబందుకున్నాడు. అదే సమయంలో ఎంతో మంది అభిమానాన్ని దక్కించుకుని తెలుగు రాష్ట్రాల్లోనే యూత్ ఐకాన్‌గా వెలుగొందుతున్నాడు. తద్వారా వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. కెరీర్ సాఫీగా సాగిపోతోన్న సమయంలో తాజాగా సుడిగాలి సుధీర్ తండ్రి అయ్యాడు. ఏకంగా బిడ్డను పట్టుకుని వచ్చి దర్శనమిచ్చాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

ఆర్టిస్టు నుంచి నెంబర్ వన్ టీమ్ లీడర్ వరకు
జబర్ధస్త్ ఆరంభంలోనే వేణు వండర్స్ అనే టీమ్ ద్వారా తెలుగు వాళ్లకు పరిచయం అయ్యాడు సుధీర్. అందులోకి అడుగు పెట్టినప్పటి నుంచి తన మార్క్ కామెడీతో అలరించాడు. తద్వారా చాలా స్కిట్లను వన్ మ్యాన్ షోగా మార్చేశాడు. దీంతో షో నిర్వహకులు అతడికి టీమ్ లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడని సుధీర్ అండ్ టీమ్.. ఇప్పుడు టాప్‌లో ఉంది.

ఆ ఒక్క షోతో యూత్‌లో పెరిగిన పాపులారిటీ
జబర్ధస్త్ షో వల్ల తనలోని టాలెంట్లు బయటకు తీస్తే... 'పోవే పోరా' ద్వారా మాత్రం ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకున్నాడు సుడిగాలి సుధీర్. ఇందులో యాంకర్ విష్ణుప్రియతో కలిసి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్‌తో ఆడించే ఆటలు.. ఒకరిపై ఒకరు పంచులు వేసుకోవడం వంటి వాటితో సుధీర్ యూత్‌లో పాపులారిటీని విపరీతంగా పెంచుకున్నాడు.

సినిమా కెరీర్ అలాగ.. నిరాశనే మిగల్చడంతో
బుల్లితెరపై తిరుగులేని కమెడియన్‌గా వెలుగొందుతోన్న సుధీర్.. సినిమా రంగంలోకి సైతం అడుగు పెట్టాడు. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో చిత్రాల్లో నటించాడు. అందులో 'రేసు గుర్రం', 'బ్రదర్ ఆఫ్ బొమ్మాలి', 'సర్దార్ గబ్బర్ సింగ్', 'బంతిపూల జానకీ' సహా కొన్ని చిత్రాలు పేరు తెచ్చాయి. అయితే, హీరోగా మారి చేసిన 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీమంకీస్' మాత్రం అతడిని ఘోరంగా నిరాశ పరిచాయి.

ఆ ఇద్దరు యాంకర్లతో ట్రాకులు.. హాట్ టాపిక్
సుడిగాలి సుధీర్ ఫేమస్ అవడానికి అతడి టాలెంట్ మాత్రమే కాదు.. లవ్ ట్రాకులు కూడా ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఆరంభం నుంచే అతడు యాంకర్ రష్మీ గౌతమ్‌తో ప్రేమాయణం సాగిస్తున్నాడన్న వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. వీళ్లు పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం జరుగుతూనే ఉంది. ఇక, విష్ణుప్రియతోనూ అతడు లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు వార్తలు వచ్చాయి.

లెక్కలేనన్ని అవార్డులు.... ఎన్నో మైలురాళ్లు
సుదీర్ఘమైన కెరీర్‌లో అద్భుతమైన నటన, డ్యాన్స్, పాటలు, మ్యాజిక్ ఇలా ఎన్నో రకాల విద్యలను ప్రదర్శించి బుల్లితెర ఆల్‌రౌండర్ అనిపించుకున్నాడు సుడిగాలి సుధీర్. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్‌ను కూడా భారీగా ఏర్పరచుకున్నాడు. వీటికి తోడు తన ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను చేరుకున్నాడు. అంతేకాదు, పలు అవార్డులు, ఘనతలను కూడా అందుకున్నాడు.

తండ్రైన సుడిగాలి సుధీర్.. ఏకంగా బిడ్డతోనే
సుధీర్.. ఇటీవలి కాలంలో దారుణమైన స్కిట్లు చేస్తున్నాడు. ఆ మధ్య కడుపుతో ఉన్నట్లు నటించిన అతడు.. ఈ సారి ఏకంగా బిడ్డకు జన్మనిచ్చినట్లు కనిపించాడు. వచ్చే వారం స్కిట్‌లో భాగంగా సుధీర్ బాలింతలా కనిపించాడు. దీంతో అందరూ షాకైపోయారు. అదే సమయంలో అతడిపై పంచులు కూడా వేశారు. దీంతో ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అలా అడగడం వల్లే అంటూ రష్మీ సంచలనం
'నువ్ అబ్బాయి అయ్యి ఉండి.. నీకు కడుపు రావడం ఏంటి? సీమంతం చేయడం ఏంటి? నీకు డెలివరీ అయ్యి బిడ్డ పుట్టడం ఏంట్రా అని ఆటో రాం ప్రసాద్.. సుధీర్‌కు పంచ్ వేస్తే.. 'ఇంతకీ పుట్టింది బాబా? పాపా' అని యాంకర్ రష్మి అడిగింది. చివర్లో బేబీ ఏడవకుండా పాట పాడరా అంటే.. 'అడిగా అడిగా' అంటూ అందుకున్నాడు సుధీర్. దీంతో రష్మీ 'అంత మందిని అడిగావ్ కాబట్టే నీకిలా జరిగింది' అంటూ పంచ్ పేల్చింది.


Click it and Unblock the Notifications











