సుడిగాలి సుధీర్ ఇంట పండుగ వాతావరణం.. వారసుడు వచ్చేశాడు మరి!
తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూ ఇప్పటికీ నెంబర్ వన్ కామెడీ షోగా హవాను చూపిస్తుంది జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు, కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే స్టార్లుగా మారారు. అలా స్టార్ గా మారిన వారిలో సుడిగాలి సుధీర్ ఒకడు. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన సుధీర్ చాలా తక్కువ సమయంలో తన సత్తాను నిరూపించుకుని స్టార్‌గా మారాడు. ఇక, అప్పటి నుంచి సుధీర్ వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతున్నాడు. ఇలా కొంత కాలంగా షోలు, సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న సుధీర్ ఇంట పండుగ వాతావరణం నెలకొంది. ఆ వివరాల్లోకి వెళితే..

తక్కువ సమయంలోనే
సుడిగాలి సుధీర్ గా పేరు తెచ్చుకున్న సుధీర్ ముందుగా మ్యాజిక్‌లు చేసుకుంటూ తన ప్రయాణాన్ని మొదలెట్టాడు. ఈ క్రమంలోనే ఎన్నో ఛానెళ్లలో మ్యాజిక్ షోలు చేస్తూ ఉండేవాడు. సరిగ్గా అలాంటి సమయంలో జబర్దస్త్ కమెడియన్ల దృష్టిలో పడటంతో అందులో ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే తన టాలెంట్ ను చూపించుకున్నాడు. దీంతో షో నిర్వహకులు సుధీర్‌కు తక్కువ సమయంలోనే టీమ్ లీడర్‌గా ప్రమోషన్ అందించారు.

అందరిలో హాట్ టాపిక్
తాను కూడా ఎక్కడా తగ్గకుండా కామెడీ, డ్యాన్స్, మ్యాజిక్ ఇలా అన్నింట్లోనూ సత్తా చాటుతూ ఎనలేని క్రేజ్‌ను అందుకున్నాడు. సుధీర్ కు సగం క్రేజ్ తెచ్చి పెట్టింది రష్మీ. చాలా కాలంగా ఆమెతో వ్యవహారం నడుపుతున్నట్లు కనిపిస్తూ అందరిలో హాట్ టాపిక్ అయ్యాడు. సుదీర్ఘ కాలంగా సుధీర్ టీవీలో సత్తా చాటి ఇంక చాలనుకున్నాడో ఏమో ఈ క్రమంలోనే సినిమాల్లోకి కూడా అడుగు పెట్టాడు.

సుధీర్ ఇంట్లో సంబరాలు
ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రలను పోషించి హీరోగానూ మారి 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీమంకీస్' అనే సినిమాలు చేయగా ఇప్పుడు 'కాలింగ్ సహస్ర', 'గాలోడు', 'వాంటెడ్ పండుగాడ్' అనే సినిమాలు చేస్తున్నాడు. అసలు విషయం ఏమిటంటే తాజాగా సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు చేసుకుంటున్నారు. సుధీర్ తమ్ముడు రోహన్ గురించి కూడా బుల్లి తెర ప్రేక్షకులకు తెలుసు.

పండంటి మగబిడ్డకు
ఎందుకంటే అప్పుడప్పుడు సుధీర్ తమ్ముడు కూడా స్కిట్లలో కనిపిస్తుంటాడు. రోహన్ కూడా అప్పుడప్పుడు స్టేజి మీద కనిపిస్తూ పంచ్ డైలాగ్స్ తో అలరిస్తూ ఉంటాడు. అయితే సుధీర్ ఇంకా పెళ్లి చేసుకోలేదు కానీ రోహన్ సుధీర్ కంటే ముందుగానే వివాహం చేసుకున్నాడు. తాజా సమాచారం ఏమిటంటే రోహన్ భార్య ఇటీవలే డెలివరీ అయింది. ఆ డెలివరీలో రోహన్ భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని అంటున్నారు.

ఫామిలీ మొత్తం సంబరాలు
దీంతో సుధీర్ పెదనాన్న అయ్యాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సుడిగాలి సుధీర్ ఇంట సంబరాలు కూడా మొదలయ్యాయని అంటున్నారు. సుధీర్ తమ్ముడు రోహన్ తండ్రి కావడంతో సుదీర్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడట. సుధీర్ ఫామిలీ మొత్తం సంబరాలు చేసుకుంటుండగా ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు సుధీర్ కి సైతం విషెస్ చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











