For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నటి హేమ ఫ్రీగా ఉందంటూ సుధీర్ కామెంట్స్.. చెప్పుతో కొడతా అంటూ షాకింగ్ గా!

  |

  సుధీర్ యాంకర్ గా వ్యవహరిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం మంచి రేటింగ్ తో ముందుకు వెళుతుంది. నిజానికి ఈ ప్రోగ్రాం ముందు వేరే యాంకర్ తో ప్లాన్ చేశారు కానీ ఊహించనంత రేటింగ్స్ రాకపోవడంతో ఎట్టకేలకు జబర్దస్త్ సుధీర్ ను ఈ ప్రోగ్రాంకి యాంకర్ గా నియమించారు. అలాగే ముందు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఓనర్ గా రచయిత తోటపల్లి మధు వ్యవహరిస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు గ్లామర్ అందించడం కోసం ఇంద్రజను రంగంలోకి దింపారు. ఇక ఈ షో తాజా ప్రోమో ఆసక్తికరంగా సాగింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

   కిట్టీ పార్టీ థీం

  కిట్టీ పార్టీ థీం

  జబర్దస్త్ లో జడ్జిగా ఉన్న రోజా అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకోగా ఆమె రానని రోజులు ప్రోగ్రాంకి హాజరై ఆమె లేని లోటు తీర్చింది నటి ఇంద్రజ. అందుకే ఇంద్రజను తొలగించగానే పెద్ద ఎత్తున ఆమెకు మద్దతుగా కామెంట్లు వరదలా వచ్చి పడ్డాయి. ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకున్న మల్లెమాల సంస్థ శ్రీదేవి డ్రామా కంపెనీ కు ఆమెను యజమానిగా నియమించింది. ఇక ఈ షోలో ప్రతి వారం ఏదో థీం ఒక తీసుకుని ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు నిర్వాహకులు. అలాగే ఈ వారం కూడా ఒక కిట్టీ పార్టీ థీం తీసుకుని ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు.

  నాలుగు గుద్దులు గుద్దాను

  నాలుగు గుద్దులు గుద్దాను

  ఇక ఈ కిట్టి పార్టీకి నటి హేమ సహా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సునైనా అనే నటి కూడా హాజరయ్యారు. ఇక సుధీర్ ఎంట్రీ తర్వాత హేమ సుధీర్ మధ్య కొన్ని డైలాగులు పెట్టారు. కిట్టీ పార్టీ అనగానే సుధీర్ కూడా ఒక ముగ్గురు అమ్మాయిలను తీసుకొస్తాడు. వీళ్ళని ఎందుకు తీసుకువచ్చారు అని హేమ సుధీర్ అని ప్రశ్నిస్తుంది.

  దీంతో సుధీర్ కిట్టీ పార్టీ అన్నారు కదా అందుకే వీళ్ళను కూడా తీసుకు వచ్చాను అంటాడు. ఇంతకీ మీ ఆయన ఏడి అంటే నీ లాగే పక్క చూపులు చూస్తూ ఉంటే పక్కకు తీసుకెళ్లి నాలుగు గుద్దులు గుద్దాను అని అంటుంది. అంతే కాక నీకు ఏమి అర్థమైంది అంటే మీరు ఇప్పుడు ఫ్రీ గా ఉన్నారు అని అర్థం అయింది అంటూ షాక్ ఇస్తారు సుధీర్. వెంటనే అప్రమత్తమైన ఇమ్మానియేల్ సుధీర్ ని అక్కడి నుంచి తీసుకు వెళ్ళి పోతాడు.

  చెప్పుతో కొట్టాలి, నికృష్టుడు, దరిద్రుడు

  చెప్పుతో కొట్టాలి, నికృష్టుడు, దరిద్రుడు

  ఇక ఈ షోలో భాగంగా ఎవరో ఒకరు టాలెంట్ ఉన్న వ్యక్తులను తీసుకువచ్చి ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వారం శిరీష అనే ఒక ఫోక్ సింగర్ ను తీసుకు వచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ యూనిట్ ఆమె చేత ''ఏమే పిల్ల అన్నప్పుడల్లా గుచ్చే పూల బాణాలు'' అనే సాంగ్ పాడించి ప్రేక్షకులను మైమరపించేలా చేశారు.

