Sudigali Sudheer లో హై టెన్షన్.. ఈసారి డబ్బులు వస్తేనే ఆ రెండు ప్రాజెక్టులు!

టెలివిజన్ రంగంలో ఒక స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుదీర్ నెంబర్ వన్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు. జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన సుధీర్ అతి తక్కువ కాలంలోనే బుల్లితెరలో మంచి స్టార్ గా ఒక వెలుగు వెలిగాడు. అయితే ఇప్పుడు వెండి తెరపై కూడా అతను సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాడు. ఈ క్రమంలో అతను నటించిన ఒక సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. అయితే ప్రస్తుతం అతను ఆ సినిమా విడుదలపై ఒక టెన్షన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది ఆదివారంలోకి వెళితే..

ఆ విధంగా జబర్దస్త్ లో..

ఆ విధంగా జబర్దస్త్ లో..

మొదట సినిమా ఇండస్ట్రీలో నటుడిగా సక్సెస్ అవ్వాలని అనుకున్న జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుదీర్ అంతకంటే ముందు రైటర్ గా కూడా కొన్ని షోలకు వర్క్ చేశాడు. ఇక వేణు వండర్స్ టీంలో మంచి రైటర్ గా గుర్తింపు అందుకున్న తర్వాత అతను కమెడియన్ గా కూడా చాలా తొందరగానే క్లిక్ అయ్యాడు. ఆ తరువాత సొంతంగా టీం ఫామ్ చేసుకుని సుడిగాలి సుదీర్ గా క్రేజ్ అందుకున్నాడు.

జబర్దస్త్ పై ప్రభావం

జబర్దస్త్ పై ప్రభావం

అయితే జబర్దస్త్ షో నుంచి సుడిగాలి సుదీర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ షోపై కొంత ప్రభావం పడినట్లుగా తెలుస్తోంది. రేటింగ్స్ కూడా గతంలో మాదిరిగా రావడం లేదు. సుడిగాలి సుదీర్ తో పాటు గెటప్ శ్రీను ఆటో రాంప్రసాద్ ముగ్గురు ఉంటేనే మంచి క్రేజ్ వచ్చేది. ఇక వాళ్ళు ఇప్పుడు ఆ షో నుంచి వెళ్లిపోవడం వలన ఆడియన్స్ కూడా మిస్ అవుతున్నారు అని చెప్పవచ్చు.

అందుకే జబర్దస్త్ కు దూరం

అందుకే జబర్దస్త్ కు దూరం

వివిధ కారణాల వల్లనే జబర్దస్త్ షో నుంచి చాలామంది వెళ్లిపోతున్నారు అని అలాగే విభేదాల కారణంగా సుడిగాలి సుదీర్ టీం కూడా బయటకు వెళ్లిపోయినట్లుగా టాక్ అయితే వచ్చింది. కానీ నిజానికి ఒకవైపు సినిమాలో మరొకవైపు ఈ కామెడీ షో ను బ్యాలెన్స్ చేయలేకనే వారు బయటకు వెళ్లిపోయినట్లుగా మరికొందరు చెబుతున్నారు.

హీరోగా..

హీరోగా..

ఇదివరకే సుడిగాలి సుదీర్ కొన్ని సినిమాలు చేశాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అతను కొన్ని పెద్ద సినిమాల్లో కనిపించాడు. ఇక సాఫ్ట్ వేర్ సుధీర్ అనే సినిమాతో మొదటిసారి హీరోగా పరిచయమైన సుధీర్ ఆ తర్వాత త్రీ మంకీస్ అనే సినిమా కూడా చేశాడు. కానీ ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా ఫలితాన్ని అందించలేకపోయాయి.

ఆశలన్నీ ఈ సినిమాపైనే

ఆశలన్నీ ఈ సినిమాపైనే

ఇక ఇప్పుడు సుడిగాలి సుదీర్ తన ఆశలన్నీ కూడా వాంటెడ్ పండుగాడు అనే సినిమా పైన పెట్టుకున్నాడు. కే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న ఈ సినిమా లో కొంతమంది ప్రముఖ నటీనటులు నటించారు. ఆగస్టు 19వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా ఎలాగైనా సక్సెస్ అవ్వాలి అని సుధీర్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు.

క్లిక్ అయితే

క్లిక్ అయితే

సుడిగాలి సుదీర్ జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి ప్రధాన కారణం అతనికి సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు వస్తూ ఉండడమే. అయితే అవన్నీ కూడా పెద్ద బ్యానర్లలో వస్తున్న సినిమాలు కావు. కానీ క్లిక్ అయితే మళ్లీ మరో రేంజ్ వెళ్లొచ్చు అని సుధీర్ జబర్దస్త్ షో ను వదిలేసి సినిమాలు చేసేందుకు రెడీ అయ్యాడు.

Recommended Video

Bumper Offer జస్ట్ నిద్రపొతే బోలెడంత జీతం... పోటీపడి దరఖాస్తులు *Trending | Telugu OneIndia
డబ్బులు వస్తేనే..

డబ్బులు వస్తేనే..


అయితే వాంటెడ్ పండుగాడు సినిమా సక్సెస్ అయితేనే అతని నెక్స్ట్ రెండు సినిమాలు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉందట. ముందుగానే అగ్రిమెంట్ కూడా జరిగింది. కానీ వాంటెడ్ పండుగాడు సినిమా రిజల్ట్ బాగుండి బాక్సాఫీస్ వద్ద డబ్బులు వస్తేనే మరో రెండు ప్రాజెక్టులు త్వరలోనే మొదలవుతాయి అని తెలుస్తోంది. మరి సుధీర్ అనుకున్నట్లుగా ఈ ప్రాజెక్టు ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X