  ఇక చాలా సేపు అతిథులుగా హాజరైన మిగతా వారు కూడా ఈ పాటకు లేచి డాన్స్ చేయడం కూడా కనిపించింది. ఇక ఈ పాట పాడిన తర్వాత ఎప్పటి లాగే జబర్దస్త్ పంచ్ ప్రసాద్ ఈ పాట పాడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కింద సౌండ్ సిస్టం వాళ్ళు తిడుతున్న సౌండ్స్ పెట్టారు. సెవెన్ బై జి బృందావన్ కాలనీలో సునీల్ శెట్టి అంటున్న తిట్లు వినిపించగా చెప్పుతో కొట్టాలి, నికృష్టుడు, దరిద్రుడు అంటున్న కామెంట్స్ ను సుధీర్ ని అన్నట్లుగా క్రియేట్ చేశాడు ప్రసాద్.

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్

  ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2వ తేదీ కావడంతో ఆయన కోసం స్పెషల్ సాంగ్స్ కూడా డెడికేట్ చేశారు శ్రీదేవి డ్రామా కంపెనీ యూనిట్ వాళ్ళు. పవన్ కళ్యాణ్ లేడీ అభిమానులు చెబుతూ డాన్స్ చేస్తున్న వీడియో కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అభిమానులం అని చెబుతూ షో కి విచ్చేసిన దాదాపు అందరూ లేడీస్ కూడా కాలు కదిపారు. దీంతో ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది అని చెప్పక తప్పదు. ఇక ఎప్పటిలాగే హైపర్ ఆది ఆటో రాంప్రసాద్ ల మధ్య కామెడీ ట్రాక్ కూడా బాగా చూపించారు. దీంతో షో మీద ఆసక్తి మరింత పెరిగింది.

  Mandakrishna Madiga Responded On 'Palasa 1978' Movie
  విజయశాంతికి ట్రిబ్యూట్

  విజయశాంతికి ట్రిబ్యూట్

  అలాగే విజయశాంతికి ట్రిబ్యూట్ అంటూ రోహిణి చేసిన రాములమ్మ స్కిట్ ఆకట్టుకుంది. ఆ సినిమాను మళ్ళీ మైమరిపించే విధంగా రోహిణి నటన ఉంది అని చెప్పక తప్పదు. రామిరెడ్డిగా నటించిన ఆటో రాంప్రసాద్ కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. రాములమ్మ మ్యాజిక్ ని మళ్లీ రీ క్రియేట్ చేయడంలో శ్రీదేవి డ్రామా కంపెనీ యూనిట్ సఫలం అయింది అని చెప్పక తప్పదు. ఇక అదే విధంగా ఎపిసోడ్ 29వ తారీకు ఆగస్టు నెలలో ప్రసారం కాబోతోంది.

  పవన్ కళ్యాణ్ కోసం డాన్సులు వేయించడంతో కచ్చితంగా ఈ ఎపిసోడ్ కి మంచి టిఆర్పిలు వస్తాయని నిర్వాహకులు భావిస్తున్నారు. అదీకాక హేమ, సునయన లాంటి గెస్ట్ లు కూడా రావడంతో ఎపిసోడ్ మీద ఆసక్తి నెలకొంది అని చెప్పక తప్పదు. మరి చూడాల్సి ఉంది ఆ అంచనాలను ఎపిసోడ్ మేరకు అందుకుంటుంది అనేది.

  English summary
  Sudigali Sudhir comments on hema gone viral in sridevi drama company latest promo. and in the promo tribute to pawan kalyan and vijayashanthi also shown.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X